pizza
Paisa Vasool stumper release on 28 July
ఈ నెల 28 న 'పైసా వసూల్' స్టంపర్ రిలీజ్
You are at idlebrain.com > news today >
Follow Us

25 July 2017
Hyderabad

నందమూరి బాలకృష్ణ - పూరి జగన్నాథ్ ల సెన్సేషనల్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'పైసా వసూల్' . భవ్య క్రియేషన్స్ పతాకం పై వి. ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి , ప్రస్తుతం ప్యాచ్ వర్క్ జరుపుకుంటోంది .అది కూడా ఈ వారంలోనే పూర్తి కానుంది . ఈ నెల 28 న 'పైసా వసూల్' కి సంబంధించిన 'స్టంపర్' ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భం గా దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ - "నందమూరి బాలకృష్ణ తో కలిసి ఫస్ట్ టైమ్ ఈ సినిమా చేస్తున్నందుకు చాలా హ్యాపీ గానూ, గర్వం గానూ ఉంది. నా కెరీర్ లోనే ఇదొక మెమొరబుల్ మూవీ అవుతుంది. బాలకృష్ణ గారు ఈ పాత్ర లో లీనమైన తీరు చూసి వండర్ అయిపోయాను. నందమూరి అభిమానులు కోరుకొనే అంశాలన్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయి. డైలాగ్స్, సాంగ్స్ అదిరిపోయే లెవెల్ లో ఉంటాయి. ఈ సినిమా ఎలా ఉండబోతోందో రేపు 28 న విడుదల కానున్న 'స్టంపర్' చూస్తే అర్థమవుతుంది. రెగ్యులర్ గా అందరూ విడుదల చేసే టీజర్ , ట్రైలర్ కి పూర్తి భిన్నం గా ఈ 'స్టంపర్' ఉంటుంది" అని చెప్పారు.

నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ - " బాలకృష్ణ -పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ లో సినిమా చేసే అవకాశం వచ్చినందుకు చాలా గర్వం గా ఫీల్ అవుతున్నాను . మా భవ్య క్రియేషన్స్ సంస్థ ప్రతిష్టను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సినిమా అవుతుంది. ఈ వారం తో ప్యాచ్ వర్క్ కంప్లీట్ అవుతుంది. డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి కావొచ్చాయి . మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ కూడా చురుగ్గా సాగుతూ ,తుది దశకు చేరుకుంటోంది . ఆడియో ఫంక్షన్ ని త్వరలోనే గ్రాండ్ గా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.nbk 101 fever begins పేరుతో బాలకృష్ణ గారు ఇప్పటివరకూ నటించిన 100 సినిమాల విశేషాల తో ఒక వీడియో కర్టెన్ రైజర్ రిలీజ్ చేసాం . అది సోషల్ మీడియా లో ఇండియా లెవెల్ లో బాగా ట్రెండింగ్ అవుతోంది. " అని తెలిపారు. శ్రీయ , ముస్కాన్ , కైరా దత్, అలీ,పృథ్వి ,పవిత్రా లోకేష్ ,విక్రమ్ జిత్ తదితరులు నటించిన ఈ చిత్రం లో ప్రముఖ హాలీవుడ్ -బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ ఒక ప్రత్యేక పాత్ర ధరించారు . ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved