pizza
Oopiri Storm to Continue at Box Office
ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోన్న నాగార్జున, కార్తీ, పివిపిల 'ఊపిరి'
You are at idlebrain.com > news today >
Follow Us

29 March 2016
Hyderaba
d

Oopiri that released last week has been declared as a mega block buster and it is one of the few movies in recent times that has been unanimously applauded. Despite the so called lean season of March and exam lull in the market, Oopiri has surpassed the expectations of the trade and the industry. Hailed as Nagarjuna's hat trick block buster, Oopiri is set to collect massively through out the summer season.

Critics like Taran Adarsh and Subash Jha have reviewed Oopiri in glowing terms and they have declared it as one of the best movies in recent times. In overseas trade, Oopiri is opening up new avenues for showcasing by being screened in countries like Botswana, Tanzania, Kenya and Thailand. These countries are not the regular centres for Telugu movies and the extremely positive talk has prompted exhibitors from different countries to come forward for screening.

It is already well documented by Forbes magazine and other media, that Oopiri is doing very well in USA and collected close to a million dollars in the first weekend itself that too at regular, non-premium ticket prices. In the neighbouring state of Karnataka, it has opened very well with strong collections.

With its clean, family friendly content, Oopiri is a landmark film that will be among the all time greats of Telugu Cinema. The success of such a movie cannot be measured based on the box office performance of just five days but over the entire summer season.

కింగ్‌ నాగార్జున, ఆవారా కార్తీ, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే నిర్మించిన భారీ మల్టీస్టారర్‌ 'ఊపిరి'. తెలుగు, తమిళ భాషల్లో ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది.

ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్‌ వి. పొట్లూరి మాట్లాడుతూ - ''మా 'ఊపిరి' చిత్రానికి యునానిమస్‌గా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అనే టాక్‌ వచ్చింది. ఈమధ్యకాలంలో వచ్చిన కొన్ని సూపర్‌హిట్‌ చిత్రాల్లో 'ఊపిరి' కూడా ఒకటి కావడం ఆనందంగా వుంది. స్టూడెంట్స్‌కి ఎగ్జామ్స్‌ జరుగుతున్న టైమ్‌లో ఈ చిత్రం రిలీజ్‌ చెయ్యడం సరికాదన్న టాక్‌ ట్రేడ్‌వర్గాల్లో వినిపించింది. కానీ, దాన్ని అధిగమించి 'ఊపిరి' చిత్రం సూపర్‌హిట్‌ అయి ట్రేడ్‌ని, ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. నాగార్జునగారికి హ్యాట్రిక్‌ చిత్రంగా నిలిచిన 'ఊపిరి' ఈ సమ్మర్‌లో అత్యధికంగా కలెక్ట్‌ చేసే చిత్రం కాబోతోంది. ఈ చిత్రం చూసిన తరణ్‌ ఆదర్శ్‌, సుభాష్‌ ఝా వంటి ఫిల్మ్‌ క్రిటిక్స్‌ ఈమధ్యకాలంలో వచ్చిన బెస్ట్‌ మూవీస్‌లో 'ఊపిరి' కూడా ఒకటి అని అప్రిషియేట్‌ చేశారు. ఇంటర్నేషనల్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ ఈ చిత్రం సాధించిన ఘనవిజయంపై ఆర్టికల్స్‌ ప్రచురించడం విశేషం. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. రెగ్యులర్‌గా తెలుగు సినిమాలు ప్రదర్శించని బొత్స్‌వానా, టాంజానియా, కెన్యా, థాయ్‌లాండ్‌ వంటి దేశాల్లో కూడా ఈ చిత్రం ప్రదర్శింపబడి సూపర్‌హిట్‌ టాక్‌తో రన్‌ అవుతోంది. దీంతో మిగతా దేశాల్లోని ఎగ్జిబిటర్స్‌ కూడా ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు ముందుకు వస్తున్నారు. యు.ఎస్‌.లో ఈ చిత్రం ఫస్ట్‌ వీకెండ్‌లో నాన్‌ ప్రీమియమ్‌ టిక్కెట్‌ ధరలతో ఒక మిలియన్‌ డాలర్స్‌ కలెక్ట్‌ చేసింది. అలాగే కర్ణాటకలో భారీ ఓపెనింగ్స్‌తో దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది. క్లీన్‌ మూవీగా, ఫ్యామిలీ, ఫ్రెండ్లీ కంటెంట్‌తో రూపొందిన 'ఊపిరి'ని తెలుగులో ఓ లాండ్‌ మార్క్‌ మూవీ అని అందరూ ప్రశంసిస్తున్నారు'' అన్నారు.

కింగ్‌ నాగార్జున, 'ఆవారా' కార్తీ, తమన్నా భాటియా, సహజనటి జయసుధ, ప్రకాష్‌రాజ్‌, కల్పన, ఆలీ, తనికెళ్ళ భరణిలతోపాటు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ భారీ మల్టీస్టారర్‌కు సంగీతం: గోపీసుందర్‌, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, ఎడిటింగ్‌: మధు, ఫైట్స్‌: కలోయిన్‌ ఒదెనిచరోవ్‌, కె.రవివర్మ, సిల్వ, డాన్స్‌: రాజు సుందరం, బృంద, స్టోరీ అడాప్షన్‌: వంశీ పైడిపల్లి, సాల్మన్‌, హరి, మాటలు: అబ్బూరి రవి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సునీల్‌బాబు, సమర్పణ: పెరల్‌ వి.పొట్లూరి, నిర్మాతలు: పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved