pizza
NTR's look as Bheem from RRR unveiled.
‘‘వాడు పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ’’... అంటూ వరల్డ్‌వైడ్‌గా సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న 'రామరాజు ఫర్‌ భీమ్‌'
You are at idlebrain.com > news today >
 
Follow Us

22 October -2020
Hyderabad

 

 

India's most celebrated filmmaker is back with a bang. After giving the audience a reason to rejoice with the hugely appreciated glimpse of actor Ram Charan as Ramaraju, director Rajamouli and the team of RRR released the first sneak peek into NTR's avatar as Bheem and the response, as expected has been astounding.

Released earlier today, the visuals have left the audience in awe with NTR's look, which is the most different and poweful he has ever been seen in.

Director Rajamouli is presently shooting in Hyderabad with Ram Charan and NTR. After taking a very long break that was majorly forced by the pandemic that hit the entire world, the film's team got back to the sets with all necessary precautions in place.

Alia Bhatt, who plays a female lead in the film will join the sets in November. The rest of the cast, including Ajay Devgn and Olivia Morris will join in the upcoming schedules, the details of which will be unveiled soon.

All set for a 2021 release, RRR is India's biggest film and has a star cast that pans across languages. The film is set to be released in Telugu, Hindi, Tamil, Malayalam and Kannada amongst many other Indian languages.

RRR is a massive production that is being made on budget of Rs 450 crore. The film is a fictional story of celebrated freedom fighters Alluri Seetha Rama Raju and Komaram Bheem.


ఎంటైర్‌ ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్యాన్‌ ఇండియా మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం). ఈ చిత్రం నుండి 'రామరాజు ఫర్‌ భీమ్‌' కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌ 119వ జయంతి(అక్టోబర్‌ 22) సందర్భంగా 'రామరాజు ఫర్‌ భీమ్‌' టీజర్‌ను మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ విడుదల చేశారు.
కొమురం భీమ్‌ పాత్ర గురించి అల్లూరి సీతారామరాజు వెర్షన్‌లో సాగుతున్న ఈ టీజర్‌లో....

''
వాడు కనపడితే సముద్రాలు తడబడతాయి..నిలబడితే రాజ్యాలు సాగిలపడతాయి..

వాడు పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ

వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ..

నా తమ్ముడు, గోండు బెబ్బులి కొమురం భీమ్‌''

అంటూ రామ్‌చరణ్‌ చెబుతున్న డైలాగ్స్‌, ఎన్టీర్‌ నటనకు వరల్డ్‌వైడ్‌గా ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తుంది.

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో ప్యాన్‌ ఇండియా డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌, హైటెక్నికల్ వేల్యూ‌తో రూపొందుతోన్న ప్యాన్‌ ఇండియా మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం)'. డిి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్‌బ్యానర్‌పై స్టార్‌ ప్రొడ్యూసర్‌ డి.వి.వి.దానయ్య అన్‌కాంప్రమైజ్డ్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. 'బాహుబలి'తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌తో పాటు, భీమ్‌ ఫర్‌ రామరాజు టీజర్‌లకు వరల్డ్‌ వైడ్‌గా ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో 'రామరాజు ఫర్‌ భీమ్‌'కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూడసాగారు. గురువారం రోజున విడుదలైన ఈ టీజర్‌ చూస్తుంటే 'ఆర్‌ఆర్‌ఆర్‌'పై ఉన్న అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ ఎన్నో వైరటీ పాత్రల్లో మెప్పించారు. ఇప్పుడు ఆ పాత్రలను మించేలా డిఫరెంట్‌ లుక్‌తో ఇందులో కనపడుతున్నారు. నేలతల్లిని నమ్ముకున్న ఓ అడవిపుత్రుడు ఎలా ఉంటాడో అలా కనపడుతున్నారు ఎన్టీఆర్‌. సినిమాలో ఆయన లుక్‌, బాడీ షేప్‌ అందరినీ ఔరా! అనిపిస్తున్నాయి. రామ్‌చరణ్‌ పాత్రను నిప్పుతో పోల్చిన జక్కన్న, ఎన్టీఆర్‌ పాత్రను నీటితో పోల్చుతూ పవర్‌ఫుల్‌గా డిజైన్‌ చేసినట్లు కనిపిస్తోంది. ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందా..! అని అందరూ ఎదురుచూపుల్లో ఆతృత మరింత పెరిగింది...

కోవిడ్‌ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమా రీసెంట్‌గా రీస్టార్ట్‌ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా మేజర్‌ పార్ట్‌ చిత్రీకరణను పూరిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ చిత్రంలో నటించనున్న బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్‌ నవంబర్‌ నుండి షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. అలాగే సినిమాలో ఇతర కీలకపాత్రలో నటిస్తోన్న బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగణ్‌, హాలీవుడ్‌ స్టార్‌ ఓలివియా మోరిస్‌ ఇతర తారలు కొందరు తదుపరి షెడ్యూల్ జాయిన్‌ అవుతున్నారు.

రూ.450 కోట్ల రూపాయల భారీ బడ్టెట్‌తో, భారీ ప్యాన్‌ ఇండియా తారాగణంతో రూపొందుతోన్న ఈ ఫిక్షనల్‌ పీరియాడికల్‌ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా 2021లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేసుకుంటున్నారు.

 


 




   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved