pizza
ఓ అమ్మ కథ...ఇది నిజం.
You are at idlebrain.com > news today >
Follow Us

11 May 2015
Hyderabad

 

నా కాలేజీ రోజుల్లో నేను చిన్న పిల్లలకి Dance క్లాస్సులు తీసుకునేవాడిని. ఒక సారి నా brightest స్టూడెంట్ ఒక్కడిని తీసుకొని వాళ్ళ పేరెంట్స్ తో సహా Gemini TV డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రాం లో పార్టిసిపేట్ చేయించడానికి Vizag నుంచి Hyderabad వచ్చాము. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతున్న ఆ ప్రోగ్రాం లో మా వాడితో పాటు మరో హైదరాబాద్ పిల్లాడు కూడా సెలెక్ట్ అయ్యాడు. వాళ్ళ family , మేము ఆ రెండు రోజులు చాల కలిసిపోయాము, కబుర్లు చెప్పుకున్నాము. ఆ కుర్రాడు చాల బాగా డాన్సు చేసి ఆ age category లో ఫస్ట్ prize కొట్టాడు. మా వాడికి second prize వచ్చింది. కొంచెం బాధ పడ్డా ఆ కుర్రాడి టాలెంట్ ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాము. మేము వైజాగ్ వచ్చేసాము. మళ్ళీ ఆ కుర్రాడి తో గాని, వాళ్ళ తల్లి తండ్రులతో గాని మాట్లాడలేదు.

కొన్ని ఏళ్ళ తరువాత, ఒక పెద్ద హీరో సినిమా లో హీరో చిన్నప్పటి వేషం లో ఆ కుర్రాడు మళ్ళీ కనిపించాడు. అదరగొట్టాడు. ఆశ్చర్యపోయాను. అరె, ఈ పిల్లోడు నాకు తెలుసే అని అనుకొని పది మందికి చెప్పి సంబరపడ్డాను. అలా కొన్ని పెద్ద సినిమాల్లో చిన్నప్పటి హీరో గా కనిపించి మంచి పేరు సంపాదించుకున్నాడు. అతని dancing talent గురించి తెలిసిన నాకు ఈ అబ్బాయి ఇంకొంచెం పెద్దయాక ఖచ్చితంగా ఒక మంచి హీరో అవుతాడని అనిపించింది.

ఓ పక్క నా జీవన ప్రయాణం కూడా ఒక roller coaster లాగ సాగుతూనే ఉంది. ఈ లోపు ఒక సారి ఇంటర్నెట్ లో హీరో గా రాబోతున్న చైల్డ్ ఆర్టిస్ట్ అనే article చదివాను. అదే కుర్రాడు.. మొత్తానికి సాధించాడు, నేను అనుకున్నది నిజమైంది అని సంతోషించాను. మళ్ళీ కొన్ని రోజుల తరువాత అతని ఇంకో సినిమా మొదలైంది. అబ్బా.. super కదా అనుకున్నాను. కానీ ఆ సినిమాలు విడుదల అయ్యాయో లేదో అన్నట్టుగా వెళ్ళిపోయాయి. ఆ కుర్రాడు అదే పనిగా సినిమాలు ఒప్పుకున్నాడు. అతని టాలెంట్ కి రావలసిన పేరు మాత్రం రాలేదు. ఎందుకు ఇలా చేస్తున్నాడబ్బా అనుకున్నాను.

"లైఫ్ is బ్యూటిఫుల్" release తరువాత ఒకసారి కలిసాను. చిన్నప్పటి సంఘటల్ని గుర్తు చేసాను. అప్పటి నుంచి నన్ను ఆప్యాయంగా "అన్నయ్యా" అంటూ తన సినిమా ఆడియో ఫంక్షన్ లకి పిలిచేవాడు. ఓ రెండింటికి వెళ్లాను కూడా. చిన్నప్పటి సంగతులు కూడా చెప్పి ఆ కుర్రాడిని ప్రశంసించాను. ఈ లోపు అతను చేసిన ఒక చిన్న సినిమా పెద్ద హిట్ అయ్యింది. కాని డైరెక్టర్ కి తప్ప ఈ కుర్రాడికి అంత గా పేరు, అతను ఆశించినట్టుగా అవకాశాలు రాలేదు. కాని అతనికి వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ అదే బాట పట్టాడేంటి అని బాధపడ్డాను. కొంచెం కోప్పడ్డాను.

ఈలోగా, ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన తల్లి అనారోగ్యం కారణంగా తనకు వచ్చిన ప్రతీ సినిమా చేస్తున్నానని, ఇప్పుడు వాళ్ళ అమ్మ ఆరోగ్యంగా ఉంది, కనుక తరువాతి సినిమాలు చాల జాగ్రతగా సెలెక్ట్ చేసుకుంటాను అని. ఓహ్.. ఇదా సంగతి. పాపం అనుకున్నాను. నన్ను నేను తిట్టుకున్నాను. తొందరగా మంచి break వస్తే బాగుండు అని ఆశించాను.

ఇంతలో , నిన్న ఒక విషాద వార్త విన్నాను. ఆ కుర్రాడి అమ్మ గారు lung cancer తో మరణించారని ...పెద్ద షాక్.

ఇవాళ వెళ్లి ఆ తల్లీ కొడుకుల్ని ఇద్దర్నీ చూసాను. ఆ కుర్రాడిని కలిసిన మొదటి సారి ఆమెతో చూసాను. ఇది రెండో సారి... ఆఖరి సారి. తట్టుకోలేకపోయాను...గతం అంత మళ్ళీ నా కాళ్ళ ముందు తిరిగింది.

అందరూ Mothers day పేరు తో వాళ్ళ అమ్మలకి ఏవేవో గిఫ్ట్స్ ఇస్తుంటే ఇతను వాళ్ళమ్మకి ఈ క్షణంలో అత్యంత అమూల్యమైన బహుమతి ఇచ్చాడు..."తల కొరివి".

చాల బాధ కలిగింది. ఆ అమ్మ ఆశను, అతని ఆశయాన్ని నెరవేర్చి జీవితం లో చాల పైకి రావాలని, ఆ అమ్మ ఆయుష్షు, ఆశీస్సులు అతనకి ఎల్లకాలం ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఫిలిం ఇండస్ట్రీ లో చాల మంది ఆత్మీయులతో పాటు నేను కూడా అతనికి నా చేతనైన సాయం చేస్తానని మాట ఇస్తున్నాను. ఆ కుర్రాడు కూడా తనకి తాను సాయం చేసుకొని ఆత్మస్థైర్యం తో ముందు వెళతాడని ఆశిస్తూ, ఆ బంగారు తల్లి ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటూ ....

మనోజ్ నందం , we are with you ...

- సుధాకర్ కోమాకుల.


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved