pizza
Gopichand's 25th Film Pantham In Sri Satya Sai Arts Banner To Release On May 18th
శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై గోపీచంద్ 25వ చిత్రం `పంతం` ... మే 18న విడుద‌ల‌
You are at idlebrain.com > news today >
Follow Us

4 February 2018
Hyderabad

Tollywood aggressive hero Gopichand who entertained us in several super hit films such as Yagnam, Andhrudu, Lakshyam, Shauryam is presently working for his 25th film Pantham. 'For A Cause' is tagline for the film produced by KK Radhamohan under Sri Satya Sai Arts Banner. Writer K Chakravarthi who provided screenplay for blockbuster films like Balupu, Power, Jai Lava Kusa is turning director with the movie. The makers are planning to release Pantham on May 18th.

While speaking on the occasion, Producer Radhamohan said, 'We are happy to produce Gopichand's 25th film under our Sri Satya Sai Arts Banner. Pantham is the title finalized for the film. Shoot is progressing as per the schedules. So for, one song and some talkie part has been completed. An intensive action sequence which will be interval bang in the film has been shot in Aluminum Factory. Director Chakri is making the film that has good message in it as a commercial entertainer. Hero Gopichand will be seen in a very powerful character. You need to wait for few more days to know reason behind Gopichand's Pantham. We are planning to wrap up all the remaining works at the earliest to release the movie on May 18th.

Gopichand, Mehreen Kaur Pirzada, Prithvi, Jayaprakash Reddy are the prominent cast in the film. AS Prakash handles art department, while Ramesh Reddy penned dialogues. Chakravarthi wrote screenplay in association with KS Ravindra (Bobby). Co-director: Bellamkonda Satyam Babu, Music: Gopi Sundar, Cinematography: Prasad Murella, Producer: KK Radhamohan, Story, Direction: K. Chakravarthi (Chakri).

శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై  గోపీచంద్ 25వ చిత్రం `పంతం` ... మే 18న విడుద‌ల‌

`ఆంధ్రుడు`, `య‌జ్ఞం`, `ల‌క్ష్యం`, `శౌర్యం`, `లౌక్యం` వంటి సూప‌ర్‌డూప‌ర్ చిత్రాలతో మెప్పించిన టాలీవుడ్ ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ క‌థానాయ‌కుడిగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది గోపీచంద్ 25వ చిత్రం కావ‌డం విశేషం. దీనికి `పంతం అనే టైటిల్‌ను నిర్ణ‌యించారు. `ఫ‌ర్ ఎ కాస్‌` ఉప‌శీర్షిక‌. `బ‌లుపు`, `ప‌వ‌ర్‌`, `జై ల‌వకుశ` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు స్క్రీన్‌ప్లే అందించిన కె.చ‌క్ర‌వ‌ర్తి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌ను కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మే 18న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా..

నిర్మాత కె.కె.రాధామోహ‌న్ మాట్లాడుతూ - ``మా స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో గోపీచంద్‌గారి 25వ సినిమా చేయ‌డం హ్యాపీగా ఉంది. ఈ సినిమాకు `పంతం` అనే టైటిల్‌ను నిర్ణ‌యించాం. సినిమా అనుకున్న ప్ర‌ణాళిక ప్ర‌కారం చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. అందులో భాగం ఇప్ప‌టికే ఒక పాట‌, కొంత టాకీ పార్ట్ పూర్త‌య్యింది. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌లో వ‌చ్చే యాక్ష‌న్ స‌న్నివేశాలను అల్యూనిమియం ఫ్యాక్టరీలో చిత్రీకరించబడింది. మంచి మెసేజ్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో సినిమాను ద‌ర్శ‌కుడు చ‌క్రి చ‌క్క‌గా తెర‌కెక్కిస్తున్నారు. హీరో గోపీచంద్‌గారి క్యారెక్ట‌ర్ చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆయ‌న ఎందుకోసం పంతం ప‌ట్టాడు. ఆ కార‌ణ‌మేంట‌నేది తెలుసుకోవాంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మే 18న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అని తెలిపారు.

గోపీచంద్‌, మెహ‌రీన్‌, పృథ్వీ, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి త‌దిత‌రులు న‌టించ‌నున్న ఈ చిత్రానికి ఆర్ట్ః ఎ.ఎస్.ప్ర‌కాష్‌, డైలాగ్స్ః ర‌మేష్ రెడ్డి, స్క్రీన్‌ప్లేః కె.చ‌క్ర‌వ‌ర్తి, బాబీ(కె.ఎస్‌.ర‌వీంద్ర‌), కో డైరెక్ట‌ర్ః బెల్లంకొండ స‌త్యంబాబు, మ్యూజిక్ః గోపీసుంద‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీః ప్ర‌సాద్ మూరెళ్ల‌, నిర్మాతః కె.కె.రాధామోహ‌న్‌, స్టోరీ, డైరెక్ష‌న్ః కె.చ‌క్ర‌వ‌ర్తి(చ‌క్రి).


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved