pizza
Raj Dooth release on 5 July
జులై 5న 'రాజ్‌దూత్‌' సినిమా విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us

17 June 2019
Hyderabad

స్వర్గీయ రియల్‌ స్టార్‌ శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'రాజ్‌ దూత్‌'. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు. లక్ష్య ప్రొడక్షన్స్‌ పతాకంపై అర్జున్‌ - కార్తీక్‌ దర్శకత్వంలో ఎమ్‌.ఎల్‌.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మించారు. ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు ముగించుకుని జూలై5న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. కాగా, ఇటీవలే విడుదలై చిత్ర టీజర్‌ మిలియన్‌ వ్యూస్‌ అధిగమించి యూట్యూబ్‌లో అనూహ్యమైన ఆదరణ పొందుతోంది. తొలి చిత్రమైనా మేఘాంశ్‌ అద్భుతంగా నటించాడని చిత్ర నిర్మాత తెలియజేస్తున్నారు. రియల్‌ స్టార్‌ వారసుడిగా మేఘాంశ్‌ సంచలనాలు సష్టించడం ఖాయం అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. మేఘాంశ్‌ హీరోయిక్‌ లుక్‌ అందరినీ అబ్బురపరుస్తోంది. హీరోయిజానికి సరిపడే ఛామింగ్‌ డ్యాషింగ్‌ లుక్‌ అతడికి ఉంది. అతడిలో రియల్‌ స్పార్క్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. యూట్యూబ్‌.. సామాజిక మాధ్యమాల చాటింగ్‌లో పలువురు మేఘాంశ్‌ లుక్‌ .. అప్పియరెన్స్‌ పై ప్రశంసలు కురిపించారు. మొత్తానికి టీజర్‌ తోనే ప్రశంసలు దక్కించుకున్న ఈ యంగ్‌ హీరోకి తండ్రి శ్రీహరి ఆశీస్సులతో పాటు తెలుగు సినీప్రేక్షకుల ఆశీస్సులు లభిస్తాయని మేఘాంశ్‌ మాత మూర్తి శ్రీమతి శాంతి శ్రీహరి ఆకాంక్షించారు. రియల్‌ స్టార్‌కి మీడియా ఒక కుటుంబ సభ్యులుగా అండగా నిలిచారు. అదే తీరుగా ఆయన వారసుడు మేఘాంశ్‌కి మీడియా అండదండలు లభిస్తాయని శాంతి శ్రీహరి ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకులు అర్జున్‌ - కార్తీక్‌ మాట్లాడుతూ.. మేఘాంశ్‌కు తొలి చిత్రమైనా ఆయనకు సరిపడే కథాంశంతో రూపొందించాం. తను చేసిన యాక్షన్‌ సన్నివేశాలు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. యువతకు దగ్గరయ్యేట్లు అతని పెర్‌ఫార్నెన్స్‌ వుంటుందని పేర్కొన్నారు.


ఇంకా ఈ చిత్రంలో సుదర్శన్‌, కోటశ్రీనివాసరావు, ఆదిత్యమీనన్‌, ఏడిద శ్రీరామ్‌, దేవిప్రసాద్‌, అనిష్‌ కురివిళ్ళ, మనోబాల, వేణుగోపాల్‌, దువ్వాసి మోహన్‌, సూర్య, రవివర్మ, చిత్రం శ్రీను, వేణు, బిహెచ్‌ఇఎల్‌. ప్రసాద్‌, భద్రం, జెమినీ అశోక్‌, మృణాల్‌, బిందు, రాజేశ్వరి, శిరీష, నళిని, మాస్టర్‌ ఈశాన్‌ నటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌: విద్యా సాగర్ చింతా, ఎడిటింగ్ : విజయవర్దన్ కావూరి సంగీతం: వరుణ్‌ సునీల్‌, రచనా సహకారం: వెంకట్‌, డి. పాటి, పాటలు: కిట్టు విస్పాప్రగడ, రాంబాబు గోపాల, పి.ఆర్‌.ఓ:. సురేష్‌ కొండేటి, పబ్లిసిటీ: అనంత్‌, ఆర్ట్‌: మురళీ వీరవల్లి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఎం.ఎస్‌. కుమార్‌, నిర్మాత: ఎం.ఎల్‌.వి. సత్యనారాయణ (సత్తిబాబు). రచన, దర్శకత్వం: అర్జున్‌-కార్తీక్‌.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved