pizza
Prabhas announces a donation of Rs 1.5 crore to help Telangana flood relief
హైద‌ర‌బాద్ వ‌ద‌ర బాధితుల స‌హాయార్ధం 1 కోటి 50 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించిన రెబల్ స్టార్ ప్ర‌భాస్
You are at idlebrain.com > news today >
 
Follow Us

21 October -2020
Hyderabad

Hyderabad is reeling under flash floods as heavy rains have devastated the lives of many. Adding to the woes, the Covid-19 pandemic has pushed many people into a financial crisis. In the wake of these hardships, Telangana chief minister KCR has requested everyone to chip in and contribute as much as they can to help flood relief. Incidentally, Tollywood is coming forward to help those in need. The latest news is that Prabhas has announced a big donation of Rs 1.5 crore to Telangana chief minister relief fund in a bid to support flood relief activities. Also, Prabhas requested his fans and followers to support those in need. This is not the first time Prabhas is making size able donations in times of distress. He previously donated Rs 4 crores during Covid-19 lockdown crisis as we. Presently, Prabhas is shooting for Radhe Shyam in Italy.

హైదరాబాద్ ను ముంచెత్తిన అకాల వ‌ర్షాలు చాలామందిని నిరాశ్రయుల‌ను చేసింది. ఈ వరదల విపత్తుతోపాటు కరోనా కారణంగా అందరి ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఈ క్రమంలోనే వరద బాధితులను ఆదుకోవాలన్న సీఎం కేసీఆర్ పిలుపునకు అద్భుతమైన స్పందన వస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు కష్టాల్లో ఉండే ప్రతిసారి స్పందించే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఈసారి కూడా స్పందించింది. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ వరద బాధితుల కోసం తన వంతు సాయం ప్రకటించారు. తెలంగాణ సీఎం సహాయనిధికి కోటిన్నర రూపాయల విరాళం అందిచారు. అలానే బాధితుల‌కి త‌మ‌కు చేత‌నైన రీతిలో స‌హాయం చేయాల్సిందిగా త‌న అభిమానుల‌కి పిలుపునిచ్చారు ప్ర‌భాస్. గ‌తంలో కూడా ఇలాంటి విప‌త్తుల్లో చిక్కుకున్న బాధితుల‌కి త‌న వంతు సహాయం అందించ‌డంలో ముంద‌డుగు వేశారు ప్ర‌భాస్. క‌రోనా క్రైసిస్ కార‌ణంగా న‌ష్ట‌పోయిన వారిని ఆదుకునేందుకు ప్ర‌భాస్ 4 కోట్లు విరాళం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ లో భాగంగా ఇటలీలో ఉన్నారు.



   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved