26 January 2022
Hyderabad
There have been several rumors floating around in social media about Radhe Shyam getting sold to an exclusive OTT platform and there w dealould be no theatrical release. These rumors went to the extent that producers allegedly demanded Rs. 350 crores for the same. Some people started speculating about going in with the pay per view model on a OTT platform.
There is an official communication today from the director Radha Kumar. While greeting his followers on the republic day, the director mentioned that Radhe Shyam will release soon in the theaters.
A few moments back, Music director Thaman who is scoring the background music for the south Indian versions of Radhe Shyam has clarified that this grand film will only release in theaters first with the finest experience of Dolby Atmos.
Hopefully, these two tweets will put a check on the rumor mills for the time being.
‘రాధే శ్యామ్’ రిలీజ్‌పై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’. పూజా హెగ్డే హీరోయిన్. పీరియాడిక్ లవ్ స్టోరిగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సింది. కోవిడ్ పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు మేకర్స్ మరో మంచి రిలీజ్ డేట్ కోసం వేచి చూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ గురించి మరోసారి సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. అవేంటంటే.. ‘రాధే శ్యామ్’ సినిమాను ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేయబోతున్నారని.
దేశం యావత్తు థియేటర్స్ పూర్తి స్థాయిలో తెరుచుకోవడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. అయితే ‘రాధే శ్యామ్’ లవ్‌స్టోరి కాబట్టి.. రానున్న వేలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న సినిమాను విడుదల చేయడానికి ప్రముఖ ఓటీటీ ఛానెల్ ‘రాధే శ్యామ్’ మేకర్స్‌తో సంప్రదింపులు జరుపుతుందని, త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని వార్తలు హల్ చల్ చేశాయి.
అయితే ఈ వార్తలను ‘రాధే శ్యామ్’ మేకర్స్, డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వంటి వారు తోసి పుచ్చారు. డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ తన ట్విట్టర్ ద్వారా ‘రాధే శ్యామ్’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చేశారు. తమ మూవీ థియేటర్స్‌లోనే రిలీజ్ అవుతుందని ప్రకటించేశారు. అలాగే ‘గ్రాండ్ విజువల్స్, గ్రాండ్ సౌండ్, గ్రాండ్ మేకింగ్.. గ్రాండ్ లవ్‌తో రాధే శ్యామ్ సినిమాను చేశాం. నేను మీతో కలిసి థియేటర్స్‌లోనే సినిమాను చూస్తాను’ అంటూ తమన్ ట్వీట్ చేయడం విశేషం.
‘రాధే శ్యామ్’ .. హిందీ వెర్షన్ సాంగ్స్‌కు మిథున్, అమాన్ మాలిక్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. అలాగే సంచిత్ బల్‌హారా, అంకిత్ బల్‌హారా బాలీవుడ్ వెర్షన్‌కి నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక దక్షిణాదిన పాటలకు జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు. నేపథ్య సంగీతాన్ని తమన్ అందిస్తున్న సంగతి తెలిసిందే.