pizza
Perlene Bhesania about Suryakantham
`సూర్య‌కాంతం` చేసేట‌ప్పుడే చాలా ఆఫ‌ర్లు వ‌చ్చాయి - పెర్లిన్ భెసానియా
You are at idlebrain.com > news today >
Follow Us

26 March 2019
Hyderabad

రాహుల్ విజ‌య్‌, నీహారిక కొణిదెల న‌టిస్తున్న `సూర్యకాంతం`లో ఇంకో న‌టిగా పెర్లిన్ న‌టిస్తోంది. ఈ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ప్ర‌ణీత్ బ్ర‌హ్మాండ‌ప‌ల్లి ద‌ర్శ‌కుడు. వ‌రుణ్ తేజ్ స‌మర్పిస్తున్నారు. దిల్‌రాజు ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా గురించి పెర్లిన్ మంగ‌ళ‌వారం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..

``నా పూర్తి పేరు పెర్లిన్ భెసానియా. నేను ముంబైలో పుట్టి, పెరిగాను. నేను 30కి పైగా యాడ్స్ చేశాను. మెక్ డొనాల్డ్స్, హెయిర్ అండ్ కేర్‌తో పాటు చాలా యాడ్స్ చేశాను. నా గ్రాడ్యుయేష‌న్ పూర్త‌య్యాక 20 ఏళ్ల‌కి న‌టించ‌డం మొద‌లుపెట్టా. నేను లా కూడా చేశాను. న‌టించ‌డం నాకు చాలా ఇష్టం. అటు న‌ట‌న‌, ఇటు లా రెండిటినీ బ్యాల‌న్స్ చేస్తున్నా. తెలుగులో నాకు ఇది తొలి సినిమా. నేను మోడ‌ల్‌గా చేశాను. నాకు హైద‌రాబాద్‌లో ఓ మేనేజ‌ర్ ఉండేవారు. ఒక సినిమా చేస్తున్నార‌ని, ఒక సారి మీటింగ్ కి ర‌మ్మ‌ని అత‌ను పిలిచారు. నేను మీటింగ్‌కి వచ్చాను. ద‌ర్శ‌కుడు ప్ర‌ణీత్‌గారిని క‌లిశాను. ఆయ‌న నాకు బ్రీఫ్ గా కాన్సెప్ట్ చెప్పారు. రాహుల్ విజ‌య్ కూడా అప్పుడు ముంబైకి వ‌చ్చారు. అక్క‌డ ఆడిష‌న్స్ చేశాం. అప్పుడు నాకు డైలాగులు ఇవ్వ‌లేదు. కానీ ఎమోట్ చేయ‌మ‌ని అడిగారు. న‌వ్వ‌మ‌ని, బాధ‌ప‌డమ‌ని, ఇలా కొన్ని ఎమోష‌న్స్ చెప్పారు. చేశాను. ఫొటో షూట్ చేశారు. కొన్నాళ్ల త‌ర్వాత ప్ర‌ణీత్ నాకు ఫోన్ చేసి ఈ క‌థ మొత్తం చెప్పారు. ఈ సినిమాలో పూజా అనే పాత్ర చేశా. చాలా మెచ్యూర్‌గా, సెన్సిబుల్‌గా ఉంటుంది. సెన్సిటివ్‌గా ఉంటుంది. ఎవ‌రైనా న‌చ్చితే నేరుగా త‌న త‌ల్లిదండ్రుల‌కు చెప్పే ర‌కం ఆమె. నాకు, త‌న‌కు 20 శాతం పోలిక‌లుంటాయి. నేను బ‌బ్లీగా ఉంటాను. చాలా మాట్లాడుతాను. కానీ పూజా అలా కాదు. చాలా కామ్‌గా ఉంటుంది. చాలా ఫోక‌స్‌గా ఉంటుంది. త‌న జీవితంలో ఏం కావాలో త‌నకి బాగా తెలుసు. ఇది ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీ మాత్ర‌మే కాదు. అంత‌కు మించి ఇందులో చాలా ఉంటుంది. సూర్య‌కాంతం బైపోలార్‌. చాలా ఎక్సెంట్రిక్‌. సేమ్ టైమ్ త‌ను చాలా సాఫ్ట్ గా ఉంటుంది. త‌ను మంచిగా ఉండ‌గ‌ల‌దు, అదే స‌మ‌యంలో ఎక్సెంట్రిక్‌గా ఉంటుంది. నాకు, నీహారిక‌కు కూడా కొన్ని సీన్లున్నాయి. త‌న‌తో ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉం. నీహారిక చాలా జెన్యూన్ ప‌ర్స‌న్‌. న‌టిగా కూడా జెన్యూన్ ప‌ర్స‌న్‌. మా టీమ్ అంద‌రూ చాలా మంచి కోస్టార్స్. అందుకే నాకు తెలుగులో మాట్లాడ‌టం కూడా తేలికైంది. నాకు ఇచ్చిన లైన్ల‌కు అర్థాన్ని ఇంగ్లిష్‌లో రాసుకునేదాన్ని. డిక్ష‌న్‌ను హిందీలో రాసుకునేదాన్ని. ఈజీగా చెప్పాను. ఈ సినిమాలో మూడు పాట‌లున్నాయి నాకు. సీనియ‌ర్ న‌టి సూర్య‌కాంతం గురించి చాలానే విన్నా. ఈ సినిమాలో సూర్య‌కాంతం పాత్ర‌కు, పూజ పాత్ర‌కు చాలా తేడాలున్నాయి.ప్ర‌ణీత్ మా పాత్ర‌ల‌ను చాలా బాగా రాశాడు. ఈ సినిమాలో కొన్ని పాత్ర‌ల‌ను ప్ర‌ణీత్ నిజ జీవితం నుంచి చాలా ఇన్‌స్ప‌యిర్ అయి రాసిన‌ట్టు అనిపించింది. సినిమా కోసం మ‌న జీవితంలో కొన్ని నెల‌ల‌ను స్పెండ్ చేస్తాం. ఇది నాకు కొత్త ఎక్స్ పీరియ‌న్స్. యాడ్స్ రెండు రోజుల్లో చేసేవాళ్లం. కాక‌పోతే యాక్టింగ్‌లో నేను ఫార్మ‌ల్ ట్రైనింగ్ తీసుకున్నా. నాకు కొన్ని డ్యాన్సులు తెలుసు. అందువ‌ల్ల సినిమా చేయ‌డం తేలికైంది.

నేను`సూర్య‌కాంతం` చిత్రాన్ని మొద‌లుపెట్ట‌గానే నాకు ఆఫ‌ర్లు వ‌చ్చాయి. నా ప‌నితీరు న‌చ్చి చాలా మంది అప్రోచ్ అయ్యారు. ఇప్పుడు కొన్ని ఆఫ‌ర్లు ఉన్నాయి. కానీ సంత‌కాలు చేసేయ‌డానికి నేనేం తొంద‌ర‌ప‌డ‌టం లేదు. నాకు `అర్జున్‌రెడ్డి` హిందీ వెర్ష‌న్‌కు అవ‌కాశం వ‌చ్చింది. కానీ ఎందుకో కుద‌ర‌లేదు. ఈ సినిమాతో పాటు ఈగ‌, బాహుబ‌లి, ఈ మాయ‌పేరేమిటో, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాలు చూశా. ద‌క్షిణాదిన అనుష్క శెట్టి చాలా ఇష్టం. ఆమె చాలా మంచి ఆర్టిస్ట్. చాలా బాగా చేస్తుంది. త‌ను చేసే పాత్ర‌లోకి మారిపోతుంది. హిందీలో క‌రీనా కపూర్ అంటే చాలా ఇష్టం`` అని అన్నారు.

interview gallery

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved