pizza
Raj & DK’s CinemaBandi
డీటుఆర్‌ ఇండీ బ్యాన‌ర్‌లో తొలి తెలుగు చిత్రం`సినిమాబండి`. మే 14న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌.
You are at idlebrain.com > news today >
Follow Us

30 April 2021
Hyderabad

D2R Indie, Raj & DK’s (Raj Nidimoru and Krishna DK) latest venture in nurturing budding filmmakers, launched the trailer of an independent Telugu comedy drama, Cinema Bandi. The trailer was released exclusively on Netflix India this Friday, and will start streaming on May 14, 2021.

Cinema Bandi (translating to “The Film Cart”) is for all cinema lovers. “After all, everyone is a filmmaker at heart. Especially in our country,” muse Raj & DK. And the film proves just that. In the words of Raj & DK, “It’s grassroots filmmaking at its most basic — shot by a bunch of friends — just 10 people, some of them who also doubled as actors. That’s how an indie is made!”

The film is directed by first-timer Praveen Kandregula and written by Vasanth Mariganti. The film stars an ensemble of professional and amateur actors, including Vikas Vasishta, Varanasi Sandeep Kumar, Rag Mayur, Uma YG, Sindhu Sreenivasa Murthy, Siri Vennela, Trishara. And the music is composed by another first-timer, Sirish Satyavolu.

“When we first started, we had to do it all by ourselves. So we’ve been thinking, why not be there for other filmmakers like us? Why not go back to our roots, where we started? Which brought us to — D2R Indie — our initiative to help upcoming, independent filmmakers make their films! We are happy to present Cinema Bandi as our first Telugu indie. Praveen, Vasanth & team did a fabulous job in pulling off this hilariously crazy film with a big heart!” said the filmmaker duo Raj & DK.

Cinema Bandi explores the story of a shared-auto driver who finds a camera in the backseat of his rickshaw and decides to gather his village and make a film, ‘picchar’ as they call it. Of course, no one knows anything remotely about making a film. But they have vast experience in watching films, their wits, and various ways of ‘jugad’. How hard can it be!? The film details their hilarious journey of highs and lows as they make their innocent, amateur film.

“The film is set in a village, at the border between Andhra Pradesh and Karnataka. The residents of the village speak in a curious mix of Telugu and Kannada – a strange dialect that has never been shown on the screen. This dialect and the two cultures seep into the city of Bengaluru, where I found the roots of my story. Mentored by acclaimed filmmakers, Raj and DK and premiering on Netflix, I can’t think of a better debut for our film. This is a dream come true!” happily recalls Praveen Kandregula, who will be debuting as a director with this film.

The film-maker duo has a reputation for doing the unexpected, be it India's first zombie film "Go Goa Gone,” the game-changing, blockbuster "Stree” or the much-acclaimed, super-hit series “The Family Man.” They have delivered numerous path-breaking content with an unorthodox understanding of the world they create, earning them the reputation of being a maverick duo!

Currently, they are in the middle of production of two ambitious series, one of them starring Shahid Kapoor & Vijay Sethupathi, as they await the release of the second season of ‘The Family Man.’

డీటుఆర్‌ ఇండీ బ్యాన‌ర్‌లో తొలి తెలుగు చిత్రం`సినిమాబండి`. మే 14న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌.

‘ది ఫ్యామిలీమేన్‌’ వెబ్‌సిరీస్‌ అద్భుతమైన సక్సెస్‌తో హిందీ ప‌రిశ్ర‌మతో పాటు ‌మిగతా ఇండస్ట్రీల చూపును తమ వైపు తిప్పుకున్నారు దర్శక ద్వయం రాజ్‌ అండ్‌ డీకే (రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే). కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే ఫిల్మ్‌ మేకర్స్‌ను ప్రొత్సహించడంలో కూడా ముందు వరుసలో ఉంటారు ఈ దర్శక ద్వయం. ఆ ప్రయత్నంలో భాగంగానే `డీ2ఆర్‌ ఇండీ` అనే ఓ కొత్త బ్యాన‌ర్‌ను స్టార్ట్‌ చేసి ప్రతిభావంతులైన‌ కొత్తవారిని ప్రొత్సహిస్తున్నారు. దీనిలో భాగంగా తెలుగులో తొలి అడుగుగా ఇండిపెండెంట్‌ కామెడీ ఫిల్మ్‌ ‘సినిమా బండి’ ట్రైలర్‌ను శుక్రవారం ఉదయం విడుదల చేశారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ ట్రైలర్‌ రిలీజైంది. మే 14న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

మన ఇండియాలో అంద‌రికీ సినిమా అనేది ఒక క‌ల‌. అంద‌రికీ సినిమాని నిర్మిద్దాం అనికాని, డైరెక్ట్ చేద్దాం అని కాని, యాక్ట్ చేద్దాం అని కాని.. ఇలా ఏదో ఒక క‌ల ఉండే ఉంటుంది. ఎక్క‌డో ఒక చిన్న ఆశ ఉంటుంది. సినిమాకి సంభందించిన ఏదైన ప‌ని చేయ‌గ‌ల‌మా అని. సినిమా అంటే అంత ఇష్టం మన ఇండియ‌న్స్‌కి అందులోనూ మ‌న తెలుగు వాళ్ల‌కి. మా ఈ ‘సినిమా బండి’ సినిమా లవర్స్‌ అందరి కోసం. పదిమంది స్నేహితులు కలిసి ఈ ఇండిపెండెంట్‌ సినిమాను చేశారు. ఈ సినిమా కోసం వీరిలో కొందరు యాక్టర్స్‌గా కూడా మారారు’’ అన్నారు రాజ్ అండ్ డీకే. ఈ సినిమాను ప్రవీణ్‌ కంద్రెగుల డైరెక్ట్ చేయగా, వసంత మరిగంటి ఈ సినిమాకి ర‌చ‌న చేశారు. ఈ చిత్రంలో వికాస్‌ వశిష్ఠ, వారణాసి సందీప్‌ కుమార్, రాగ్‌ మయూర్, ఉమా వైజి, సింధు శ్రీనివాసమూర్తి, సిరివెన్నెల, త్రిషర ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క‌ద్వ‌యం రాజ్‌ అండ్‌ డీకే మాట్లాడుతూ - ‘‘మా ఇద్ద‌రికీ మొద‌టి సినిమా క‌ష్టాలు తెలుసు. కొత్త ఫిలిం మేక‌ర్స్‌ని మ‌నం ఎందుకు ప్రోత్స‌హించ‌కూడ‌దు అనుకున్నాం. మా సినిమా జ‌ర్నీ ఎలా మొద‌లైందో గుర్తుతెచ్చుకున్నాం. ఆ ఆలోచనల్లో నుంచే డీ2ఆర్‌ ఇండీ అనే కొత్త ఫ్లాట్‌ఫామ్‌కు అంకురార్పణ చేశాం. ఈ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా కొత్త వారిని, ఇండిపెండెట్‌ ఫిల్మ్‌మేకర్స్‌ను ప్రొత్సహించాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు సినిమా బండిని మా ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకుస్తున్నాం. డీ2ఆర్‌ ఇండీ ఫ్లాట్‌ఫామ్‌లో తెలుగు విభాగం నుంచి వస్తున్న తొలిచిత్రం`సినిమాబండి`. ప్రవీణ్, వసంత్‌ అండ్‌ టీమ్‌ ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో అద్భుతంగా చేశారు. ఇందుకు చాలా సంతోషిస్తున్నాం’’ అన్నారు

సినిమా బండి కథ:
ఓ ఆటోడ్రైవర్‌కు కెమెరా దొరుకుతుంది. ఆ కెమెరాతో తాను తన గ్రామంలో, తన స్నేహితులతో ఓ సినిమా తీయాలనుకుంటాడు. కానీ అతనికిగానీ, అతని స్నేహితులకు కానీ సినిమాను ఎలా తీస్తారో తెలియదు. కానీ ఎన్నో సినిమాలను చూసిన వారి అనుభవం, వారికి దొరికిన కెమెరా సినిమా తీయాలనే తపన వారి సంకల్పాన్ని ముందుకు తీసుకెళుతుంది. ఈ ప్రయాణంలో ఆ ఆటోడ్రైవర్‌ ఎదుర్కున్న పరిణామాలు, ఆ గ్రామంలో జరిగిన సంఘటనలు అన్నీ వినోదాత్మకంగా బాగుంటాయి. వారి అమాయకత్వం, సినిమా చేయాలనే వారి ఆసక్తి చూసే వీక్షకులకు బాగా నచ్చుతుంది.

దర్శకుడు ప్రవీణ్ మాట్లాడుతూ - ``ఆంధ్రప్రదేశ్, కర్ణాకట సరిహద్దుల్లో ఉండే ఓ గ్రామం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. వారి మాండలికంలో తెలుగు, కన్నడ భాషలు మిళిత‌మై ఉంటాయి. వీరు మాట్లాడేభాషను ఇదివరకు ఆడియన్స్‌ వినడంగానీ, చూసిగానీ ఉండరు. రెండు సంస్కృతులు క‌లిసి ఉన్న కొన్ని సంఘటనలను బెంగళూరులో నేను చూశాను. నా కథామూలాలు అక్కడే మొదలైయ్యాయి. రాజ్‌ అండ్ డీకే వంటి ప్రముఖ దర్శకులు నా సినిమాను పర్యవేక్షించడం, అతి పెద్ద ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో నా సినిమా స్ట్రీమింగ్‌ కానుండటం చాలా సంతోషంగా ఉంది. కల నిజమైనట్లు అనిపిస్తుంది. ఒక దర్శకుడిగా పరిచయం కావాలనుకుంటున్న నాలాంటి వారికి ఇంతకుమించిన అవకాశం దొరకదు’’ అని అన్నారు

ఎప్పటికప్పుడు కొత్తరకమైన కంటెంట్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటారు రాజ్‌ అండ్‌ డీకే ద్వయం. వారు ‘గో గోవా గాన్‌’ వంటి జాంబీ ఫిల్మ్, ‘స్త్రీ’ వంటి బ్లాక్‌బాస్టర్‌ సినిమాల‌ను చేశారు. ప్ర‌స్తుతం షాహిద్‌ కపూర్, విజయ్‌సేతుపతి న‌టిస్తున్న‌ ఓ వెబ్‌సిరీస్‌ను డైరెక్ట్‌ చేస్తున్నారు. అలాగే సూపర్‌హిట్‌ వెబ్‌సిరీస్‌ ‘ది ఫ్యామిలీమేన్‌’ వెబ్‌సిరీస్‌ సెకండ్‌ సీజన్‌ను రెడీ చేస్తున్నారు రాజ్‌ అండ్‌ డీకే.

డైరెక్టర్‌: ప్రవీణ్‌ కంద్రెగుల
నిర్మాతలు: రాజ్‌ అండ్‌ డీకే
కథ: వసంతమరింగంటి
స్క్రీన్‌ ప్లే: ప్రవీణ్‌ కంద్రెగుల, వసంతమరింగంటి, కృష్ణ ప్రత్యూష
సినిమాటోగ్రాఫర్స్‌: అపూర్య సాలిగ్రమ్, సాగర్‌ వైవీవీ
ఎడిటర్స్‌: ధర్మేంద్ర కాకరాల ఎఎఫ్‌ఈ, రవితేజ గిరిజాల
మ్యూజిక్‌: శిరీష్‌ సత్యవోలు
సౌండ్‌ సింకరనైజేషన్‌ డిజైన్‌: అక్షయ్‌ పటేల్‌
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: విజయ్‌శంకర్ డొంకాడ‌, రాహుల్‌ గాంధీ
లైన్‌ ప్రొడ్యూసర్‌: అఖిల్‌రెడ్డి
అసోసియేట్‌ డైరెక్టర్స్‌: కృష్ణ ప్రత్యూష, కొండురు దీపక్‌ రాజు, వసంత మరింగంటి
అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: శ్రీనిబాబు ముసిమి, వంశీకృష్ణ కుప్పం, సిద్దార్థ్‌ వర్మ కె, చింతలరాజు, ఎమ్‌ అభిజిత్‌
అసోసియేట్‌ సినిమాటోగ్రాఫర్‌: రోహిత్‌ కొప్పు
కాస్ట్యూమ్‌ డిజైనర్స్‌: సిరివెన్నెల యడమండ్ల, కృష్ణ ప్రత్యూష
ప్రొడక్షన్‌ డిజైనర్స్‌: అఖిల్‌రెడ్డి, కృష్ణ ప్రత్యూష

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved