pizza
16 movie poster
16 -ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్‌` ఫస్ట్ లుక్ లాంచ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

30 January 2017
Hyderabad

శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్ నుంచి వ‌రుస‌గా స‌క్సెస్‌ఫుల్ చిత్రాలు తెలుగులో రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అదే కోవ‌లో ఇప్పుడు మ‌రో థ్రిల్ల‌ర్ మూవీని ప్ర‌ముఖ బ్యాన‌ర్లు, నిర్మాత‌ల‌తో పోటీప‌డి ఈ సంస్థ ద‌క్కించుకుంది. `ధురువంగ‌ల్ ప‌దినారు` (డి-16) పేరుతో ఇటీవ‌ల రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించిన త‌మిళ చిత్రాన్ని తెలుగులో `16 -ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్‌` పేరుతో అనువ‌దిస్తున్నారు. మార్చిలో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని లాంచ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి మాట్లాడుతూ -``త‌మిళంలో ఇటీవ‌ల రిలీజై ఇప్ప‌టికీ విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతున్న `ధ‌రువంగ‌ల్ ప‌దినారు` చిత్రాన్ని తెలుగులో `16-ఎవ్వెరి డీటెయిల్ కౌంట్స్‌` పేరుతో అనువ‌దిస్తున్నాం. హాలీవుడ్ స్థాయిలో ఉత్కంఠ‌భ‌రితంగా తెర‌కెక్కిన థ్రిల్ల‌ర్‌గా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్న చిత్ర‌మిది. త‌మిళ‌నాట‌ ఇప్ప‌టికీ చ‌క్క‌ని వ‌సూళ్ల‌తో దూసుకెళుతోంది. వాస్త‌వానికి ఈ సినిమాని టాలీవుడ్‌కి చెందిన ప‌లువురు ప్ర‌ముఖ నిర్మాత‌లు, హీరోలు నేరుగా తెలుగులో రీమేక్ చేసే ఉద్ధేశంతో భారీ మొత్తాల్ని వెచ్చించి చేజిక్కించుకోవాల‌నుకున్నారు. కానీ పోటీలో ఫ్యాన్సీ మొత్తాన్ని చెల్లించి చేజిక్కించుకున్నాం. ఈ చిత్రానికి కార్తీక్ న‌రేన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రెహ్మాన్ హీరోగా న‌టించారు. అలాగే ధృవ సినిమాలో అర‌వింద్ స్వామి పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పిన సింగ‌ర్ కం మ్యూజిక్ డైరెక్ట‌ర్ హేమ‌చంద్ర ఈ చిత్రంలో హీరో పాత్ర‌కు డ‌బ్బింగ్ చెబుతున్నారు. సుజిత్ స‌రంగ్ కెమెరా వ‌ర్క్‌, జాకేష్ బిజోయ్ సంగీతం, రీరికార్డింగ్ హైలైట్‌. తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించే అన్నిర‌కాల అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో స‌రికొత్త అనుభూతినిచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయి. అనువాద కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి మార్చిలో సినిమాని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved