pizza
Prudhviraj interview (Telugu) about Meelo Evaru Koteeswarudu
`మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు` వంటి మూవీ చేయ‌డం చాలా హ్యాపీగా ఫీల‌వుతున్నాను - పృథ్వీ
You are at idlebrain.com > news today >
Follow Us

12 December 2016
Hyderaba
d

పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్‌ 16న విడుదల చేసేందుకు నిర్మాత కె.కె.రాధామోహన్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా పృథ్వీ పాత్రికేయుల స‌మావేశంలో సినిమా గురించిన సంగ‌తుల‌ను తెలియ‌జేశారు.

1000 ప‌ర్సెంట్ బాగా తీశారు...
- మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు నిర్మాత కె.కె.రాధామోహ‌న్‌గారు తీసిన గ‌త చిత్రంలో బెంగాల్ టైగ‌ర్‌లో మంచి క్యారెక్ట‌ర్ చేశాను. అందులో నా క్యారెక్ట‌ర్‌కు పేరుతో పాటు అవార్డ్స్ కూడా వ‌చ్చాయి. ఓ రోజు డైరెక్ట‌ర్ స‌త్తిబాబుగారు ఫోన్ చేసి ఆఫీస్‌కు ర‌మ్మంటే వెళ్లి కలిశాను. క‌థ చెప్పి, నా క్యారెక్ట‌ర్ గురిచంఇ చెప్పారు. ఆయ‌న నా క్యారెక్ట‌ర్‌ను నెరేట్ చేసిన దాని కంటే 1000 ప‌ర్సెంట్ బాగా ప్రెజెంట్ చేశారు. నా క్యారెక్ట‌ర్ ఇంత బాగా వ‌స్తుంద‌ని ఊహించ‌లేదు మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు వంటి మూవీ చేయ‌డం చాలా హ్యాపీగా ఫీల‌వుతున్నాను.

అలా నేను ఎప్ప‌టికీ ఫీల్ కాను....
- ఈ సినిమాలో నేను ఓ కీల‌క‌పాత్ర‌లో క‌న‌ప‌డ‌తానే త‌ప్ప నేను హీరో కాదు. ఇక సినిమాలో న‌వీన్‌చంద్ర హీరో. త‌ను బ‌య‌ట అంద‌రూ న‌న్నే హీరో అనుకుంటున్నార‌ని అంటున్నారు. త‌ను చాలా ఫ్రెండ్లీ హీరో. సినిమా కోసం డైరెక్ట‌ర్ ఏం చెబితే అదే చేశామంతే. క‌మెడియ‌న్ ఇంపార్టెంట్ క్యారెక్ట‌ర్ చేసినా క‌మెడియ‌న్ గానే ఉండాలి అని కోట‌గారు నాతో ఓ సంద‌ర్భంలో అన్న‌మాట‌ను నేనెప్ప‌టికీ గుర్తుంచుకుంటాను. అందుచేత నేనేదో హీరో అయిపోయాను అని ఫీల‌వ్వ‌డం లేదు.

Prudhviraj interview gallery

క‌న్నీళ్లు వ‌చ్చాయి....
- సినిమా కోసం చాలా మంది ఆస‌క్తిగానే ఎదురుచూస్తున్నారు. ట్రైల‌ర్ చాలా బావుంద‌ని అంటున్నారు. ఫోన్ చేసి చాలా మంది అభినందించారు కూడా. రీసెంట్‌గా నేను ధృవ సినిమా చూస్తున్న‌ప్పుడు మీలో కోటీశ్వ‌రుడు ట్రైల‌ర్ వేసిన‌ప్పుడు ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఆ రెస్పాన్స్ చూసి క‌ళ్లంట నీళ్లు వ‌చ్చాయి.

క్రెడిట్ ఆయ‌న‌కే...
- ఈ సినిమాలో నాకు జ‌త‌గా స‌లోని న‌టించింది. అయితే మా మ‌ధ్య ఓ పాట త‌ప్ప కెమిస్ట్రీ ఏమీ లేదు. సాంగ్‌లో నేను డ్యాన్స్ బాగా వేశానంటున్నారు కానీ ఆ క్రెడిట్ అంతా గ‌ణేష్ మాస్ట‌ర్‌కే ద‌క్కుతుంది. ఈ సినిమాలో సాంగ్ చేయాల్సిన స‌మ‌యంలో వేరే సినిమా షూటింగ్‌లో కాలు బెణికింది. ఈ బెణికి కాలుతో డ్యాన్స్ ఎలా చేయ‌గ‌ల‌ను అని గ‌ణేష్ మాస్ట‌ర్ కి చెబితే మీతో నేను చేయిస్తాను అని ఆ సాంగ్ చేయించారు. అందులో ముఠామేస్త్రి గెట‌ప్ లో డ్యాన్స్ మూమెంట్ ఉంటుంది. ఇది ఫ‌స్ట్ షాట్ కే ఓకే అయిపోయింది. ఈ సాంగ్ వ‌చ్చిన‌ప్పుడు థియేట‌ర్స్ లో విజిల్సే విజిల్స్ ప‌డ‌తాయి.

అంద‌రూ ఆ ప‌నిచేస్తే బావుంటుంది...
- డీ మానిటైజేష‌న్ వ‌ల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో సినిమాలు తీయాల‌న్నా నిర్మాత‌ల‌కు క‌ష్ట‌మే. అందుచేత నేనైతే ల‌క్ష రూపాయ‌లు తీసుకునే వ‌ర్క్ కి 20,000 తీసుకుంటాను. నాలాగే మిగిలిన ఆర్టిస్టులు కూడా రెమ్యూన‌రేష‌న్ త‌గ్గించుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచ‌న‌.

బాల‌య్య అభినందించారు...
- బాల‌య్య‌ను ఓ సినిమాలో ఇమిటేట్ చేస్తున్నాన‌ని ఫ్యాన్స్ ఫీల‌య్యారు. బాల‌య్య బాబు ప్రెసిడెంట్ జ‌గ‌న్ ఫోన్ చేసి ఈ విష‌యం చెప్పారు నేను వాళ్ల‌తో మాట్లాడ‌టంతో స‌మ‌స్య స‌ద్దుమ‌ణిగింది. అయితే డిక్టేట‌ర్ సినిమాలో బాల‌య్య‌తో క‌లిసి న‌టించాను. ఆయ‌న ముందే ఆయ‌న్ని ఇమిటేట్ చేసి డైలాగ్ చెబితే బాగుంది అని అభినందించారు. అంతే కాకుండా ఆయ‌న నాతో ల‌క్ష్మీ న‌ర‌సింహా స్వామి దీక్ష చేయించారు.

తదుప‌రి చిత్రాలు...
- `కాట‌మ‌రాయుడు` హీరోయిన్ బాబాయ్‌గా న‌టిస్తున్నాను. ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, శృతిహాస‌న్ కాంబినేష‌న్లో ఎక్కువ సీన్స్ లో న‌టిస్తున్నందుకు హ్యాపీగా ఫీల‌వుతున్నాను. సాయిధ‌ర‌మ్ తేజ్ విన్న‌ర్, వ‌రుణ్ తేజ్ మిస్ట‌ర్, నాని, జ‌య గారి వైశాఖం చిత్రాల్లో న‌టిస్తున్నాను. వీటితో పాటు తెలంగాణ పోరాట యోధుడు క‌థ‌తో మ‌ల్ల‌ప్ప అనే సినిమా చేస్తున్నాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved