pizza
Premam – Video Song Release on August 29, Audio on September 20, Release Dussehra
చైతన్య అక్కినేని 'ప్రేమమ్' వీడియో పాట ఆగస్టు 29, ఆడియో సెప్టెంబర్ 20, దసరా కు చిత్రం విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us

24 August 2016
Hyderaba
d

The most eagerly awaited movie of this season “Premam” featuring eclectic star cast of Chaitanya akkineni, beautiful top actress Shruti Haasan, ‘A Aa’ fame Anupama Parameshwaran and Malayalam’s rising queen Madonna Sebastian is gearing up for audio launch.

Young producer Suryadevara Naga Vamsi is producing the beautiful love story on Sithara Entertainments banner in the direction of Chandu Mondeti, who won the hearts of the audiences and critics with his debut movie “Karthikeya”. PDP Prasad presents the film. As post-production work is in full-swing, producer Naga Vamsi has put out a plan to release the movie’s first video song and audio event on special occasions that are dear to all Akkineni fans.

“Evare” video song on Nagarjuna’s birthday

“We have released the first audio song from the movie ‘Evare’ recently on a radio station and we are pleased to share our joy with you that the song is now topping the charts. Written by Srimani and sung by Vijay Yesudas, it has become a rage. On the occasion of Nagarjuna garu’s birthday on August 29th, we will be releasing the video for the same song as our gift to Nagarjuna’s fans,” producer Naga Vamsi said.

Audio event on ANR’s birth anniversary

“On September 20th, birth anniversary of legendary Akkineni Nageshwara Rao garu, we are going to launch the audio event in a grand manner in the presence of all the fans and film dignitaries,” Naga Vamsi further added.

Release as Dussera gift

We are also pleased to inform that we are planning to release in the month of October as Dussera festival gift, Naga Vamsi said.

Chaitanya also added that this musical love story is very close to his heart. “It will touch everyone’s heart as well,” he asserted. “Premam” has music by Gopi Sunder and Rajesh Murugan with lyrics written by Rama Jogaiah Sastry, Srimani, Vanamali, Poorna and Krishna Madineni.

Cast: Naga Chaitanya, Shruti Haasan, Anupama Parameshwaran, Madonna Sebastian, Eeshwari Rao, Jeeva, Brahmaji, Srinivasa Reddy, Prudhvi, Narra Sreenu, Praveen, Chaitanya Krishna, Aravind Krishna, Satya Karthik Prasad, Noel and Jogi Brothers
Cinematography: Karthik Ghattamaneni
Editing: Kotagiri Venkateshwara Rao
Art: Saahi Suresh
Original Story: Alponse Puthran
Presented by: PDV Prasad
Producer: Suryadevara Naga Vamsi
Screenplay, dialogues and direction: Chandoo Mondeti

చైతన్య అక్కినేని 'ప్రేమమ్' వీడియో పాట ఆగస్టు 29, ఆడియో సెప్టెంబర్ 20, దసరా కు చిత్రం విడుదల

చైతన్య అక్కినేని, శ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్ లో, దర్శకుడు 'చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమమ్'.

ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ...'ఈ చిత్రం లోని ఒక పాటను ఇటీవల ఎఫ్.ఎం. స్టేషన్ లో విడుదల చేసిన విషయం విదితమే. ' ఎవరే .. అంటూ సాగే ఈ గీతాన్ని గీత రచయిత శ్రీమణి రచించగా, గాయకుడు విజయ్ ఏసుదాస్ ఆలపించారు. ఈ గీతం ఇప్పటికే లక్షలాది మంది సంగీత ప్రియులను అలరించింది.

యువసామ్రాట్ 'అక్కినేని నాగార్జున' పుట్టిన రోజు కానుకగా పాట వీడియో..
యువసామ్రాట్ 'అక్కినేని నాగార్జున' (ఆగస్టు 29) పుట్టిన రోజు కానుకగా 'ఎవరే' పాట వీడియో ను విడుదల చేస్తున్నట్లు నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.

అక్కినేని నాగేశ్వరరావు జయంతి రోజున ఆడియో:

స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి, సెప్టెంబర్ 20న 'ప్రేమమ్' ఆడియోను అక్కినేని వంశాభిమానుల సమక్షంలో,చిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరుపనున్నాము.

'దసరా' కానుకగా 'ప్రేమమ్'
ప్రేమతో కూడిన సంగీత భరిత దృశ్య కావ్యం అయిన ఈ చిత్రాన్ని అక్టోబర్ లో 'దసరా పండుగ' కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు చైతన్య అక్కినేని మాట్లాడుతూ.. ' నా మనసుకు బాగా హత్తుకున్న చిత్రం ఇది, ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది 'ప్రేమమ్' అన్నారు.

చిత్రంలోని ఇతర తారాగణం ఈశ్వరీరావు,జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి,పృథ్వి,నర్రాశ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవిందకృష్ణ , సత్య,కార్తీక్ ప్రసాద్, నోయల్, జోగి బ్రదర్స్.

ఈ చిత్రానికి సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్,
పాటలు: రామజోగయ్య శాస్త్రి,వనమాలి, శ్రీమణి, పూర్ణ, కృష్ణ మాదినేని;

చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని:
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు;
ఆర్ట్: సాహి సురేష్;
ఒరిజినల్ స్టోరి: ఆల్ఫోన్సె పుధరిన్;
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: చందు మొండేటి


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved