6 March 2013
Hyderabad
ప్రేమ సాగరం, ప్రేమసామ్రాజ్యం, మైధిలి నా ప్రేయసి, హలో మై డియర్ మొనీషా, వరపుత్రుడు, కుర్రాడొచ్చాడు వంటి చిత్రాల నిర్దేశకుడు సుప్రసిద్ధ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత టి. రాజేందర్ ఓ ప్రేమకధా చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు.
'శింబు సినీ ఆర్ట్స్' పతాకంపై 'ప్రేమదాసు' పేరుతొ తెలుగు లో తెరకెక్కే ఈ చిత్రానికి కధ , స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, కెమెరా పర్యవేక్షణ, దర్శకత్వం వహిస్తూ ఆయన నిర్మిస్తున్న చిత్రమిది.
ఈ సందర్భంగా టి . రాజేందర్ మాట్లాడుతూ 'పూర్తిగా గోదావరి తీర ప్రాంతాలలో, పచ్చదనంలో, పల్లెటూరి వాతావరణంలో సాగే స్వచ్ఛమైన అచ్చతెలుగు 'సంగీత భరిత ప్రేమకధా చిత్రం ఈ 'ప్రేమదాసు' అని అన్నారు. ఆయనే ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం లో నాయికగా నీహారిక నటిస్తున్నారు.
ఈ నెల 18 న హైదరాబాద్ లో ప్రారంభమయ్యే చిత్రం షూటింగ్ ఆ తరువాత గోదావరి ప్రాంతానికి చేరుకుంటుంది. 'మే' నెలాఖరునాటికి చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తవుతాయని టి . రాజేందర్ తెలిపారు.
ఇతర ప్రధాన పాత్రలలో సీతానారాయణన్, ఏవీయస్, నాగినీడు, దినేష్, అనంత్, ధనరాజ్, నల్లవేణు, తిరుపతిప్రకాష్, సుమన్ షెట్టి, ప్రభ, జయలలిత లు నటిస్తున్నారు.
కెమెరా: సావై సహదేవన్; రచనా సహకారం: బోస్ బాబు. జి; ఆర్ట్: మహి; ఎడిటింగ్: సుధాకర్; సహ నిర్మాత: ఉషా రాజేందర్.
కధ - మాటలు- పాటలు- సంగీతం- కెమెరా పర్య వేక్షణ- నిర్మాత- దర్శకత్వం: టి. రాజేందర్