pizza
Great response for RVRG and Palasa on Prime Video
"రాజావారు రాణివారు", "పలాస"కు దక్కుతున్న ఆదరణ.మంచి సినిమాలకు గొప్ప స్పందన
You are at idlebrain.com > news today >
Follow Us

09 April 2020
Hyderabad



కొన్ని సినిమాలు పేరుకు చిన్న సినిమాలే అయినా రిలీజ్ తర్వాత అంచనాలు పెరుగుతాయి. అలాంటి కోవలోకి వచ్చే సినిమాలే "రాజావారు రాణివారు", "పలాస". ఈ రెండూ చిన్న సినిమాలుగానే విడుదలై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రాబట్టుకున్నాయి. రియలిస్టిక్ గా ఉంటే ఈ సినిమాలు చూసిన ప్రతి ఒక్కరూ వారి అభిప్రాయాలుమార్చుకోవడం ఖాయం. కొత్త దర్శకులతో కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రాలు గుర్తిండిపోయే సినిమాలుగా ఉంటాయి. గ్రామ రాజకీయాలు, సమాజంలోని కుల వివక్ష, అగ్రవర్ణాల దాడులు తదితర అంశాలను ఆధారంగా చేసుకొని సంధించిన సినీ విమర్శనాస్త్రం ‘పలాస’అయితే.. అచ్చమైన పల్లెటూరి స్వచ్చమైన ప్రేమకథా చిత్రం ‘రాజావారు రాణివారు’.

రవికిరణ్ కోలా దర్శకత్వంలో కిరణ్ అబ్బవరమ్, రహస్య గోరక్ హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాలోని పాత్రలను బుర్రకథ స్టైల్‌లో పరిచయం చేయడం బాగుంటుంది.

ఇదిలా ఉంటే.. 1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఇటీవల విడుదలైన సినిమా ‘పలాస’.తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో కరుణకుమార్ దర్శకుడిగా పరిచయం కాగా...నూతన నటీనటులు రక్షిత్ నక్షత్ర జంటగా నటించారు. పీరియాడికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మార్చి6న అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.

లాక్ డౌన్ కారణంగా థియేటర్లన్నీ మూతపడటంతో ఈ రెండూ సినిమాలకూ తాజాగా ఇప్పుడు మరోసారి ఆదరణ దక్కుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ చిత్రాలకు మంచి స్పందన వస్తోంది. థియేటర్లలో చూడలేకపోయినవారు అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాలను వీక్షిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పెద్ద సినిమాలకంటే ఈ సినిమాకు ప్రైమ్ లో ఆదరణ దక్కడం విశేషంగా చెప్పుకోవచ్చు. మంచి సినిమాలు చూస్తున్న అనుభూతి కలుగుతుందని ఈ రెండు సినిమాలకు ప్రశంసలు దక్కుతున్నాయి. పెద్ద సినిమాల కారణంగా థియేటర్ల సమస్యలతో మరుగున పడిపోతాయనుకున్న సినిమాలు అమెజాన్ ప్రైమ్ ద్వారా మరింత మంది ప్రేక్షకులకు చేరువ అవుతున్నాయి. ఈ సినిమాలకు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఇంత మంచి స్పందన రావడంతో ఆయా చిత్రయూనిట్ కి, దర్శకులకు మరిన్ని మంచి సినిమాలు తీసేలా ప్రొత్సాహాన్ని ఇచ్చినట్లుంది.

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved