pizza
Patel SIR releasing on July 14th!
జూలై 14న వస్తున్న "పటేల్ సార్" !!
You are at idlebrain.com > news today >
Follow Us

5 July 2017
Hyderabad

Jagapathi Babu is back with high style quotient in action entertainer Patel SIR. Excitement of audience about this film was visible in the amazing response for Proof of Concept teaser released grabbing 2.7+ Million YouTube views. Later producer Sai Korrapati launched Jagapathi Babu's first look poster as PATEL SIR and this one went viral.

"Jagapathi Babu is presented in a new look as Patel SIR. He will be seen as a true action hero in this film. Applause from audience for Jagapathi Babu’s stylish look, Proof of Concept teaser and the song teaser released couple of days back is an example of hard work and dedication put in by the team. Patel is filmed on Hollywood standards with surprising action scenes performed by Jagapathi Babu defying the age bar.

Director Vasu Parimi's idea of showing Jagapathi Babu in this stylish look will impress our audience. We are announcing the release date for Patel SIR as July 14th. Post production works are also finished and we are looking for a grand release," producer Sai Korrapati said.

Artists:
Jagapathi Babu, Padma Priya, Tanya Hope, Subbaraju, Posani, Raghu Babu, Shubhalekha Sudhakar, Kabir Singh, Prithvi, Baby Dolly and others.

Technicians:
Screenplay, Director: Vasu Parimi
Producer: Rajini Korrapati
Production: Sai Korrapati
Presenter: Sai Shivani
Banner: Vaaraahi Chalana Chitram
DOP: Shyam K Naidu
Music: Vasanth
Art: Kiran
Story: Sunilsudhakar
Additional Screenplay, Script Co-ordinator: R Ramu
Dialogues: Prakash
Editing: Goutham Raju
Poster Design: Venkat
Promos: Bhaskar
Fights: Vijay, Satish, Solmon
Lyrics: Balaji, Ramu, Vasanth, Rambabu
Dances: Sagar, Raghu
.

జూలై 14న వస్తున్న "పటేల్ సార్" !!

వారాహి చలనచిత్రం బ్యానర్ లో రజిని కొర్రపాటి నిర్మాణ సారథ్యంలో వాసు పరిమి దర్శకత్వం వహిస్తున్న స్టైలిష్ రివెంజ్ డ్రామా "పటేల్ సార్". జగపతిబాబు టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం సెన్సార్ సహా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని జూలై 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. సాయి శివాని సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం నాడే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ టీజర్ ను విడుదల చేసి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొంది. 2.7 మిలియన్ వ్యూస్ సాధించిన "పటేల్ సార్" ఫస్ట్ లుక్ మరియు సాంగ్ టీజర్ కు మంచి స్పందన లభిస్తోంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. "యూట్యూబ్ లో విడుదల చేసిన టీజర్ తోనే "పటేల్ సార్" చిత్రం విశేషమైన క్రేజ్ ను సొంతం చేసుకొంది. జగపతిబాబు సపోర్ట్ లేకపోతే సినిమా అవుట్ పుట్ ఈరేంజ్ లో వచ్చేది కాదు. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి జగపతిబాబు యాక్షన్ సీక్వెన్స్ లు హైలైట్ గా నిలుస్తాయి. వాసు పరిమి టేకింగ్, కథ, స్క్రిప్ట్ ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తుంది. షూటింగ్ శరవేగంగా సాగుతొంది. సినిమాను జులై 14న విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులకు ఒక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ కలుగుతుంది" అన్నారు.

జగపతిబాబు, పద్మప్రియ, తాన్య హాప్, సుబ్బరాజు, పోసాని, రఘుబాబు, శుభలేఖ సుధాకర్, కబీర్ సింగ్, పృథ్వి, బేబీ డాలీ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నృత్యాలు: సాగర్-రఘు, సాహిత్యం: బాలాజీ-రాము-వసంత్-రాంబాబు, పోరాటాలు: విజయ్-సతీష్-సొలొమాన్, ప్రోమోస్: భాస్కర్, పోస్టర్ డిజైన్: వెంకట్, ఎడిటింగ్: గౌతమ్ రాజు, డైలాగ్స్: ప్రకాష్, అడిషనల్ స్క్రీన్ ప్లే-స్క్రిప్ట్ కోఆర్డినేటర్: ఆర్.రాము, ఆర్ట్: కిరణ్, సంగీతం: వసంత్, ఛాయాగ్రహణం: శ్యామ్ కె.నాయుడు, బ్యానర్: వారాహి చలనచిత్రం, సమర్పణ: సాయి శివాని, నిర్మాణం: సాయి కొర్రపాటి, నిర్మాత: రజిని కొర్రపాటి, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వాసు పరిమి!


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved