pizza
Ayushman Bhava new poster
You are at idlebrain.com > news today >
Follow Us

1 April 2018
Hyderabad

 

స‌మాజం ప్రేమ‌ని చూసే ప‌ద్ద‌తి మారాలి అనే కాన్సెప్ట్ తో తెర‌కెక్కుతున్న "ఆయుష్మాన్ భ‌వ"

చ‌ర‌ణ్ తేజ్ హీరోగా త‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నేనేలోక‌ల్ చిత్ర ద‌ర్శ‌కుడు త్రినాథ్ రావు న‌క్కిన స్టోరి, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న చిత్రం ఆయ‌ష్మాన్‌భ‌వ‌. ఈ చిత్రాన్ని సి టి.ఎఫ్ నిర్మాణ‌భాద్య‌త‌లు నిర్వ‌హించారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత‌లు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ క‌థ‌నం తో రూపోందుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ లో బేబిడాళ్‌, హంగ్ ఓవ‌ర్‌, హైహీల్స్ లాంటి సూప‌ర్బ్ సాంగ్స్ కంపోజ్ చేసిన మీట్ బ్రోస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం లో ప్ర‌ముఖ హీరో్యిన్ స్నేహ ఉల్లాల్ చ‌ర‌ణ్ తేజ్ స‌ర‌స‌న న‌టిస్తుంది. స‌మాజం ప్రేమ‌ని చూసే ప‌ద్ద‌లి మారాలి అనే క‌మ‌ర్షియ‌ల్ పాయింట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం మెద‌టి లుక్ ని ఈరోజు విడుద‌ల చేసారు..

ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ తేజ్ మాట్లాడుతూ.. ముందుగా ఈ చిత్రానికి ఇంత మంచి క‌థ ని అందించట‌మే కాకుండా ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తున్న సూప‌ర్‌స‌క్స్‌స్‌ఫుల్ ద‌ర్శ‌కుడు త్రినాథ్ రావు న‌క్కిన గారికి, స్క్రీన్‌ప్లే అందించిన ప్ర‌ముఖ ర‌చ‌యిత‌లు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ కి నా హ్రుద‌య‌పూర్వ‌క ద‌న్య‌వాదాలు. అలాగే క్రేజి ద‌ర్శ‌కుడు మారుతి గారి మా చిత్రానికి స‌హ‌నిర్మాత‌గా భాద్య‌త‌లు స్వీక‌రించినందుకు వారికి నా ద‌న్య‌వాదాలు. మేము అడిగిన వెంట‌నే మా క‌థ న‌చ్చి మా చిత్రం లో హీరోయిన్ గా చేస్తున్న స్నేహ ఉల్లాల్ థ్యాంక్స్‌, స్నేహ ఉల్లాల్ పాత్ర చాలా బాగా డిజైన్ చేశాము. మాకు ఆడియో బాలీవుడ్ సూప‌ర్ మ్యూజిక్ ద‌ర్శ‌కుడు మీట్ బ్రోస్ చేస్తున్నారు. మ‌న తెలుగు రాష్ట్ర‌ల్లో మీట్ బ్రోస్ అందించిన ఆడియో నే యూత్ విప‌రీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్ప‌డు డైర‌క్ట్ గా వాళ్ళు మా చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి కులం, మ‌తం వేరైతే.. మ‌ర్చిపోవాలా.. పారిపోవాలా.. చ‌చ్చిపోవాలా.. ప్ర‌పంచం ఏమైతే నాకేంటి స‌మాజం ప్రేమ‌ని చూసే విధానం మారాలి లేక‌పోతే చంపేస్తా .. అనుకునే హీరో క్యార‌క్ట‌రైజేష‌న్ తో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ రోజు మెద‌టి లుక్ ని విడుద‌ల చేశాము.. షూటింగ్ పూర్తిచేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈ స‌మ్మ‌ర్ లోనే చిత్రాన్ని విడుద‌ల చేస్తాము. ఈ చిత్రం త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంద‌ని న‌మ్ముతున్నాము.. అని అన్నారు..

న‌టీన‌టులు.. చ‌ర‌ణ్‌తేజ్‌, స్నేహ ఉల్లాల్‌, హుజ‌న్‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ రావు, రంగ‌రాజ‌న్‌, అశ్విన్‌, నిఖిత త‌దిత‌రులు ..

టైటిల్‌.. ఆయుష్మాన్ భ‌వ‌
ప్రోడ‌క్ష‌న్ హౌస్ అండ్ ప్రోడ్యూస‌ర్‌.. సి.టి.ఎఫ్‌
స‌హ‌-నిర్మాత‌.. మారుతి
అసోసియెట్ ప్రోడ్యూస‌ర్‌.. బి.ఏ.శ్రీనివాస‌రావు , హేమ రత్న‌
క‌థ‌-ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌.. త్రినాథ్ రావు న‌క్కిన‌
క‌థ‌నం.. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌
సంగీతం- మీట్ బ్రోస్‌
పి.ఆర్‌.ఓ- ఏలూరు శ్రీను
కెమెరా.. దాస‌ర‌ధి శివేంద్ర‌
ఆర్ట్‌- పి.ఎస్‌.వ‌ర్మ‌
కాస్ట్యూమ్స్‌- పొట్ట హ‌రిక‌
సి.టి.ఎఫ్ టీమ్‌- రెడ్డి రాఘ‌వేంద్రావు, రొయ్య‌ల న‌వీన్ కుమార్‌, తాళ్ళ సుబ్బారెడ్డి.
ద‌ర్శ‌కత్వం- చ‌ర‌ణ్ తేజ్‌

Title : AYUSHMANBHAVA
Production house & Producer : C.TF
CO-Producer : MARUTHI
Associate Producer : B.A SRINIVAS RAO, HEMA RATNA
Story & directorial supervision :
TRINADHA RAO NAKKINA
Screenplay : PARUCHURI BROTHERS
Music director : MEET BROS ( Bollywood hit songs like BABYDOLL,
HANG OVER ,HIGH HEELS etc)
Cinematographer : DASARADHI SIVENDRA
Art director : P.S VARMA
Poster designer : ESWAR
Costume designer : POTTA HARIKA
C.T.F team : Reddy Raghavendra, royyala Naveen kumar, Thalla Subbareddy.
Direction by Charan Tez

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved