pizza
Paisa Vasool gets U/A, film release on 1 September
నందమూరి బాలకృష్ణ–పూరి జగన్నాథ్‌– భవ్య క్రియేషన్స్‌ల 'పైసా వసూల్' సెన్సార్ పూర్తి
సెప్టెంబర్‌ 1న గ్రాండ్ రిలీజ్
You are at idlebrain.com > news today >
Follow Us

24 August 2017
Hyderabad

‘తమ్ముడూ... నేను జంగిల్‌ బుక్‌ సినిమా చూడల . కాని అందులో పులి నాలాగే ఉంటుందని చాలామంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి’...

‘మందేసిన మదపుటేనుగునిరా! క్రష్‌ ఎవ్రీవన్‌'...

అంటూ డైలాగులతో, 'మావా.. ఏక్ పెగ్గు లా..' పాటతో నందమూరి బాలకష్ణ అభిమానులను ఖుషీ చేశారు. టీజర్, స్టంపర్ తో 'పైసా వసూల్'పై భారీ అంచనాలు నెలకొనేలా చేశారు దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాత వి. ఆనందప్రసాద్ రాజీపడకుండా నిర్మించారని టీజర్, స్టంపర్ చూపించాయి. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆయన నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 1న గ్రాండ్ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా వి. ఆనందప్రసాద్ మాట్లాడుతూ - "సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా బాగా వచ్చింది. బాలకృష్ణ గారి అభిమానులు కోరుకునే అంశాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఫుల్ ఎనర్జిటిక్ క్యారెక్టర్ ని బాలయ్య అద్భుతంగా పోషించారు. డూప్ లేకుండా ఆయన చేసిన యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేస్తాయి. అభిమానులను ఖుషీ చేస్తాయి. పూరి జగన్నాథ్ గారు ఓ కొత్త బాలయ్యను చూపించారు. అనూప్ రూబెన్స్ ఇచ్చిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. మా బేనర్ లో బాలయ్యతో మేం నిర్మించిన ఈ తొలి చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.

శ్రియ, ముస్కాన్, కైరా దత్‌ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్‌–హాలీవుడ్‌ నటుడు కబీర్‌ బేడి ప్రత్యేక పాత్ర పోషించారు. ఇంకా అలీ, పృథ్వీ, పవిత్రా లోకేష్, విక్రమ్‌ జిత్‌ తదితరులు నటించారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved