pizza
Suvarnasundari pres look
చ‌రిత్ర నేప‌థ్యంలో `సువ‌ర్ణ‌సుంద‌రి`!
You are at idlebrain.com > news today >
Follow Us

12 July 2017
Hyderabad

తెలుగు సినిమా ట్రెండ్ మారుతోంది. చ‌రిత్ర నేప‌థ్యంలో అద్బుత చిత్రాలెన్నో ఇదివ‌ర‌కూ వ‌చ్చాయి. ఇప్పుడు అదే త‌ర‌హాలో హిస్ట‌రీ బేస్ చేసుకుని మ‌రో ఆస‌క్తిక‌ర చిత్రం తెర‌కెక్కుతోంది. క‌థ‌, కాన్సెప్ట్ ప్ర‌ధానంగా చ‌రిత్ర‌ను ఆవిష్క‌రిస్తూ తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `సువ‌ర్ణ సుంద‌రి`. `చ‌రిత్ర ఎప్పుడూ భ‌విష్య‌త్‌ని వెంటాడుతుంది` అనేది ట్యాగ్‌లైన్‌. ఎస్‌.టీమ్ పిక్చర్స్ బ్యానర్ పై ఎమ్.ఎల్ లక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 14న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేస్తున్నారు.

అయితే తాజాగా రిలీజైన ప్రీలుక్ కి అదిరిపోయే స్పంద‌న వ‌స్తోంది. ఈ పోస్ట‌ర్‌లో భారీ సైన్యం, యుద్ధ వాతావ‌ర‌ణం ఆస‌క్తి పెంచుతోంది. ఇక పోస్ట‌ర్ లో సువ‌ర్ణ సుంద‌రి శిలా విగ్ర‌హం .. చూస్తుంటే మూవీ క‌థాంశం సంథింగ్ స్పెష‌ల్ అని అర్థ‌మ‌వుతోంది. ఇక బ్యాక్‌గ్రౌండ్‌లో అద్భుత క‌ళాత్మ‌క‌త‌తో కోట‌లు, దేవాల‌య‌ శిల్ప‌సంప‌ద‌ను ఆవిష్క‌రించిన తీరు చూస్తుంటే నాటి చ‌రిత్ర‌లో ఎన్నో న‌గ్న‌స‌త్యాలు దాగి ఉన్నాయి. అలాంటి వాటినుంచి ఓ స‌త్యాన్ని వెలికి తీస్తున్నారా? అన్నంత క్యూరియాసిటీ పెంచుతోంది ఈ పోస్టర్‌. సూర్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి ప్ర‌వీణ్ పూడి, సాయి కార్తీక్ వంటి ప్ర‌తిభావంతులైన సాంకేతిక నిపుణులు ప‌ని చేస్తుండ‌డం విశేషం. ఇక న‌టీన‌టులు, ఇత‌ర టెక్నీషియ‌న్ల వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డి కానున్నాయి.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved