pizza
Rahul Ravindran new film regular shooting from April
ఏప్రిల్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌లో అమ్మ నాన్న ఫిలింస్‌ మూవీ
You are at idlebrain.com > news today >
Follow Us

25 March 2016
Hyderaba
d

 

రాహుల్‌ రవీంద్రన్‌ ప్రధాన పాత్రలో... అమ్మ నాన్న ఫిలింస్‌ బ్యానర్‌పై రాథోడ్‌ దర్శకత్వంలో యువ నిర్మాత మణీంద్రన్‌. ఎమ్‌ రూపొందించనున్న చిత్రం ఏప్రిల్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాథోడ్‌ మాట్లాడుతూ.. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుంది. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్‌ అంశాలు ఇందులో ఉన్నాయి. రాహుల్‌ రవీంద్రన్‌ ప్రధాన పాత్రలో చేస్తున్న ఈ చిత్రానికి హీరోయిన్‌, ఇంకా ఇతర తారాగణం ఎంపిక జరుగుతోంది...ఏప్రియల్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది..అని అన్నారు.

చిత్ర నిర్మాత మణీంద్రన్‌. ఎమ్‌ మాట్లాడుతూ...కథ చాలా బాగా వచ్చింది. అందుకే ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా నిర్మించనున్నాము. ఏప్రిల్‌ నుండి షూటింగ్‌ మొదలవుతుంది. మంచి చిత్రంగా మా అమ్మ నాన్న ఫిలింస్‌ బ్యానర్‌లో ఈ మూవీ నిలిచిపోతుందనే నమ్మకం ఉంది..అని అన్నారు.

ఈ చిత్రానికి కథ-మాటలు: శ్రీనాథ్‌ రెడ్డి, సినిమాటోగ్రఫీ: జవహర్‌ రెడ్డి, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, సహనిర్మాత: ప్రశ్నాత్‌ తాత, నిర్మాత: మణీంద్రన్‌. ఎమ్‌, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రాథోడ్‌.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved