pizza
Ace production house Hombale Films to make pan-India movie 'Salaar' with pan-India star Prabhas and director Prashanth Neel:
ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్‌ నిర్మాణంలో రూపొందనున్న ప్యాన్‌ ఇండియా మూవీ 'సలార్'
You are at idlebrain.com > news today >
 
Follow Us

02 December -2020
Hyderabad

 

 

Hombale Films is a prominent production house that has taken the range of south Indian films to the next level by making big-budgeted films of high technical values. And the banner has now announced a pan-India film after producing 'KGF Chapter: 1' with Rocking Star Yash and director Prashanth Neel. We all know what a big sensation the film created at the box-office when it released. The eminent production house is now producing 'KGF Chapter: 2' in the same sensational combination. This is one of the most anticipated movies ever.

Producer Vijay Kiragandur of the banner is now set to bankroll a pan-India flick with superstar Prabhas as the hero. Titled 'Salaar', it will be directed by the super-talented Prashanth Neel. Announcing the big-ticket project, the makers have also revealed Prabhas' awesome look.

Speaking about the prestigious film, Vijay Kiragandur said, "After the 'KGF' franchise, 'Salaar' is going to be the third pan-India project from our banner. We are glad to associate with Prashanth Neel, who is a favourite of both the audience and critics. Prabhas, who has impressed national and international audiences with 'Baahubali', is our hero. The plan is to kickstart the shoot in January next year. 'Salaar' will be released after 'Radhe Shyam' comes out. We are going to make this movie in all major Indian languages."


ప్యాన్ ఇండియా ‌స్టార్‌ ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్‌ నిర్మాణంలో రూపొందనున్న ప్యాన్‌ ఇండియా మూవీ ‘సలార్’

భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో క్వాలిటీ చిత్రాల‌ను నిర్మించి ద‌క్షిణాది సినీ పరిశ్ర‌మ‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాల‌నే ఉన్న‌తాశ‌యంతో ప్రారంభమైన నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్‌ ఇప్పుడు ప్యాన్‌ ఇండియా నిర్మాణ సంస్థగా మారింది. ఈ బ్యానర్‌లో రాకింగ్‌స్టార్ య‌ష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో చేసిన భారీ బడ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్ ప్యాన్‌ ఇండియా మూవీ ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్‌1’ బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే మ‌రో ప్యాన్ ఇండియా భారీ బ‌డ్జెట్ మూవీ ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’ చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా విడుద‌ల గురించి ప్రేక్ష‌కాభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూశారు. ఇప్పుడు హోంబ‌లే ఫిలింస్ అధినేత విజయ్‌ కిరగందూర్...ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తన బ్యానర్‌లో మూడో ప్యాన్ ఇండియా మూవీగా .‘సలార్’ను రూపొందించనున్నట్లు ప్రకటించారు. సినిమా టైటిల్‌తో పాటు ప్రభాస్ లుక్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సంద‌ర్భంగా...

విజయ్‌ కిరగందూర్‌ మాట్లాడుతూ "మా బ్యానర్‌లో కె.జి.యఫ్‌ చాప్టర్‌ 1, కె.జి.యఫ్‌ చాప్టర్‌ 2 వంటి ప్యాన్‌ ఇండియా చిత్రాల తర్వాత మూడో ప్యాన్‌ ఇండియా చిత్రాన్ని రూపొందించబోతున్నాం. అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాను రూపొందించనున్నారు. బాహుబలిగా ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరించిన ప్యాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో సినిమా షూటింగ్‌ను స్టార్ట్‌ చేయబోతున్నాం. ఇప్పుడు ప్రభాస్‌ చేస్తున్న 'రాధేశ్యామ్‌' విడుదల తర్వాత సినిమాను విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నాం. ప్యాన్‌ ఇండియా మూవీగా రూపొందనున్న ‘సలార్’ చిత్రాన్ని భారతీయ భాషలన్నింటిలో రూపొందిస్తాం" అన్నారు.

 

 

 




   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved