pizza
Pooja Hegde about Duvvada Jagannadham
అల్లు అర్జున్‌ నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను - పూజా హెగ్డే
You are at idlebrain.com > news today >
Follow Us

24 June 2017
Hyderabad

'ఒక లైలా కోసం', 'ముకుంద' చిత్రాలు తర్వాత పూజా హెగ్డే నటించిన చిత్రం 'డీజే దువ్వాడ జగన్నాథమ్‌'. అల్లు అర్జున్‌ హీరోగా నటించిన చిత్రమిది. ఈ సినిమా జూన్‌ 23న విడుదలైంది. ఈ సందర్భంగా పూజా హెగ్డే పాత్రికేయులతో సినిమా గురించి మాట్లాడారు.

పూజా హెగ్డే మాట్లాడుతూ - '''ముకుంద' సినిమా తర్వాత తెలుగులో సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చాయి. అయితే బాలీవుడ్‌లో 'మొహంజదారో' సినిమా చేస్తుండటం వల్ల తెలుగులో సినిమాలు చేయలేకపోయాను. అలాగే తెలుగులో అప్పటి వరకు చేసిన రెండు సినిమాల్లో చాలా డీసెంట్‌ పాత్రలు చేశాను. కాంటెపరరీ పాత్ర చేయాలనుకుంటున్న సమయంలో 'డీజే దువ్వాడ జగన్నాథమ్‌' సినిమాలో అవకాశం వచ్చింది. హరీష్‌శంకర్‌గారు ఫోన్‌ చేసి 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' సినిమాలో నటించలేదు. ఈ సినిమా అయినా చెయ్యాలని అన్నారు. ముందు కథ విని నచ్చితేనే చెయ్యమని అన్నారు. కథ వినగానే నచ్చడంతో సినిమా చేయడానికి అంగీకరించాను. తెలుగులో నేను చేసిన సినిమాలు కానీ, అప్పటి పరిస్థితులు నటీనటులు అన్ని నాకు బాగా నచ్చాయి.

Pooja Hegde interview gallery

తెలుగు సినిమా పరిశ్రమతో నాకు మంచి రిలేషన్‌ ఉందనిపించింది. నేను ఇక్కడి పిల్లనే అని భావిస్తున్నాను. అల్లు అర్జున్‌ సెట్స్‌లో చాలా సరదాగా ఉంటాడు. సెట్స్‌లో తనుంటే టెన్షన్‌ ఉండదు. సినిమా ఆసాంతం ఎంజాయ్‌ చేశాను. బన్ని జనరిక్‌ యాక్టర్‌. తను నుండి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. నటన పరంగా, డ్యాన్సులు పరంగా నాకు టిప్స్‌ ఇచ్చాడు. ఒక నటి డీజే దువ్వాడ జగన్నాథమ్‌తో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం కలిగింది. హరీష్‌ శంకర్‌ బెస్ట్‌ డైరెక్టర్‌. ఆయన సంభాషణలు చక్కగా రాస్తాడు. సెట్స్‌లో కూల్‌గా ఉంటాడు. ఆయనతో వర్క్‌ చేయడం హ్యాపీగా ఉంటుంది. నా తదుపరి చిత్రాలు గురించి త్వరలోనే చెబుతాను'' అన్నారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved