pizza
Pavan Mallela interview (Telugu) about Balakrishnudu
ఫక్తు కమర్షియల్‌ చిత్రం ‘బాలకృష్ణుడు’ - పవన మల్లెల
You are at idlebrain.com > news today >
Follow Us

23 November 2017
Hyderabad

నారా రోహిత్‌ హీరోగా నటించిన చిత్రం ‘బాలకృష్ణుడు’. పవన్‌ మల్లెల దర్శకత్వం వహించారు. శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమా గురించి పవన్‌ మల్లెల హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు..

మీ చిత్రానికి చాలా పెద్ద పోటీ ఉన్నట్టుంది?
- పోటీ ఉంటే మంచిదే కదండీ.

ప్రీ రిలీజ్‌ పాజిటివ్‌ బజ్‌ మిగిలిన సినిమాలకు చాలా ఉంది కదా?
- శ్రీవిష్ణు కూడా మా ఫ్రెండేనండీ. మా ఫ్రెండ్‌ సినిమా బావుంటే మాకు చాలా సంతోషం. అయినా ఆ సినిమాకు, మా సినిమాకూ పొంతన ఉండదు. దేనికదే వెరైటీగా ఉంటుంది.

మీ సినిమా ఎలా ఉంటుంది?
- ఫక్తు కమర్షియల్‌ సినిమా అండీ. ఫ్యాక్షన బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది.

సింగిల్‌ లైన్‌ ఆర్డర్‌లో చెప్పండి?
- రమ్యకృష్ణ మేనత్తగా నటించారు. ఆమె మేనకోడలు రెజీనా. చిన్నప్పటి నుంచీ రెజీనాను సిటీలో ఉంచుతారు. ఒక చోట నుంచి బయలుదేరిన రెజీనా తను అనుకున్న ప్రదేశానికి రీచ ఎలా అయ్యారు? ఆ ప్రయాణంలో హీరో ఎలా తోడయ్యాడు వంటివి ఆసక్తికరం. జర్నీ కైండ్‌ పిల్మ్‌ అండీ.

ఈ చిత్రానికి నారా రోహిత్‌ సిక్స్‌ ప్యాక్‌కీ సంబంధం ఏంటండీ?
- అలాంటిదేమీ లేదండీ. ఈ సినిమాతో సిక్స్‌ప్యాక్‌కి సంబంధం లేదు. కాకపోతే మేం ఈ కథని ఆయనకు చెప్పినప్పుడు ‘సావిత్రి’ షూటింగ్‌లో ఉన్నారు. అప్పుడు కాస్త లావుగా ఉన్నారు. అందుకే తగ్గమని అడిగాం.

మణిశర్మగారి సంగీతం మీ సెలక్సనే అట కదా?
- అవునండీ. నాకు ఆయన సంగీతం అంటే ఇష్టం. ఇటీవల ఆయన్ని కలిసినప్పుడు ‘ఈ మధ్య ఆల్బమ్‌లు పెద్దగా హిట్‌ కావడం లేదు ఎందుకు గురుజీ’ అని అడిగాను. ‘నేను అదే మణిశర్మను. నా దగ్గరున్న సంగీతం అలాగే ఉంది. కానీ నా దగ్గరనుంచి తీసుకునేవారిని బట్టే అది ఉంటుంది’ అని చెప్పారు. నాకు అది చాలా బాగా నచ్చింది.

రెజీనా గురించి చెప్పండి?
- (నవ్వుతూ) చాలా బాగా చేశారండీ. మంచి పాత్రలో కనిపిస్తారు. ఇంతకుముందు ఇదే జంట రెండు సినిమాలు కలిసి చేశారు. వాటికన్నా ఇందులో ఇంకా బాగా కనిపిస్తారు.

రెజీనా అనగానే ఎందుకు నవ్వారు?
- అదేంలేదండీ.

ఆమె ఇబ్బంది పెట్టిందనే గాసిప్స్‌ వచ్చాయి?
- అలాంటిదేమీ లేదండీ. మా సినిమా షూటింగ్‌ కాస్త లేట్‌ అయింది అంతే. అంత తప్ప ఇంకేమీ లేదు.

మీ గురించి చెప్పండి?
- మాది విజయవాడ. నాకు సినిమాలంటే ఇష్టం. చెన్నైలో ఇంజనీరింగ్‌ చేశాను. ఫారిన లో ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సు చేశా. అక్కడి నుంచి వచ్చి కృష్ణవంశీ, వినాయక్‌గారి సినిమాల షూటింగ్‌లను అబ్జర్వ్‌ చేశా. ఓ మంచి లవ్‌స్టోరీతో నాలుగేళ్లు తిరిగా. అది కుదరదని తెలిసి రాజా దగ్గర ఈ కథను తీసుకుని రోహితగారిని కలిసి చెప్పాను. ఈ సినిమా రిజల్ట్‌ మీద తదుపరి చిత్రం ఆధారపడి ఉంటుంది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved