pizza
Hero Kartikeya’s Raja Vikramarka gets ready for Release!!
విడుదలకి సిద్ధమవుతున్న కార్తికేయ 'రాజా విక్ర‌మార్క‌'
You are at idlebrain.com > news today >
Follow Us

08 October 2021
Hyderabad


Young & Promising Actor Kartikeya Gummakonda’s upcoming Action entertainer ‘Raja Vikramarka’ getting ready for release. Presented by Adi Reddy. T, Produced by 88 Ramareddy under Sree Chitra Movie Makers, movie is directed by V.V.Vinayak’s associate, debut director Sri Saripalli. Starring Tanya Ravichandran as the female lead, team wraps up the shoot and heads up to Re-recording sessions.

Speaking on the occasion, producer ‘88 Ramareddy’ says, “Our Raja Vikramarka story is based out of Hyderabad. We had the requirement of a Temple that’s closed by the Archeological Department and luckily we got the same in Gandikota. We unveiled a Darbar set and shot crucial scenes there. We shot in the unexplored locations of Maredumalli’s Rubber forest unlike other films. We made the film on uncompromised budgets & with the cooperation of Kartikeya Gummakonda. While the Post-Production of the film is still in process, we’re planning to announce the release date soon.”

Director Sri Sarpalli says, “Kartikeya’s Characterization as NIA Agent is the biggest asset for the movie. He gave his best to this Action-packed entertaining role. As the post production works near completion, we’re heading to the Re-recording sessions. Awaiting to show your film soon in Theatres.”

Besides Kartikeya Gummakonda & Tanya Ravichandran, Sudhakar Komakula, Sai Kumar, Tanikella Bharani, Pasupathi, Harsha Vardhan, Surya, Gemini Suresh, Jabbardasth Naveen and others played major roles.

Technicians:

Cinematography: P.C.Mouli
Music: Prashanth.R. Vihari
Editing: Jeswin Prabhu
Art: Naresh Timmiri
Fights: Subbu, Nabha, Prithvi Shekar
Lyrics: Ramajogayya Shastry, Krishna Kanth
VFX Supervisor: Nikhil Koduru
Sound Effects: Sync Cinema
Presentation: Adireddy. T
Producer: ‘88’ Ramareddy
Director: Sri Saripalli

యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'రాజా విక్రమార్క'. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో '88' రామారెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కార్తికేయ సరసన సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా నటించారు. సినిమా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం రీ-రికార్డింగ్ పనుల్లో నిమగ్నం అయ్యారు.

ఈ సందర్భంగా నిర్మాత '88' రామారెడ్డి మాట్లాడుతూ "మా 'రాజా విక్రమార్క' కథంతా హైదరాబాద్ నేపథ్యంలో జరుగుతుంది. ఇందులో గుడిలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. కథ ప్రకారం పురావస్తు శాఖవారు క్లోజ్ చేసిన టెంపుల్ అయ్యి ఉండాలి. లక్కీగా మాకు గండికోటలో అటువంటి టెంపుల్ దొరికింది. అందులో దర్భార్ సెట్ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. గర్భగుడి వరకు అనుమతి ఇచ్చారు. మారేడుమిల్లిలో అందరూ చిత్రీకరిస్తున్న లొకేష‌న్‌లో కాకుండా... యునీక్ లొకేష‌న్‌కు వెళ్లి, భారీ రబ్బరు ఫారెస్టులో కీలక సన్నివేశాలు తీశాం. డంప్ యార్డ్‌లో ప్రీ క్లైమాక్స్ షూట్ చేశాం. మేకింగ్ పరంగా ఎక్కడ రాజీ పడలేదు. హీరో కార్తికేయ సహకారంతో సినిమా బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయిన తర్వాత, అతి త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం" అని అన్నారు.

దర్శకుడు శ్రీ సరిపల్లి మాట్లాడుతూ "కార్తికేయ క్యారెక్టరైజేషన్ సినిమాకు హైలైట్ అవుతుంది. ఆయన ఎన్ఐఏ ఏజెంట్‌గా కనిపిస్తారు. ఎంట‌ర్టైనింగ్‌గా సాగే యాక్షన్ రోల్‌కు కార్తికేయ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ దాదాపు పూర్తయింది. రీ-రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమాను మీ ముందుకు తీసుకురావాలని ఉంది" అని అన్నారు.

కార్తికేయ గుమ్మకొండ, తాన్యా రవిచంద్రన్ జంటగా నటించిన ఈ సినిమాలో సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి, హర్షవర్ధన్, సూర్య, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.సి.మౌళి, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి, ఎడిటింగ్: జస్విన్ ప్రభు, ఆర్ట్: నరేష్ తిమ్మిరి, ఫైట్స్: సుబ్బు,నబా, పృథ్వీ శేఖర్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ కాంత్ , విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్: నిఖిల్ కోడూరు, సౌండ్ ఎఫెక్ట్స్: సింక్ సినిమా, సమర్పణ: ఆదిరెడ్డి. టి, నిర్మాత: '88' రామారెడ్డి, దర్శకత్వం: శ్రీ సరిపల్లి.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved