pizza
Premante Suluvu Kadura Audio on 6 December
డిసెంబర్‌ 6, (ఆదివారం) సాయంత్రం 6 గం॥లకు..
‘ప్రేమంటే సులువు కాదురా’ ఆడియో వేడుక!!
You are at idlebrain.com > news today >
Follow Us

04 December 2015
Hyderabad

యువ ప్రతిభాశాలి చందా గోవింద్‌రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఆర్‌.పి.క్రియేషన్స్‌ పతాకంపై భవనాసి రాంప్రసాద్‌ నిర్మిస్తున్న వినూత్న ప్రేమకథా చిత్రం ‘ప్రేమంటే సులువు కాదురా’. కొమారి సుధాకర్‌రెడ్డి-శ్రీపతి శ్రీరాములు సహ నిర్మాతలు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ సాలూరి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో.. సిమ్మీదాస్‌ హీరోయిన్‌. ఈ చిత్రం ఆడియో.. ఆదివారం (డిసెంబర్‌ 6) సాయంత్రం 6 గం॥లకు ప్రముఖ ఆడియో కంపెనీ ‘మధుర మ్యూజిక్‌’ ద్వారా విడుదల కానుంది. హైద్రాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌ ప్రివ్యూ ధియేటర్‌ ఇందుకు వేదిక కానుంది. పలువురు ప్రముఖులు ఈ పాటల వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొంటున్నారు. కృష్ణ మదినేని సాహిత్యం సమకూర్చిన ఈ చిత్రానికి యువ సంగీత తరంగం నందన్‌రాజ్‌ స్వర సారధ్యం వహిస్తుండగా.. ‘ప్రాణం’ కమలాకర్‌ నేపధ్య సంగీతం అందిస్తున్నారు!!

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved