pizza

Rajamouli has a soft corner for Ram
RRRలో భీమ్ కంటే రామ్ క్యారెక్ట‌ర్‌ను ఇష్ట‌ప‌డ్డ ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి

You are at idlebrain.com > news today >
Follow Us

25 January 2022
Hyderabad

True multi-starrers with two big stars ceased to exist in the Telugu film industry decades back. Rajamouli brought that culture back with the RRR film. Two big heroes like NTR & Ram Charan have agreed to act together in a film just because it’s being directed by SS Rajamouli who has put the Telugu Cinema on the world map with a hugely successful Bahubali franchise.

The healthy rivalry between mega fans and Nandamuri fans dates back to decades and to a generation. It caught fire again when Rajamouli cast the new generation actor from these two families - NTR and Ram Charan. Fans of both these heroes have started speculating whose role is the biggest, popular and whistle-worthy with the release of each promotional material (posters or video promos).

NTR has donned the role of the fighter Komaram Bheem (1901-1940) who was instrumental in fighting against Razakars. Ram Charan has donned the role of Alluri Seetharama Raju (1898-1924) who sacrificed his life while fighting against the British who occupied India. RRR is a fictional account based on these two characters and the story is supposed to have happened in 1920.

You can see a coordinated fans effort during trailer release and promotional events where fans are being separated and made sure that there is no unpleasant incident resulting in fans war.

However, in an interview given in Tamil, the director SS Rajamouli categorically stated that he likes the Ram character more. It's good news to the fans of Ram Charan. We need to see which character dominated the proceedings in the film when the RRR film releases on the big screen on either 18 March or 28 April.

RRRలో భీమ్ కంటే రామ్ క్యారెక్ట‌ర్‌ను ఇష్ట‌ప‌డ్డ ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి

ఎంటైర్ సినీ ఇండ‌స్ట్రీకి ఇప్పుడు టాలీవుడ్ చుక్కానిగా మారింది. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎలాంటి సినిమాలు వ‌స్తాయోన‌ని అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న అలా ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ RRR. టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కులైన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రం కోవిడ్ కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. స‌రే! ఈ సంక్రాంతికి అయినా RRR వ‌స్తుంద‌నుకుంటే చివ‌రి నిమిషంలో కోవిడ్ ప్ర‌భావంతో వాయిదా ప‌డింది.

ప్ర‌తి సినిమాను రాజ‌మౌళి ఎంతో ప్రేమించి, శ్ర‌ద్ధ‌గా తెర‌కెక్కిస్తార‌న‌డంలో సందేహం లేదు. అలాగే RRR సినిమాను ఆయ‌న తెర‌కెక్కించారు. ఇది వ‌ర‌కు ఎన్నడూ లేని విధంగా.. ఓకే రేంజ్ ఉన్న అగ్ర క‌థానాయ‌కుల‌తో చేసిన సినిమా కావ‌డంతో ఒక‌వైపు మెగా ఫ్యాన్స్‌, మ‌రో వైపు నంద‌మూరి ఫ్యాన్స్ RRR కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌.. మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ ఇందులో న‌టించారు. 1920 బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ మూవీ ఇది.

రెండు స‌మాన‌మైన ప్రాధాన్య‌త ఉన్న బ‌ల‌మైన పాత్ర‌ల‌ను స్టార్ హీరోలు చేయ‌డం అనేది టాలీవుడ్‌లో ఈ మ‌ధ్య కాలంలో లేదు. అయితే ఒక వైపు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌. .మ‌రో వైపు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్‌.. ఈ రెండు పాత్ర‌ల్లో ఏ పాత్ర అంటే రాజ‌మౌళికి ఇష్టం అనే సందేహం ప్ర‌తి సినీ ల‌వ‌ర్‌కు ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఇదే విష‌యాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో రాజ‌మౌళిని అడిగితే త‌న‌కు భీమ్‌.. రామ్ రెండు పాత్ర‌లు అంటే ఇష్ట‌మ‌ని, రెండింటిని ఇష్ట‌ప‌డే డిజైన్ చేశాన‌ని అన్నారు. అయితే మ‌రి ప‌ర్టికుల‌ర్‌గా అడిగితే రామ్ పాత్ర భీమ్ పాత్ర కంటే కాస్త ఎక్కువ ఇష్ట‌మ‌ని తెలిపారు రాజ‌మౌళి. ఇప్పుడు స‌ద‌రు వీడియో క్లిప్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved