pizza
Pawan Kalyan felicitates wrestlers
You are at idlebrain.com > news today >
 
Follow Us

1 March -2021
Hyderabad


Need physical strength along with psychological

strength to fight against corruption

 Only corrupt will rule if physically not fit Ancient martial arts will be encouraged if Janasena comes to power Janasena President Sri Pawan Kalyan says at wrestlers’ felicitationfunctionJanasena Party President Sri Pawan Kalyan has observed that the country needsmartial arts learned from ancestral gurus and domestic martial arts like wrestlingand karrasamu (a practice using a long stick) must be encouraged. He said peopleneed physical strength along with psychological strength to fight againstcorruption and warned that rowdies and corrupt people will rule if the leaders arenot strong both physically and psychologically. He felicitated a team of 16wrestlers who came from Uttar Pradesh, Haryana and Maharashtra in Hyderabadon Sunday. 

Speaking on the occasion Sri Pawan Kalyan said “our country is popularly knownfor its ancient martial arts. But, these martial arts are on the verge of extinctionover some decades because of poor reception. The war education is still alive instates like Uttar Pradesh, Maharashtra and Haryana. During my childhood days inChirala, my father used to take me to wrestling competitions. I used to watchthese war studies closely with local pahilwans like Sri Apparao. Though I have athrust to learn, my body not supported. I have a strong desire to build a body likeSri Kodi Rammurthy Naidu, but cannot. However, I have practised martial artsafter some years. I got skill in kickboxing, Karate, Indonesia martial arts.  

 Give training to your children too! 

Strong physic is necessary along with a strong mind. We will have the courage todeal with any type of problems if we have strong physic. All Indians especiallyTelugu people must encourage our ancient war studies learning from ancestralgurus. We will encourage ancient war studies if Janasena comes to power. Iappeal to Janasena leaders and Jana Sainiks to encourage marital arts. You alsosend your children for learning war studies. Society must be strong andcourageous. Rowdies and corrupt will rule if we are not courageous. We will gainstrength to fight against corruption if build our physical strength along withpsychological strength. We can maintain a system and discipline. I thank all thewrestlers who came from Uttar Pradesh, Haryana and Maharashtra for my film(Produced by A M Ratnam in the direction of Krish). Wrestlers shall come fromevery village in future with the inspiration from you. Our Telugu people must alsostrive to re-build a strong society in India,” he said.    Wrestlers facilitated

Sri Pawan Kalyan facilitated a team of 16 wrestlers who came from Uttar Pradesh,Haryana and Maharashtra. He interacted with each and everyone and honouredthem with a shawl and a memento of a silver Hanuman idol. He explained thegreatness of Telugu wrestler Sri Kodi Rammurthy. He briefed how he had grownup as a world-famous wrestler and reached the level of making adventuresabroad though he was born in a remote village in Srikakulam district. Later, he
presented a mace to the wrestlers’ team.

అవినీతిపై పోరుకు మానసిక దారుఢ్యంతో పాటు శారీరక దారుఢ్యం అవసరం• శారీరకంగా బలంగా లేకపోతే అవినీతిపరులే రాజ్యమేలుతారు• జనసేన అధికారంలోకి వస్తే ప్రాచీన యుద్ధ విద్యలను ప్రోత్సహిస్తాం• మల్లయోధుల సన్మాన సమావేశంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారుగురు పరంపరతో అభ్యసించే యుద్ధ విద్యలు మన దేశానికి చాలా అవసరమని, దేశీయయుద్ధ విద్యలైన కుస్తీ, కర్రసాము వంటివాటిని ప్రోత్సహించాలని జనసేనఅధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయపడ్డారు. అవినీతిపై పోరాటంచేయాలంటే మానసిక దారుఢ్యంతో పాటు శారీరక దారుఢ్యం చాలా అవసరమన్నారు.మానసికంగా, శారీరకంగా బలంగా లేకపోతే రౌడీలు, అవినీతిపరులు రాజ్యమేలుతారనిహెచ్చరించారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ లో ఉత్తరప్రదేశ్, హర్యానా,మహారాష్ట్ర నుంచి వచ్చిన 16 మంది మల్లయోధుల బృందాన్ని సత్కరించారు.ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “ప్రాచీన యుద్ధ విద్యలకుమన దేశం పేరెన్నికగన్నది. అయితే కొన్ని దశాబ్దాలుగా ఆదరణకు నోచుకోకఅంతరించిపోయే దుస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా వంటిరాష్ట్రాల్లో ఇప్పటికీ యుద్ధ విద్య సంస్కృతి బతికే ఉంది. చిన్నప్పుడు చీరాలలోఉన్నప్పుడు మా నాన్నగారు కుస్తీ పోటీలకు తీసుకెళ్లేవారు. స్థానికంగా ఉండేపహిల్వాన్ శ్రీ అప్పారావు గారి లాంటి యోధుల యుద్ధ విద్యలను దగ్గరుండిచూసేవాడిని. నేర్పుకోవాలనే తపన ఉండేది కానీ శరీరం సహకరించేది కాదు. శ్రీ కోడిరామ్మూర్తి నాయుడు గారిలా దేహ దారుఢ్యం సంపాదించాలనే కోరిక ఉండేది కానీతీరలేదు. కొన్నేళ్ల తర్వాత మార్షల్ ఆర్ట్స్ లోకి వెళ్లి కొంత సాధన అయితేచేశాను. కిక్ బాక్సింగ్, కరాటే, ఇండోనేషియా మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యంపొందాను.

• మీ పిల్లలకూ తర్ఫీదు ఇప్పించండిబలమైన మస్తిష్కంతో పాటు బలమైన శరీరం ఉండటం చాలా అవసరం. శారీరక దారుఢ్యంఉంటే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోవడానికి ధైర్యం ఉంటుంది. సగటు భారతీయుడు,ముఖ్యంగా తెలుగువారు గురు పరంపరతో అభ్యసించే యుద్ధ విద్యలనుప్రోత్సహించాలి. జనసేన ప్రభుత్వం వస్తే ప్రాచీన యుద్ధ విద్యలనుప్రోత్సహిస్తాం. జనసేన నాయకులు, జనసైనికులను యుద్ధ విద్యలనుప్రోత్సహించమని కోరుతున్నాను. మీ పిల్లలను కూడా యుద్ధ విద్యలనుఅభ్యసించడానికి పంపించండి. సమాజం ధైర్యంగా ఉండాలి. మనం ధైర్యంగా లేకపోతేరౌడీలు, అవినీతిపరులు రాజ్యాలు ఏలుతారు. మానసిక దారుఢ్యంతో పాటు శారీరకదారుఢ్యాన్ని పెంపొందించుకుంటే అవినీతిపై పోరాటం చేయడానికి శక్తి వస్తుంది.ఒక పద్దతి, క్రమశిక్షణ అలవడుతుంది. నా సినిమా కోసం (దర్శకుడు క్రిష్దర్శకత్వంలో, ఎ.ఎమ్. రత్నం నిర్మిస్తున్న చిత్రం) ఉత్తర ప్రదేశ్, హర్యానా,మహారాష్ట్ర నుంచి వచ్చిన వీళ్లందరికి కృతజ్ఞతలు. మీరు అందించిన స్ఫూర్తితోభవిష్యత్తులో ప్రతి గ్రామం నుంచి మల్లయోధులు రావాలి. భారతదేశంలో బలమైనసమాజం పునర్నిర్మాణానికి మన తెలుగు వారు కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను.

• మల్లయోధులకు సన్మానంఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర నుంచి వచ్చిన 16 మంది మల్లయోధులబృందాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సత్కరించారు. ప్రతి ఒక్కరిని పేరు పేరునాఆత్మీయంగా పలకరించి శాలువా కప్పి, వెండి హనుమంతుడి విగ్రహాన్ని బహూకరించారు.తెలుగు మల్లయోధుడు శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు గారి గొప్పతనాన్ని వారికివివరించారు. శ్రీకాకుళం జిల్లా మారుమూల పల్లెలో పుట్టిన ఆయన ప్రపంచప్రఖ్యాత యోధుడుగా ఎలా ఎదిగారు, దేశవిదేశాల్లో సాహస కృత్యాలు చేసేస్థాయికి ఎలా చేరుకున్నారో వారికి తెలియజేశారు. చివరగా మల్లయోధుల బృందానికిగదను బహుమతిగా అందించారు.

 


   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved