pizza
Is Garuda Vega’s Heroine a Tamilian?
You are at idlebrain.com > news today >
Follow Us

7 June 2017
Hyderabad

The Dr. Rajsekhar-starring 'PSV Garuda Vega', directed by the critically-acclaimed filmmaker Praveen Sattaru, is being made without compromising on quality aspects.

Ever since the makers introduced to the world the film's female lead Pooja Kumar (seen as a housewife named Swathi), the misconception that she is a Tamilian has gained ground once again, years after the release of 'Vishwaroopam' and 'Uttama Villain'.

The fact is that she has no Tamil background, but actually traces her roots to the North. If we are seeing her as a Tamil woman, it's because she got into the skin of the characters she played in Kamal Haasan's movies that well.

Pooja is, in fact, an American by birth. Born to parents of Indian origin (they had migrated to the US from Uttar Pradesh), the talented diva went on to pursue modelling, acting, production and even had a stint with TV as a hostess. Crowned Miss India-US, Pooja is also a trained Classical dancer, well-versed with Kuchupudi, Bharatanatyam and Kathak.

As Swathi in 'PSV Garuda Vega', Pooja will be seen portraying a range of emotions. Such is the way her character has been etched by Sattaru. Swathi will be remembered for long.

Kishore as a fearsome villain George, Shraddha Das, Posani Krishna Murali and Arun Adith will be seen in key roles. Posani Krishna Murali, Ali, Prudhvi, Sayaji Shinde, Avasarala Srinivas, Shatru, Sanjay Swaroop, Ravi Varma, Adarsh, Charan Deep, Ravi Raj and others are a part of the cast.

Music is by Beems Cecirolio and Sricharan Pakala (the last one is giving BGM). Cinematography is by Anji, Suresh Raguthu, Shyam Prasad, Gika and Bakur. Sreekanth Ramisetty is the art director. Editing is by Dharmendra Kakarala.

Other details:

Co-Director : Kiran Jay Kumar, Asst directors : Uday alla, Mady, Sriraj Nilesh(Making), Associate Directors : Bhargav Tetali, Kaarthik Reddy, Sreekanth Reddy, Sejal Randhev, Operating cameraman : Devender Reddy, Nagarjuna Chirumamilla, Shiva, Associate Cameraman : Shiva, Sai, Choreographer : Vishnu Deva, Stunts : Nung, David Khubua, Satish, , Visual Effects Supervision : C.V. Rao (Annapurna Studios), Sound design : Vishnu, Costume designer : Boby Angara, Line producer : Murali Srinivas, Production managers : Sreenivasa Rao Palati, Sai Shivan Jampana, Make up : Prasanth, Costumes : Tillibilli Ramu , DI : Siva kumar, VFX - DI – Post Production: Annapurana Studios, Marketing Head : Vipin Surya, PRO : Beyond Media – Naidu & Phani.

`పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం`లో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌తో మెప్పించ‌నున్న పూజాకుమార్‌...

న్యూక్లియ‌ర్ సైన్స్ చదువుకున్న గృహిణి పాత్ర‌లో యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌తో విశ్వ‌రూపంలో న‌టించి మెప్పించింది హీరోయిన్ పూజా కుమార్‌. పూజా కుమార్ న‌ట‌న‌కు ముగ్ధుడైన క‌మ‌ల్ వెంట‌నే త‌ను న‌టిస్తూ నిర్మించిన ఉత్త‌మ‌విల‌న్‌లో సినిమా హీరోయిన్ పాత్ర‌ను ఆఫ‌ర్ చేశారు. ఆ పాత్ర‌లో కూడా క‌మ‌ల్ కు ధీటుగా న‌టించి అంద‌రి ప్ర‌శంస‌లు పొందారు. నిజానికి పూజా కుమార్ అమెరికాలో పుట్టి పెరిగిన‌ప్ప‌టికీ ఆమె త‌ల్లిదండ్రులు మాత్రం ఇండియా నుండి అమెరికాకు వెళ్ళి అక్క‌డ స్థిర‌ప‌డ్డ త‌మిళులు కావ‌డం గ‌మ‌నార్హం. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో నుండి పూజాకుమార్ కుటుంబం చాలా సంవ‌త్స‌రాలు క్రితం ఆమెరికాకు వ‌ల‌స వెళ్ళారు. అమెరికాలో న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకుని న‌టిగా, నిర్మాత‌గా, టెలివిజ‌న్ వ్యాఖ్యాత‌గా గుర్తింపు సంపాదించుకున్నారు. భ‌ర‌త‌నాట్యం, కూచిపూడి, క‌థ‌క్‌ల‌లో కూడా ప్రావీణ్యం పొందారు.

వ‌రుస సినిమాలు చేయాల‌ని కాకుండా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లోనే న‌టించడానికి ఆస‌క్తి చూపే పూజా కుమార్ ఇప్పుడు `పిఎస్‌వి గ‌రుడ వేగ 126.18 ఎం` చిత్రంలో డా.రాజ‌శేఖ‌ర్ భార్య‌గా, ఆరేళ్ళ బాబుకి త‌ల్లి స్వాతి రోల్‌లో న‌టిస్తుంది. యాంగ్రీ యంగ్ మేన్ డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం`. రష్య‌న్ స్టంట్ మాన్ డేవిడ్ ఖుబు, థాయిలాండ్ స్టంట్ మాన్ నుంగ్, మరియు ఇండియన్ స్టంట్ మాస్టర్ సతీష్ నేతృత్వం లో, జార్జియా, బ్యాంకాక్, మలేషియా, పట్టాయ, సింగపూర్, ముంబై వంటి ప్రదేశాల్లో యాక్ష‌న్ సీన్స్‌, చేజ్ సీక్వెన్స్‌ల‌ను హాలీవుడ్ యాక్ష‌న్ చిత్రాల‌కు ధీటుగా ఈ సినిమాలో రూపొందిస్తున్నారు. అలాగే బాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ విష్ణుదేవా కంపోజిష‌న్‌లో ముంబై లో వేసిన భారి సెట్ లో సన్నీ లియోన్ తో చేసిన ఐటెం సాంగ్ మ‌రో హైలైట్ అవుతుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా హైద‌రాబాద్‌లో ఫైన‌ల్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది.

డా.రాజ‌శేఖ‌ర్‌, అదితి, పూజా కుమార్‌, శ్ర‌ద్ధా దాస్‌, కిషోర్‌, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, అలీ, పృథ్వీ, షాయాజీ షిండే, అవ‌స‌రాల శ్రీనివాస్‌, శ‌త్రు, సంజ‌య్ స్వ‌రూప్‌, ర‌వివ‌ర్మ‌, ఆద‌ర్శ్‌, చ‌ర‌ణ్ దీప్‌, ర‌వి రాజ్ త‌ది త‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్ః టిల్లి బిల్లి రాము, మేక‌ప్ః ప్ర‌శాంత్‌, ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్స్ః శ్రీనివాస‌రావు ప‌లాటి, సాయి శివ‌న్ జంప‌న‌, లైన్ ప్రొడ్యూస‌ర్ః ముర‌ళి శ్రీనివాస్‌, కాస్ట్యూమ్స్ డిజైన‌ర్ః బాబీ అంగార‌, సౌండ్ డిజైన్ః విష్ణు, విజువ‌ల్ ఎఫెక్ట్స్ సూప‌ర్ వైజ‌న్ః సి.వి.రావ్‌(అన్న‌పూర్ణ స్టూడియోస్‌), స్టంట్స్ః స‌తీష్‌, నుంగ్‌, డేవిడ్ కుబువా, కొరియోగ్రాఫ‌ర్ః విష్ణుదేవా, ఎడిట‌ర్ః ధ‌ర్మేంద్ర కాక‌రాల‌, ర‌చ‌నః ప్ర‌వీణ్ స‌త్తారు, నిరంజ‌న్ రామిరెడ్డి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ః శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, స‌మ‌ర్ప‌ణః శివాని శివాత్మిక ఫిలింస్‌, నిర్మాణంః జ్యో స్టార్ ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆర్ట్ః శ్రీకాంత్ రామిశెట్టి, సినిమాటోగ్ర‌ఫీః అంజి, సురేష్ ర‌గుతు, శ్యామ్ ప్ర‌సాద్‌, గికా, బాకుర్, సంగీతంః భీమ్స్ సిసిరోలియో, శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, ప్రొడ్యూస‌ర్ః ఎం.కోటేశ్వ‌ర్ రాజు, క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వంః ప్ర‌వీణ్ స‌త్తారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved