pizza
Rahul Ramakrishna interview about Jathi Ratnalu
‘జాతిరత్నాలు’ సినిమాకు హ్యూమరే పెద్ద బలం – రాహుల్‌ రామకృష్ణ
You are at idlebrain.com > news today >
 
Follow Us

14 March -2021
Hyderabad

 

నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో కేవీ అనుదీప్‌ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘జాతిరత్నాలు’. స్వప్న సినిమాస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్‌ నిర్మించారు. ఈ నెల 11న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన రాహుల్‌ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు..

– ఈ సినిమాలో నేను రవి పాత్ర చేశాను. ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్సాన్స్‌ వస్తోంది. చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఫోన్‌ చేసి అనుదీప్‌ కథ వినమన్నాడు. అనుదీప్‌ చెప్పిన కథ విని నేను చాలా నవ్వుకున్నాను. అనుదీప్‌ కథను నరేట్‌ చేస్తున్నప్పుడు నేను కూర్చిలో కుర్చొలేక నవ్వుతూనే ఉన్నాను. అంతలా ఎంజాయ్‌ చేశాను.

– అనుదీప్‌ చెప్పిన నరేషన్‌ బాగానే ఉంది. కానీ ఆడియన్స్‌ ఈ సినిమా కనెక్ట్‌ అవుతుందా? లేదా? అనే ఆలోచనలు మొదట్లో నాకు ఉండేవి. కానీ జాతిరత్నాలు సినిమా రిలీజ్‌ తర్వాత అవి పటాపంచలైపోయాయి.
ఇప్పుడు జాతిరత్నాలు సినిమాకు ప్రేక్షకలు నుంచి వస్తున్న రెస్పాన్స్‌ మా టీమ్‌ అందరికీ సంతోషాన్ని ఇస్తుంది.

– ప్రియదర్శి నాకు 12 ఏళ్లుగా తెలుసు. నవీన్‌ను కలవడం మాత్రం ఇదే తొలిసారి. కానీ తక్కువటైమ్‌లోనే నవీన్‌ మాతో బాగా కలిసిపోయాడు. సెట్స్‌లో కూడ బాగా ఎంజాయ్‌ చేశాం. మా ఆఫ్‌స్క్రీన్‌ స్నేహామే..ఆన్‌స్క్రీన్‌
పైకి వచ్చినట్లుగా నాకు అనిపించింది. ప్రియదర్శి కూడ ఇదే ఫీలైయ్యాడు. ప్రియదర్శితో నేను చాలా సినిమాలు చేశాను. నేను ఎవరితో సినిమాలు చేసిన కంఫర్ట్‌గానే ఉంటాను.

–నేను రైటర్‌నే కానీ ఈ సినిమాకు స్క్రిప్ట్‌ పరంగా నేను చేసింది ఏం లేదు. ఎందుకంటే అనుదీప్‌నే అంతా చూసుకున్నాడు. జాతిరత్నాలు సినిమాకు హ్యూమరే బలం. అనుదీప్‌లో మంచి సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉంది. ఏ విషయాన్నైన వ్యగ్యంగా, హాస్యంగా ఎలాగైనా చెప్పగలడు. అనుదీప్‌తో ట్రావెల్‌ అయిన తర్వాత అతని నేచర్‌ మాక్కూడ వచ్చింది. కొన్ని సందర్భాల్లో అనుదీప్‌లా నేను కొన్ని జోక్స్‌ను బయట ట్రై చేశాను. నా చూట్టు ఉన్నవారు బాగా నవ్వారు. అప్పుడు నాకు అనిపించింది. జాతిరత్నాలు సినిమా కూడ ఆడియన్స్‌కు ఎక్కుతుందని.

– సినిమాలో మా మూడు క్యారెక్టర్లు (శ్రీకాంత్, రవి, శేఖర్‌)ల మధ్య పెద్ద కథ ఏం లేదు. హాస్యమే మా సినిమాను ముందుకు తీసుకువెళ్లింది. మా సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు విజయ్‌ దేవరకొండ వచ్చాడు. మా సినిమాకు డిజిటల్‌ ప్రమోషన్స్‌ ఉపయోగపడ్డాయి. నాగ్‌అశ్విన్, స్వప్నాదత్, ప్రియాంకా దత్‌లు బాగా హెల్ప్‌ చేశారు. మాది ఓ పెద్ద ప్రొడక్షన్‌ హౌస్‌ అన్న ఫీలింగే వారికి లేదు. టీమ్‌ అందరినీ బాగా చూసుకున్నారు.

– నేను జర్నలిస్ట్‌గా వర్క్‌ చేశాను. క్రైమ్‌ బిట్‌ చేశాను. ఆ తర్వాత ఫిలిం రిపోర్టర్‌ను అవుదామని అనుకుని ఫైనల్‌గా మూవీస్ చేస్తున్నాను. ఇప్పటివరకు నేను దాదాపు 38 సినిమాలు చేశాను. నేను చేసిన ప్రతి క్యారెక్టర్‌ నాకు ఇష్టమే. అర్జున్‌రెడ్డి సినిమాలో నేను చేసిన క్యారెక్టర్‌కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. మా అమ్మగారు నాకు మంచి క్రిటిక్‌. డిజిటల్‌ డెమోక్రసీ పెరిగిన ఆడియన్స్‌కు సినిమాలపై అవగాహన పెరిగింది. కొత్తదనం ఉంటేనే ఆడియన్స్‌ సినిమాలను యాక్సెప్ట్‌ చేస్తున్నారు.

– కొత్తగా కొన్ని సినిమాలను కమిట్‌ అయ్యాను. ఇటీవల ఓ సినిమాలో ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ చేశాను. నేను కూడా హీరో, విలన్‌ అయితే బాగుండని కొద్ది సేపు అనిపించింది. భవిష్యత్‌లో నా టైప్‌ ఆఫ్‌ యాక్షన్‌ సినిమాలు చేయాలని ఉంది.

 

 

 


   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved