pizza
Gopichand Oxygen Release Date October 27
అక్టోబ‌ర్ 27న గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` రిలీజ్ డేట్‌
You are at idlebrain.com > news today >
Follow Us

22 September 2017
Hyderabad

Macho hero Gopichand’s most awaited action entertainer Oxygen is finally hitting the screens. Directed by AM Jothi Krishna and produced by S Aishwarya on Sri Sai Raam Creations, the film is all set for a massive release on October 27, informs the producer.

Oxygen is a thorough commercial entertainer boasting high technical standards and also has huge casting which promises a special film in Gopichand career. On this occasion, producer Aishwarya said:

“Gopichand’s dedication and support proved to be an immense help us in wrapping the complete shooting part and post production works. Presently, we are ready with the first copy and Oxygen is all set hit the screens on October 27th. Two beautiful heroines Rashi Khanna and Anu Emmanuel romanced Gopichand in the film.

Oxygen is high quality product shot in locations like Mumbai, Goa, Sikkim and Chennai with mind blowing CG works. While the release date locked for October 27, we will be unveiling the audio scored by Yuvan Shankar Raja in October first week. We promise Oxygen to mark the next level of commerciality in Gopichand’s aura as action hero.”

Casting:
Gopichand, Jagapathi Babu, Raashi Khanna, Anu Emmanuel, Kick Shyaam, Ali, Chandramohan, Nagineedu, Brahmaji, Abhumanyu Singh, Amith, Prabhakar, Sayaji Shinde, Ashish Vidhyarthi, Vennela Kishore, Thagubothu Ramesh, Sithara and others

Technicians:
Action: Peter Heins & Stunt Silva
Choroegrapher: Brinda
DOP: Vetri & Chota K Naidu
Editing: SB Uddhav
Music: Yuvan Shankar Raja
Lyrics: Srimani, Ramajogayya Shastri
Producer: S Aishwarya
Story, Screenplay and Direction: AM Jothi Krishna

అక్టోబ‌ర్ 27న గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` రిలీజ్ డేట్‌

మ్యాచో హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ `ఆక్సిజన్`. గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఇమ్యాన్యుయేల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. అక్టోబ‌ర్ 27న సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా....

చిత్ర నిర్మాత ఎస్.ఐశ్వర్య మాట్లాడుతూ.. " హై టెక్నిక‌ల్ స్టాండ‌ర్ వేల్యూస్‌తో క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో రూపొందిన ఈ చిత్రం గోపీచంద్‌గారి కెరీర్‌లోనే స్పెష‌ల్ మూవీ అవుతుంది. గోపీచంద్‌గారు డేడికేష‌న్‌, స‌పోర్ట్‌తో సినిమాను చ‌క్క‌గా పూర్తి చేయ‌గ‌లిగాం. ఫ‌స్ట్ కాపీ సిద్ధ‌మైంది. సినిమాను అక్టోబ‌ర్ 27న విడుద‌ల చేస్తున్నాం. ముంబై, గోవా, సిక్కిం, చెన్నై త‌దిత‌ర ప్రాంతాల్లో మేకింగ్‌లో ఎక్కడా రాజీపడకుండా ఆక్సిజ‌న్ చిత్రాన్ని రూపొందించాం. జ‌గ‌ప‌తిబాబుగారు సినిమాలో కీల‌క‌పాత్ర పోషించారు. ఆయ‌న న‌ట‌న‌కు సినిమాకు పెద్ద ప్ల‌స్ అవుతుంది. సీజీ వ‌ర్క్స్ అద్భుతంగా చేశాం. యువన్ శంకర్ రాజా సంగీత సారధ్యంలో రూపొందిన పాట‌ల‌ను అక్టోబ‌ర్ మొద‌టివారంలో విడుద‌ల చేసి, సినిమాను అక్టోబ‌ర్ 27న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. అక్టోబర్ 27న చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం" అన్నారు.

జగపతిబాబు, కిక్ శ్యామ్, అలీ, చంద్రమోహన్, నాగినీడు, బ్రహ్మాజీ, అభిమన్యు సింగ్, అమిత్, ప్రభాకర్, సాయాజీ షిండే, ఆశిష్ విద్యార్ధి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, సితార తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్: పీటర్ హైన్స్-స్టంట్ సిల్వ, కొరియోగ్రఫీ: బృంద, సినిమాటోగ్రఫీ: వెట్రి-ఛోటా కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.బి.ఉద్ధవ్, మ్యూజిక్: యువన్ శంకర్ రాజా, లిరిక్స్: శ్రీమణి-రామజోగయ్య శాస్త్రి, నిర్మాత: ఎస్.ఐశ్వర్య, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఏ.ఎం.జ్యోతికృష్ణ.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved