pizza
Daggubati’s to Celebrate Dr. Rama Naidu’s Birthday with First Teaser of Rana’s ‘Nene Raju Nene Mantri’
ప్రఖ్యాత నిర్మాత దాదాసాహేబ్ ఫాల్కే డి.రామానాయకుడు జయంతి సందర్భంగా విడుదలకానున్న "నేనే రాజు నేనే మంత్రి" టీజర్ !!
You are at idlebrain.com > news today >
Follow Us

4 June 2017
Hyderabad

June 6th is very special day for Daggubati’s. On the eve of Movie Moghul Dr. Daggubati Rama Naidu’s birthday, Rana will release the first teaser of his next ‘Nene Raju Nene Mantri’ through his micro-blogging site @RanaDaggubati. The teaser that goes live on 6th June will give you a sneak peek into Jogendra’s attitude played by Rana.

“I love the audacity of jogendra in this film.” says Rana Daggubati. Nene Raju Nene Mantri is packed with gripping moments and this teaser is just a minute glimpse of Jogendra’s attitude.

All films Rana Daggubati had acted have been acclaimed for his courage to carve a distinct screen persona, Director Teja said. I wanted Nene Raju Nene Mantri vision to match not only the actor’s stature but also surpass the viewer’s expectation from this big promising actor.

Rejoicing the moment Producer Suresh Daggubati said “Nene Raju Nene Mantri’ would certainly be another landmark in Rana’s career and will bring diversity in his acting talent; this will be a stepping-stone to something even bigger.

The makers of the film have roped in big star cast for the film to ensure a grand appeal, Rana Daggubati, Kajal Aggarwal, Catherine Tresa, Navadeep and Ashutosh Rana play big stellar roles in the film. Directed by Teja, “Nene Raju Nene Mantri” is produced by Suresh Daggubati, CH Bharath Chowdhary and V Kiran Reddy under Suresh Productions and Blue Planet Entertainments.

ప్రఖ్యాత నిర్మాత దాదాసాహేబ్ ఫాల్కే డి.రామానాయకుడు జయంతి సందర్భంగా విడుదలకానున్న "నేనే రాజు నేనే మంత్రి" టీజర్ !!

జూన్ 6వ తేదీ దగ్గుబాటి వంశీయులకు మాత్రమే కాదు యావత్ తెలుగు సినిమా అభిమానులకు ప్రత్యేకమైన రోజు. నిర్మాతగా తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేయడంతోపాటు, అత్యధిక భాషల్లో చిత్రాలు నిర్మించినందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సైతం సంపాదించుకొన్న ఏకైక నిర్మాత డి.రామానాయుడు పుట్టినరోజు. ఆయన దూరమైనా దగ్గుబాటి కుటుంబం మాత్రమే కాదు ఏ తెలుగు సినిమా అభిమాని ఆయన్ను మరువడు. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా యువ కథానాయకుడు రామానాయుడు వారసుడు రాణా తన తాజా చిత్రమైన "నేనే రాజు నేనే మంత్రి" టీజర్ ను విడుదల చేయనున్నాడు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, బ్లూ ప్లానెట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బాబు-కిరణ్ రెడ్డి-భారత్ చౌదరి నిర్మాతలు. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పోలిటికల్ థ్రిల్లర్ లో రాణా సరసన కాజల్ కథానాయికగా నటిస్తోంది. జూన్ 6న రాణా తన ట్విట్టర్ ద్వారా "నేనే రాజు నేనే మంత్రి" టీజర్ ను విడుదల చేయనున్నాడు.

ఈ సందర్భంగా రాణా మాట్లాడుతూ.. "తాతగారి జయంతి సందర్భంగా "నేనే రాజు నేనే మంత్రి" టీజర్ ను విడుదల చేయనుండడం చాలా సంతోషంగా ఉంది. ఈ టీజర్ తో సినిమాలో నేను పోషిస్తున్న జోగేంద్ర పాత్ర స్వభావాన్ని పరిచయం చేయనున్నాను" అన్నారు.

చిత్ర దర్శకులు తేజ మాట్లాడుతూ.. "రాణా పర్సనాలిటీని మాత్రమే కాదు.. అతడిలోని నటుడ్ని పూర్తి వైవిధ్యంగా "నేనే రాజు నేనే మంత్రి" చిత్రంతో రీప్రజెంట్ చేస్తున్నాను. ప్రేక్షకులు ఊహించని విధంగా ఈ చిత్రంలో రాణా యాటిట్యూడ్ ఉంటుంది" అన్నారు.

సురేష్ బాబు మాట్లాడుతూ.. "రాణా కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచిపోయే చిత్రం "నేనే రాజు నేనే మంత్రి". నాన్నగారి జయంతి కానుకగా ఈ చిత్రం టీజర్ ను విడుదల చేయనుండడం చాలా సంతోషంగా ఉంది" అన్నారు.

రానా, కాజ‌ల్, అశితోష్ రాణా, కేథ‌రిన్ థెరిస్సా, న‌వ‌దీప్‌, పోసాని, జెపీ, ర‌ఘు కారుమంచి, బిత్తిరి స‌త్తి, ప్ర‌భాస్ శీను, శివాజీ రాజా, జోష్ ర‌వి, న‌వీన్ నేలి, ఫ‌న్ బ‌కెట్ మ‌హేష్ త‌దిత‌రులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

సంస్థ‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, బ్లూ ప్లానెట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
సంగీతం: అనూప్ రూబెన్స్‌
ఛాయాగ్ర‌హణం: వెంక‌ట్ సి.దిలీప్‌,
కూర్పు: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
క‌ళ‌: నారాయ‌ణ రెడ్డి
పరుచూరి బ్రదర్స్-లక్ష్మీ భూపాల్-సురేంద్ర కృష్ణ-శంకర్-రవివర్మ
నిర్మాత‌లు: సురేష్ బాబు, కిర‌ణ్ రెడ్డి, భ‌ర‌త్ చౌద‌రి
ఎగ్జిక్యూటీవ్ నిర్మాత‌లు: అభిరామ్ ద‌గ్గుబాటి, వివేక్ కూచిబొట్ల‌
స‌మ‌ర్ప‌ణ‌: డి. రామానాయుడు
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: తేజ‌ .

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved