pizza
Raj Kandukuri interview about Mental Madhilo
ఈ సినిమాతో బాధ్యత పెరిగింది - రాజ్‌ కందుకూరి
You are at idlebrain.com > news today >
Follow Us

23 November 2017
Hyderabad

‘పెళ్లిచూపులు’ తర్వాత రాజ్‌ కందుకూరి నిర్మించిన చిత్రం ‘మెంటల్‌ మదిలో’. ఈ సినిమాలో శ్రీవిష్ణు కథానాయకుడు. శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమా గురించి రాజ్‌ కందుకూరి హైదరాబాద్‌లో మాట్లాడారు.

సినిమా గురించి చెప్పండి?
- ‘మెంటల్‌ మదిలో’ని పెళ్లి చూపులు తర్వాత నిర్మిస్తున్నాను. డిఫరెంట్‌గా ఉంటుంది. కళాఖండం తీశాను అని చెప్పను. కానీ నా మనసుకు నచ్చిన కథ ఇది. దీని కన్నా ముందు ‘కావ్యం’ అని ఒక సినిమా కథ చెప్పాడు. కానీ చాలా పొయిటిగ్గా ఉంది. కానీ అంత పొయిటిగ్గా ఉంటే కమర్షియల్‌గా ఎలా ఆడుతుందోనని అనుకున్నా. సరిగా వారం రోజుల్లోనే ఈ కథను నా దగ్గరకు తీసుకుని వచ్చాడు. నాకు డీటైల్డ్‌ నెరేషన్‌ ఇచ్చాడు. రెండున్నర గంటల్లో నాకు చెప్పాడు. వెంటనే నచ్చింది. హీరో పాత్ర చాలా అందంగా ఉంటుంది. అయోమయం అనేది ఒక ఫోన్ మధ్య, కాఫీయా? టీయా? అని కూడా కావచ్చు. చిన్న విషయాల్లో కనఫ్యూజ‌న్‌ అయితే ఇబ్బంది ఉండదు. కానీ మేజర్‌ డిసిషన తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనిషి ఎలాంటి బ్యాలన్స్‌ ఆఫ్‌ మైండ్‌ ఉండాలో చాలా బాగా చెప్పాడు. ఫస్టాఫ్‌ సరదాగా సాగే అందమైన ప్రేమకథ. సెకండాఫ్‌ సీరియస్‌గా సాగే కాన్‌ఫ్లిక్ట్‌ సిట్చువేషన్‌. దాన్ని అతనెలా డీల్‌ చేశాడన్న అంశాన్ని గమనించాను. చాలా బాగా నచ్చింది. మా సినిమాకు చాలా స్పెషల్‌ అట్రాక్షన్‌ శివాజీరాజాగారి పాత్ర. ‘డార్లింగ్‌.. ఈ సినిమా నా కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌ అవుతుంది. ఇన్నాళ్లూ నేను నా ప్రతి ఇంటరూవ్యూలో రామానాయుడిగారి పేరు చెప్పవాడిని. ఈ సారి నుంచి నీ పేరు చెబుతాను’ అని అన్నారు. ఆయన ప్రేమతో అన్న మాటలు అవి. ఎందుకంటే అందరూ ఆయన గురించి మాట్లాడుతున్నారు. హీరో శ్రీ విష్ణు చాలా అద్భుతంగా చేశాడు. తన నేచర్‌ కూడా షై పర్సన్‌. చాలా బాగా చేశాడు.

కథ అనుకున్నప్పుడే ఆయన్ని అనుకున్నారా?
- ఈ అబ్బాయి కథ చెబుతున్నంత సేపూ నాకు అతనే గుర్తుకొచ్చాడు. హీరో ఎవరనుకుందాం? అని అడిగితే వివేక్‌ కూడా ఎవరైతే బావుంటుందా అని ఆలోచించసాగాడు. అప్పుడు నేను శ్రీవిష్ణు పేరు చెప్పాను. వివేక్‌ ఓకే అన్నాడు. వెంటనే హీరోకి ఫోన్‌ చేసి ఒకసారి రమ్మని పిలిచా. ‘శ్రీవిష్ణు ముందు నువ్వు కథ విను.. నచ్చితే చేద్దువు’ అని వారిద్దరినీ వదిలేసి నేను వెళ్లిపోయాను. అప్పుడు ఇద్దరికీ కథ నచ్చి వచ్చి చేస్తామని అన్నారు.

ఈ సినిమా చేయడానికి స్పెషల్‌ రీజన్స్‌ ఉన్నాయా?
- ఉన్నాయండీ. ఈ సినిమాలోని కథతో ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట తప్పకుండా రిలేట్‌ అవుతారు. అది నాకు బాగా నచ్చింది. ‘పెళ్లిచూపులు’ వంటి భారీ హిట్‌ కొట్టాక అందరూ నేను పెద్ద సినిమాకు వెళ్తానని అనుకున్నారు. నాకు కూడా చేయాలని ఉంది కానీ, కొత్త దర్శకులతో చేయడం వల్ల నాకు ఆత్మసంతృప్తి ఎక్కువ కలుగుతుంది. ఎడిటింగ్‌, కెమెరా, సంగీతం, ఆర్ట్‌.. ఇలా చాలా శాఖల్లో కొత్తవారిని పరిచయం చేయగలిగాను.

interview gallery

సురేష్ బాబుగారితో అనుబంధం ఎలా ఉంటుంది?
- సురేష్ బాబుగారికి నచ్చుతుందనో, నచ్చాలనో. నాతో అసోసియేట్‌ అవుతారనో నేను చేయలేదు. కానీ సినిమా మొత్తం పూర్తయ్యాక ఆయన చూసి చాలా బావుందని అసోసియేట్‌ అవుతానని చెప్పారు. అంత పెద్దాయన అలా చెప్తే చాలా ఆనందంగా అనిపించింది.

షార్ట్‌ ఫిల్మ్స్‌ చేసేవారిని పరిశ్రమలోకి తీసుకురావాలని ఎందుకు అనుకున్నారు?
- వాళ్ల చేతిలో అంతకు ముందు వాళ్లు చేసింది ఏదో ఒకటి ఉంటుంది. దానికి తగ్గట్టే వారి అభిరుచులు, వారిలోని ప్రతిభ నాకు తెలిసిపోతుంది. వాళ్లతో ఓపిగ్గా ట్రావెల్‌ అవుతాను. ప్రీ ప్రొడక్షన్‌ ఎక్కువగా చేస్తాను. వీటన్నిటివల్ల నాకు షూటింగ్‌లో చాలా సమయం ఆదా అవుతుంది. ఈ సినిమాకు కూడా మేం వర్క్‌షాప్‌ చేశాం.

ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పమంటే?
- ఈ సినిమా చూసిన తర్వాత ఇంటికి వెళ్లే ప్రేక్షకులు మంచి అనుభూతిని మోసుకెళ్తారు. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఈ సినిమా చూసినవారిని హాంట్‌ చేస్తుంది. అంత గొప్ప చిత్రమిది. ఈ సినిమా విడుదలయ్యాక తప్పకుండా నా మీద మరింత బాధ్యత పెరుగుతుందన్నది వాస్తవం. రాజ్‌కందుకూరి సినిమా చేస్తే చాలా మంచి సినిమా చేస్తాడు. బ్యాడ్‌ చిత్రం మాత్రం చేయడు అని అందరూ చెప్పుకొనేలా ఉంటుంది.

టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏంటి?
- నాకు మణిరత్నంగారి, కె.బాలచందర్‌గారి సినిమాలు చాలా ఇష్టం అండీ. ‘మెంటల్‌ మదిలో’ అనే కాయినింగ్‌ చాలా బాగా నచ్చింది. దానికి తోడు ఈ సినిమాలో హీరో పాత్రకు చక్కగా సరిపోయే టైటిల్‌ అని పెట్టాం.

తదుపరి సినిమా ఏంటి?
- మరో షార్ట్‌ఫిల్మ్‌ డైరక్టర్‌తో అనుకుంటున్నాను. వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved