pizza
షఫి ముఖ్య పాత్రలో నాగ సత్య పిక్చర్స్ చిత్రం "పారడైస్"
You are at idlebrain.com > news today >
Follow Us

21 August 2014
Hyderabad

విలక్షణ నటుడుగా తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి స్థానాన్ని సంపాయించిన షఫి ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం నాగ సత్య పిక్చర్స్ పతాకం పై నిర్మాత బి. సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్ర అతి త్వరలో సెట్స్ మీదకి వెళ్లనుంది. ఈ చిత్రం ద్వార హేమంత్ హీరోగా , గురురీత్ సింగ్ కౌర్ హెరాయిన్ గా పరిచయమవుతుంది. ప్రముఖ తమిళ్ దర్శకుల వద్ద పనిచేసిన రవిచంద్రన్ దర్శకుడిగా తెలుగు కి పరిచయమవుతున్నాడు.ఈ సినిమా కి పారడైస్ అనే టైటిల్ ని ఖరారు చేసారు. హరిబుల్ లవ్ స్టొరీ అనే ట్యాగ్ లైన్ ని ఖరారు చేసారు.

ఈ సందర్భం గా నిర్మాత మాట్లాడుతూ ' నాగ సత్య పిక్చర్స్ పతాకం పై దర్శకుడు రవిచంద్రన్ దర్శకత్వం లో షఫి మెయిన్ లీడ్ లో నిర్మిస్తున్న చిత్రం పారడైస్ .. ఈ సినిమా కథ డైరెక్టర్ చెప్పగానే మాకు చాలా బాగా నచ్చింది కొత్త కథనం తో సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. హైదరాబాద్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా నిర్మిస్తున్నాము. హేమంత్ ని హీరోగా పరిచయం చేస్తున్నాము, ప్రముఖ మోడల్ గురురీత్ సింగ్ కౌర్ ని హీరొయిన్ గా పరిచయం చేస్తున్నాము. జబర్దస్త్ తో ఇటీవల నవ్వులు కురిపించిన ధనరాజ్, రఘు లు కీలక పాత్రలో నటిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకి వెళుతుంది" అని అన్నారు .

కెమెరా : యోగి, సంగీతం : పిట్టి సతీష్ , ప్రాజెక్ట్ డిజైనర్: సురేష్, నిర్మాత : బి.సత్యనారాయణ, కథ-కథనం-మాటలు-దర్శకత్వం : రవి చంద్రన్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved