pizza

International OTT platforms and their Indian reach
ఇంట‌ర్నేష‌న‌ల్ ఓటీటీ మాధ్య‌మాల‌కు ఇండియాలో ద‌క్కుతున్న ఆద‌ర‌ణ‌

You are at idlebrain.com > news today >
Follow Us

27 January 2022
Hyderabad

We have got three dominant international OTT players in India - HotStar, Amazon Prime Video and Netflix. As per the latest estimates, here is their Indian subscription base (these are unconfirmed numbers)

Hotstar - 4.6 crores
Amazon Prime - 2.17 crores
Netflix - 55 lakhs

Hotstar
Hotstar is the OTT app of Star Network which has one of the best sports channels Star Sports. Star also owns some of the biggest regional channels like MAA in Telugu and Vijay in Tamil. It has acquired such a huge base for showing cricket matches (especially IPL a few years back). Star Movies is also a good contributor to this platform. HotStar is the number one OTT app mostly due to streaming of cricket matches. It also acquired a few Telugu films and the latest one being NBK’s blockbuster Akhanda.

Price Range: Rs. 499 to Rs 1,499 (per annum)

Amazon Prime Video
Amazon Prime Video is the most successful OTT platform in terms of movie content acquisition. It has acquired/produced many serieses and movies in India. It has also taken a keen interest in regional content like Telugu. Holding Amazon Prime membership serves two purposes - watching OTT content and getting amazon shopped goods delivered free of cost. The latest Telugu release on Amazon Prime was Pushpa. However, Amazon Prime Video has increased its annual subscription by 50% in December 2021 (it used to be Rs 999 earlier. Now it costs Rs 1,499).

Price Range: Rs 1,499 (per annum)

Netflix
Netflix is an exclusive OTT platform that's established only with the objective of online streaming. Amazon Prime Video and HotStar are diversified (from online shopping to online streaming) and expansion plans (from TV relay to online streaming) respectively. Netflix had a focussed objective of giving the best quality product by either buying or producing content from studios/TV networks. Most of the subscribers of Netflix are English film fans. Hence the focus on regional content is little less compared to the other OTT platforms. Hence the subscription base is far less as it’s meant exclusive for cinephiles. Netflix has recently decreased the subscription prices to attract more subscribers.

Price Range: Rs 149 to Rs 649 (per month)

Most of these OTT platforms are also allowing regional content on a revenue-sharing basis. The owners of the content would be paid on a minutes-watched basis.

Most of the producers are selling their films to whoever bids more. But, selling their films to platforms with more subscribers helps in getting movies to reach more number of movie lovers. For example, Akhanda and Shyam Singha Roy were released on the same day (21 January 2021) on two different platforms (Akhanda on HotStar and Shyam Singha Roy on Netflix). Akhanda created a record as the most watched film on day one in OTT platforms for the obvious reason apart from being a blockbuster in theaters. Hotstar has 8 times more subscribers than Netflix.

Note: The subscription-base numbers are suggestive. Not completely accurate.

ఇంట‌ర్నేష‌న‌ల్ ఓటీటీ మాధ్య‌మాల‌కు ఇండియాలో ద‌క్కుతున్న ఆద‌ర‌ణ‌

ట్రెండ్ నెమ్మ‌దిగా మారుతుంది. డిజిట‌ల్ మాధ్య‌మాల‌కు కూడా ఆడియెన్స్‌లో క్ర‌మంగా ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. ముఖ్యంగా మ‌న భార‌త‌దేశంలో మూడు అంత‌ర్జాతీయ ఓటీటీ మాధ్య‌మాలైన హాట్ స్టార్‌, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌ల‌కు ఎక్కువ ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. ఈ ఆద‌ర‌ణ‌ను స‌ద‌రు ఓటీటీ మాధ్య‌మాల‌కు ఉన్న సబ్ స్క్రైబ‌ర్స్ ఆధారంగా చేసుకున్నాం.

మ‌న దేశంలో హాట్ స్టార్ - 4.6 కోట్లు
అమెజాన్ ప్రైమ్ - 2.17 కోట్లు
నెట్‌ఫ్లిక్స్ - 55 ల‌క్ష‌ల మంది స‌బ్ స్క్రైబ‌ర్స్ ఉన్నారు.

హాట్ స్టార్‌
బెస్ట్ స్పోర్ట్స్ ఛానెల్స్‌ను ప్ర‌సారం చేసే స‌ట్ఆర్ నెట్ వ‌ర్క్‌కు సంబంధించిన ఓటీటీ మాధ్య‌మం హాట్ స్టార్‌. అలాగే స్టార్ నెట్ వ‌ర్క్ ప్రాంతీయ భాష‌ల్లోనూ ఛానెల్ నెట్ వ‌ర్క్‌ను క‌లిగి ఉంది. ఉదాహ‌ర‌ణ‌కు తెలుగులో మా టీవీ.. త‌మిళంలో విజ‌య్ టీవీ వంటివి ఈ కోవ‌లోకి వ‌స్తాయి. స్టార్ మూవీస్ కూడా త‌న వంతు భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తుంది. వీట‌న్నింటితో ట‌చ్ ఉన్న హాట్ స్టార్ ఓటీటీలో ప్ర‌ధాన‌మైన క్రికెట్ మ్యాచ్‌లన్నీ ప్రసారం అవుతుంటాయి. అలాగే భారీ హిట్ చిత్రాల‌కు సంబంధించిన హ‌క్కుల‌ను కూడా హాట్ స్టార్ సొంతం చేసుకుంది. రీసెంట్‌గా నంద‌మూరి బాల‌కృష్ణ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ అఖండ కూడా హాట్ స్టార్‌లో ప్ర‌సారం అవుతుంది. ఇందులో స‌బ్ స్క్రైబ్ కావాలంటే ఏడాది రూ.499 - రూ.1499 ప్రీమియం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో
సరికొత్త సినిమాల‌ను ఇండియ‌న్స్‌కు అందిస్తూ విజ‌య‌వంతంగా దూసుకెళ్తోన్న ఓటీటీ మాధ్య‌మం అమెజాన్ ప్రైమ్‌. ఈ మాధ్య‌మం ప‌లు ప్ర‌సార హ‌క్కుల‌ను సొంతం చేసుకోవ‌డం, డైరెక్ట్‌గా విడుద‌ల చేయ‌డం వంటి ప‌నుల‌తో పాటు ప‌లు వెబ్ సిరీస్‌ల‌ను సొంతంగా నిర్మించింది. ఎక్కువ మంది అమెజాన్ ప్రైమ్‌లో స‌బ్ స్క్రిప్ష‌న్‌ను క‌లిగి ఉండ‌టానికి ప్ర‌ధాన కార‌ణం..సినిమాల‌ను, వెబ్ సిరీస్‌ల‌ను చూడ‌ట‌మే కాదు.. అమెజాన్ ద్వారా ఆన్‌లైన్‌లో ఏదేని వ‌స్తువుల‌ను కొనుగోలు చేసిన‌ప్పుడు వాటికి ఎలాంటి ఛార్జీల‌ను విధించ‌రు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ప్రీమియం ఛార్జీలు పెరిగాయి. ఇది వ‌ర‌కు అమెజాన్ ప్రైమ్‌కు రూ.999 ప్రీమియం అమౌంట్‌గా ఏడాదికి చెల్లించాల్సి ఉండేది. కానీ 2021 డిసెంబ‌ర్ నుంచి ఇది 50 శాతం పెరిగింది. అంటే ఇప్పుడు ఏడాదికి అమెజాన్ ప్రైమ్ స‌బ్ స్క్రిప్ష‌న్ కోసం రూ.1499 చెల్లించాల్సి ఉంటుంది.

నెట్‌ఫ్లిక్స్‌
ఎక్స్‌క్లూజివ్ ఆన్ లైన్ కంటెంట్‌ను ఆడియెన్స్‌కు అందించే ఓటీటీ మాధ్య‌మం నెట్‌ఫ్లిక్స్‌. బెస్ట్ క్వాలిటీ ఉన్న ప్రొడ‌క్ట్స్‌ను అందించ‌డ‌మే ల‌క్ష్యంగా నెట్‌ఫ్లిక్స్ వ‌ర్క్ చేస్తుంటుంది. ప‌లు స్టూడియోస్‌, టీవీ నెట్ వ‌ర్క్స్‌తో నేరుగా మాట్లాడి కంటెంట్‌ను ఆడియెన్స్‌కు అందిస్తుంటుంది నెట్‌ఫ్లిక్స్‌. ఇంగ్లీష్ చిత్రాల‌ను చూడాల‌నుకునే ప్రేక్ష‌కులు, చూసే ఆడియెన్స్ నెట్‌ఫ్లిక్స్‌కు సబ్ స్క్రైబ‌ర్స్‌గా ఉంటారు. ఇత‌ర ఓటీటీ కంటెంట్స్‌తో పోల్చితే ప్రాంతీయ కంటెంట్ నెట్ ఫ్లిక్స్‌లో త‌క్కువ‌గా ఉంటుంది. ఎక్కువ మంది సబ్ స్క్రైబ‌ర్స్ కోసం నెట్ ఫ్లిక్స్ నెల‌కు రూ.149 నుంచి రూ.649 మొత్తంతో నెల‌వారీ స‌బ్ స్క్రిప్ష‌న్‌ను పొంద‌వ‌చ్చు.

చాలా ఓటీటీ మాధ్య‌మాలు రీజన‌ల్ కంటెంట్స్‌కు సంబంధించిన రెవెన్యూని షేరింగ్ బేసిస్‌లో అందిస్తుంటాయి. మినిట్స్ వాచ్ లెక్క‌లో నిజ‌మైన కంటెంట్ ఓన‌ర్స్‌కు ఆదాయాన్ని ఓటీటీ మాధ్య‌మాలు ఇస్తుంటాయి.

సాధార‌ణంగా ఎవ‌రైతే ఎక్కువ మొత్తంలో త‌న సినిమాల‌కు, సిరీస్‌ల‌కు మొత్తాన్ని ఇవ్వాల‌నుకుంటారో అలాంటి ఓటీటీ మాధ్య‌మాల‌కే నిర్మాత‌ల‌కు వారి ప్రొడ‌క్ట్‌ను ఇవ్వ‌డానికి ఆస‌క్తి చూపిస్తారు. మ‌రో వైపు నిర్మాతలు ఎక్కువ సబ్ స్క్రైబ‌ర్స్ ఉండే మాధ్య‌మాల‌కు వారి సినిమాల‌ను, సిరీస్‌ల‌ను ఇవ్వ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంటారు. అందుకు కార‌ణం, ఎక్కువ మంది ఆడియెన్స్‌కు అది రీచ్ కావాల‌ని వారు భావించ‌డ‌మే. ఉదాహ‌ర‌ణ‌కు అఖండ‌, శ్యామ్ సింగ‌రాయ్ చిత్రాలు ఒకేరోజు (జ‌న‌వ‌రి 21) వేర్వేరు సామాజిక మాధ్యమాల్లో విడుద‌ల‌య్యాయి. అందులో అఖండ సినిమా ఓటీటీలో వ్యూస్ ప‌రంగా స‌రికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేయ‌డం విశేషం. హాట్ స్టార్‌కు నెట్‌ఫ్లిక్స్ కంటే 8 రెట్లు స‌బ్ స్క్రైబ‌ర్స్ ఉండ‌ట‌మే ఓ కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved