pizza
Mahesh appreciates Oka Ammai Thappa trailer
‘ఒక్క అమ్మాయి తప్ప’ ట్రైలర్ ను మెచ్చుకున్న మహేష్ బాబు
You are at idlebrain.com > news today >
Follow Us

28 May 2016
Hyderaba
d

 

Sundeep Kishan is playing the lead role in the movie 'Okka Ammayi Thappa'. Nithya Menen, who is known for choosing films with strong content, is playing the female lead. The film is being readied for a June 10th release and the censor formalities will be completed later this week. The release date will be formally announced once the censor certification is done.

Rajasimha Tadinada is making his debut as a director with this project. He has worked as a writer for many successful films in the past. Rajasimha showed the theatrical trailer of the movie to Superstar Mahesh Babu recently and Mahesh appreciated the debut director. Mahesh Babu asked details about the story and he went on to commend the visual effects quality in the trailer as well.

I have known Mahesh Babu garu since Takkari Donga. He loved the trailer and appreciated me. I am very grateful to him ", said director Rajasimha Tadinada.

Sundeep Kishan, Nithya Menen, Revathi, Ravi Kishen, Ali,Ajay, Thanikella Bharani, Brahmaji, Rahul Dev, Saptagiri, Thagubothu Ramesh, Nalini and other senior actors will be seen in this film.

Cinematography: Chota K Naidu , Art : Chinna, Music: Mickey J Meyer , Editing : Goutham Raju , Lyrics : Sri Mani, Shashi Jyothsna and Dr. Meegada Ramalinga Sharma, Executive Producer : Alla Rambabu, Co - Producer : Madhavi Vasipalli,Bogadhi Swech Reddy. Producer: Bogadhi Anji Reddy , Story - Screenplay -Direction : Rajasimha Tadinada

 

ప్ర‌స్థానం' వంటి డిఫ‌రెంట్ మూవీతో సినిమా రంగానికి ప‌రిచ‌య‌మైన సందీప్‌ కిష‌న్‌ హీరో గా నటించిన చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. కథా బలం ఉన్న సినిమాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే విలక్షణమైన నటి నిత్యా మీనన్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది. అంజిరెడ్డి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్నో చిత్రాలకు రచయితగా పనిచేసిన రాజసింహ తాడినాడ దర్శకత్వంలో మంచి అభిరుచి గల నిర్మాత గా, ఎగ్జిబిటర్ గా పేరు తెచ్చుకున్న బోగాది అంజిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కి జె.మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా జూన్ 10 న విడుదల అయ్యేందుకు రెడీ అవుతోంది.

ఈ సినిమా ట్రైలర్ కు యూ ట్యూబ్ లో ఇప్పటికే 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి . ఈ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం మెచ్చుకోవటం గమనార్హం. టక్కరి దొంగ సినిమా రోజుల నుండి దర్శకులు రాజసింహ కు మహేష్ బాబు తో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ క్రమం లో నే ఈ చిత్రం ట్రైలర్ ను మహేష్ బాబు కు చూపించటం జరిగింది. చిత్రం కథ గురించి, కథనం గురించి అడిగి తెలుసుకున్న మహేష్ బాబు, రాజసింహ చూపించిన ట్రైలర్ ను చూసి మెచ్చుకున్నారు. చిత్రం లో ని గ్రాఫిక్స్ వర్క్ కూడా చాలా బాగుంది అని ప్రత్యేకం గా మహేష్ బాబు అభినందించారు.

దర్శకుడు రాజసింహ మాట్లాడుతూ ‘’నేను జయంత్ గారి వద్ద, అలాగే పరుచూరి బ్రదర్స్ దగ్గర అసోసియేట్ రైటర్ గా వర్క్ చేశాను. ఇండిపెండెంట్ రైటర్ గా కూడా 15 సినిమాలకు పనిచేశాను. 2007లో ఈ సినిమా కథను రాసుకున్నాను . ఇటీవలే మహేష్ బాబు గారిని కలిసి ట్రైలర్ ను చూపించాను. ఆయనకు ట్రైలర్ ఎంతగానో నచ్చింది", అని అన్నారు.

ఈ వారం లో నే ‘ఒక్క అమ్మాయి తప్ప’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేస్తాం అని నిర్మాత బోగాది అంజిరెడ్డి అన్నారు. " జూన్ 10 న భారీ ఎత్తున రిలీజ్ చేయటానికి ప్లాన్ చేసాము. ఈ వారం లో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత విడుదల తేదీని అధికారికం గా ప్రకటిస్తాము. సందీప్‌ కిష‌న్‌ కెరీర్ లో ఈ చిత్రం ఒక మయిలు రాయి వంటిది. ఇటీవలే విడుదల అయిన ఆడియో ఆల్బం ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు . మా . ", అని ఆయన అన్నారు.

నటీ నటులు - సందీప్ కిషన్, నిత్యా మీనన్ , రేవతి , రవి కిషెన్, అలీ, అజయ్,బ్రహ్మాజీ, తనికెళ్ళభరణి, రాహుల్ దేవ్, పృథ్వీ, సప్తగిరి, తాగుబోతు రమేష్,నళిని, జ్యోతి తదితరులు.

సినిమాటోగ్రాఫర్‌: ఛోటా కె.నాయుడు,

ఆర్ట్‌: చిన్నా,

మ్యూజిక్‌: మిక్కి జె.మేయర్‌,

ఎడిటింగ్‌: గౌతంరాజు,

పాటలు : శ్రీమణి, శ్రీ శశి జ్యోత్న్స మరియు డాక్టర్ మీగడ రామలింగ శర్మ ,

ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఆళ్ళ రాంబాబు,

సహ నిర్మాతలు : మాధవి వాసిపల్లి, బోగాది స్వేచ్ రెడ్డి ,

నిర్మాత: బోగాది అంజిరెడ్డి,

కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : రాజసింహ తాడినాడ

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved