pizza
Pandavullo Okadu music launch on 20 June
You are at idlebrain.com > news today >
Follow Us

11 June 2015
Hyderabad

జూన్ 20 ఆడియో ఆవిష్క‌ర‌ణ‌లో 'పాండ‌వుల్లో ఓక‌డు'

విభిన్న‌మైన పాత్ర‌ల్లో వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ అటు త‌మిళ్‌, ఇటు తెలుగు భాష‌ల్లో న‌టుడుగా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వైభ‌వ్‌, సోన‌మ్ బ‌జ్వా లు జంట‌గా, కార్తిక్‌.జి.క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ్య‌ట్రిక్ విజ‌యాల ద‌ర్శ‌కుడు మారుతి నిర్మాత గా తెలుగు లో విడుద‌ల‌వుతున్న చిత్రం పాండ‌వుల్లో ఓక‌డు.. త‌మిళంలో సూప‌ర్‌డూప‌ర్ హిట్ గా నిలిచిన క‌ప్ప‌ల్ చిత్రానికి అనువాదం గా ఈచిత్రం విడుద‌ల‌వుతుంది. న‌ట‌రాజ‌న్ శంక‌ర‌న్ అందించిన సంగీతాన్ని జూన్ 20న సినిప్ర‌ముఖుల స‌మ‌క్షంలో విడుద‌ల చేస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి జులై లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు..

ఈ సంద‌ర్బంగా నిర్మాత మారుతి మాట్లాడుతూ.. వైభ‌వ్ త‌మిళంలో చాలా మంచి చిత్రాలు చేశాడు. తెలుగు లో కూడా సూప‌ర్‌హిట్ చిత్రాలు చేశాడు. ఇప్ప‌డు పూర్తి వినోదాత్మ‌కంగా వైవిద్య‌మైన కాన్సెప్ట్ తో ఈచిత్రాన్ని చేశాడు. త‌మిళం లో క‌ప్ప‌ల్ః అనే టైటిల్ తో విడుద‌ల‌య్యి సూప‌ర్‌డూప‌ర్ హిట్ గా అక్క‌డ రికార్డు క‌లెక్ష‌న్లు వ‌సూలు చేసింది. ఇప్ప‌డు పాండ‌వుల్లో ఓక‌డు అనే టైటిల్ తో తెలుగు లో మారుతి టాకీస్ బ్యాన‌ర్ లో విడుద‌ల చేస్తున్నాము. ఐదుగురు ఫ్రెండ్స్ క‌లిసి పెళ్ళి చేసుకోకూడ‌దూ అనే నిర్ణ‌యం తీసుకుంటారు. అలా పెళ్ళి చేసుకుంటే వారి స్నేహం దెబ్బ‌తింటుంద‌ని వారి న‌మ్మ‌కం. అలా నిల‌క‌డ‌గా వున్న వారి జీవితంలోకి హీరోయిన్ సోన‌మ్ భ‌జ్వా ఎంట‌ర‌య్యింది. అప్ప‌డు వారి జీవితాలు, వారి స్నేహ‌లు ఎలా మారాయి అనేది చిత్ర క‌థాంశం. పూర్తిగా వినోదాత్మ‌కంగా నిర్మించిన చిత్రం. న‌ట‌రాజ‌న్ శంక‌ర‌న్ అందించిన ఆడియో ని జూన్ 20 న విడుదల చేస్తున్నాము. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి జులై లో చిత్రాన్ని విడుద‌ల చేస్తాము.. అని అన్నారు

హీరో వైభ‌వ్ మాట్లాడుతూ.. చాలా రోజుల గ్యాప్ త‌రువాత తెలుగులో నా చిత్రం విడుద‌ల‌వుతుంది. అది కూడా క‌ప్ప‌ల్ వంటి సూప‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రం విడుద‌ల కావ‌టం హ్యిపిగా వుంది. మారుతి గారు ప్రోడ్యూస్ చేయ‌టం ఈచిత్రానికి మ‌రింత క్రేజ్ వ‌చ్చింది. ఈచిత్రంలో నా పాత్ర చాలా కొత్త‌గా వుంటుంది. నాతో పాటు న‌లుగురు ఫ్రెండ్స్ వుంటారు. మా జీవితంలో జ‌రిగే మార్పుల స‌న్నివేశాలు అంద‌రిని న‌వ్విస్తాయి. సోన‌మ్ బ‌జ్వా చాలా బాగా న‌టించింది. ఈ నెల 20న ఆడియో విడుద‌ల చేస్తున్నారు.. అని అన్నారు

వినోదాత్మ‌కంగా తెర‌కెక్కింన ఈ చిత్రంలో వైభ‌వ్‌, సోన‌మ్ బ‌జ్వా, అర్జున్ నంద కుమార్‌, వి.టి.వి.గ‌ణేష్‌, కరుణాక‌ర‌ణ్‌, వెంక‌ట్‌, సుధాక‌ర్‌, స్టీవ్ వాగ్, కార్తీక్, ప్రియ‌ద‌ర్శ‌న్, రోబో శంక‌ర్‌, ర‌విరాజ్‌, జార్జ్‌, తేని మురుగ‌న్, రాజ‌న్, స‌ర్ప‌దినిష‌, స్వాతి, ల‌క్ష్మి, వినిత‌, ప్రీతి కిచ‌ప‌న్‌, దీప‌క్‌, కార్తిక్‌, అహింస‌, రాహుల్,కునాస్‌, మోనా మెద‌ల‌గువారు..
అనువాదం- శేషు, ప్రోడ‌క్ష‌న్ కంట్రోల‌ర్- అడ్డాల శ్రీనివాస్‌, ప్రోడ‌క్ష‌న్ ఎగ్జ‌క్యూటివ్‌- కె.వేద కుమార్‌, స్టిల్స్- యం.విష్ణు, ప‌బ్లిసిటి డిజైనర్‌- శ్రీ యాడ్స్‌, కాస్టూమ్స్‌- య‌స్‌.త‌మిళ సెల్వ‌న్‌, ప్రోజెక్ట్ కో-ఆర్టినేట‌ర్ - జి.వి.సుబ్ర‌మ‌ణ్యం, సినిమాటోగ్రాఫ‌ర్ - దినేష్ కృష్ణ‌న్ .బి, ఆర్ట్‌- కె.అరుసామి, ఎడిటింగ్- ఆంటోని, మ్యూజిక్‌- న‌ట‌రాజ‌న్ శంక‌ర‌న్‌, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- పులి రాజేష్‌, స‌హ నిర్మాత‌లు- బోమ‌న్ కృష్ణ స‌తీష్‌, మ‌ల్లిపూడి రామ్‌జి, నిర్మాత‌- మారుతి, స్టోరి, స్క్రీన్‌ప్లే,ద‌ర్శ‌క‌త్వం- కార్తిక్ జి. క్రిష్‌

 


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved