pizza
One Stop Creations Movie Announcement
You are at idlebrain.com > news today >
Follow Us

20 May 2015
Hyderabad

‘ఒన్‌ స్టాప్‌ ఫర్‌ యు ప్రై.లి.’ పేరుతో ముంబయి ప్రధాన కేంద్రంగా నెలకొల్పిన సంస్థ ద్వారా.. ‘మేన్‌ పవర్‌ మొదలుకొని, రియల్‌ ఎస్టేట్‌, ట్రావెల్స్‌, సాఫ్ట్‌వేర్‌, షేర్‌ మార్కెట్‌’ వరకు పలు రంగాల్లో ప్రభావవంతమైన సేవలందిస్తున్న యువ వ్యాపారవేత్త ‘ఉప్పాడ కనకరాజు’.. సినిమా రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ‘ఒన్‌ స్టాప్‌ క్రియేషన్స్‌’ పేరిట నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి.. ఫ్యామిలీ సెంటిమెంట్‌ బ్యాక్‌డ్రాప్‌తో ఓ క్యూట్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ను రూపొందించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. ‘దమ్మున్నోడు, కోడిపుంజు’ చిత్రాల ద్వారా తన ప్రతిభను నిరూపించుకొన్న బి.వి.వి.చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీమతి కమలాదేవి సమర్పిస్తున్నారు. ప్రస్తుతం హీరోహీరోయిన్లు, ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల ఎంపిక జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌కు వెళ్లనుంది.

‘ఒన్‌స్టాప్‌ క్రియేషన్స్‌’ అధినేత ఉప్పాడ కనకరాజు మాట్లాడుతూ... ‘‘మా ‘ఒన్‌ స్టాప్‌’ సంస్థను సినిమా రంగంలోకి కూడా విస్తరింపజేయాలన్న ఆలోచనతో ‘ఒన్‌ స్టాప్‌ క్రియేషన్స్‌’ ఏర్పాటు చేసి.. కథలు వినడం మొదలుపెట్టాం. చాలా కథలు విన్నాక.. బి.వి.వి.చౌదరి చెప్పిన ఫ్యామిలీ సెంటిమెంట్‌తో కూడిన లవ్‌ ఎంటర్‌టైనర్‌ చాలా బాగా నచ్చింది. ప్రస్తుతం హీరోహీరోయిన్లు, నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.

ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: యం.విజయవర్ధనరావు, సమర్పణ: శ్రీమతి కమలాదేవి, నిర్మాత: ఉప్పాడ కనకరాజు, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: బి.వి.వి.చౌదరి!!

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved