pizza
Rakul Preet Singh about Khakee
వారికెంతో గౌర‌మివ్వాలి - ర‌కుల్ ప్రీత్ సింగ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

18 November 2017
Hyderabad

యంగ్‌ హీరో కార్తీ, గ్లామర్‌ స్టార్‌ రకుల్‌ప్రీత్‌ హీరోయిన్‌గా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ప్రొడక్షన్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై వినోద్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌. ప్రభు, ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌ తమిళంలో నిర్మించిన `ధీరన్‌ అధికారం ఒండ్రు'. ఈ చిత్రాన్ని ఆదిత్య మ్యూజిక్‌ అధినేతలు ఉమేష్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా 'ఖాకి' పేరుతో తెలుగులో న‌వంబ‌ర్ 17న విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...

ర‌కుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ - ``ఖాకి` ఈ నెల 17న తెలుగు, త‌మిళంలో విడుద‌లై మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా చూసిన వారంద‌రూ..సినిమా చాలా చాలా బావుంద‌ని అంటున్నారు. 1995-2005లో జ‌రిగిన క్రైమ్‌ను ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు వినోద్ అద్భుత‌మైన క‌థ‌ను త‌యారుచేశారు. రెగ్యుల‌ర్ సినిమాల‌కు భిన్నంగా సినిమా ఉంద‌ని చూసిన వారంద‌రూ అంటున్నారు. పోలీసుల వ్య‌వ‌స్థ‌పై ప్ర‌జ‌ల‌కు గౌర‌వం పెంచే సినిమా ఇది. ఇక నా క్యారెక్ట‌ర్ విష‌యానికి వ‌స్తే, ప్రియ అనే అమ్మాయి పాత్ర చేశాను. పాత్ర‌నే కాదు, సినిమానే బాగా ఎంజాయ్ చేస్తూ న‌టించాను. మా నాన్న‌గారు ఆర్మీలో ప‌నిచేయ‌డం వ‌ల్ల..వారెంత క‌ష్ట‌ప‌డ‌తారో నాకు తెలుసు. నాన్న‌గారితో రాజ‌స్థాన్‌లో ఉన్న‌ప్పుడు, నాన్న ఉండే ప్లేస్ పాకిస్థాన్‌కు ద‌గ్గ‌ర‌గా ఉండేది. అందువ‌ల్ల ఫ్యామిలీతో పాటు బంక‌ర్‌లో ఉండేవాళ్లం. నాకు గ‌న్ ఫైరింగ్‌ను కూడా ద‌గ్గ‌ర‌గా చూసిన అనుభ‌వం ఉంది. కాబ‌ట్టి పోలీసులుకైనా, డిఫెన్స్‌లో ప‌నిచేస‌వారెంత రిస్క్ చేస్తారో తెలుసు. వారికి నేనెప్పుడూ గౌవ‌రం ఇస్తాను. ఇక హీరో కార్తి విష‌యానికి వ‌స్తే, త‌ను ఎక్స్‌పెరిమెంట‌ల్ యాక్ట‌ర్‌. త‌ను ఈ సినిమాలో పోలీస్ పాత్ర కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో నాకు తెలుసు. డైరెక్ట‌ర్ వినోద్‌గారు సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశారు. ప్ర‌తి పాత్ర‌ను చ‌క్క‌గా డిజైన్ చేశారు.

ప్ర‌స్తుతం మ‌న చ‌ట్ట వ్య‌వస్థ వీక్‌గా ఉండ‌టం వ‌ల్ల మ‌హిళ‌ల‌పై రేప్‌లు జ‌ర‌గుతున్నాయి. వారిని లైంగికంగా వేధిస్తున్నారు. కాబ‌ట్టి అంద‌రి కోసం ప‌టిష్ట‌మైన చ‌ట్టాన్ని రూపొందించాలి. అర‌బ్ దేశాల్లో రేప్ చేసిన వారికి క‌ఠిన‌మైన శిక్ష‌లుంటాయి. అలాంటి క‌ఠిన‌మైన శిక్ష‌ల‌ను ఇక్క‌డ కూడా విధించాలి. ఒక‌రిద్ద‌రిని అలా శిక్షిస్తే అంద‌రికీ భ‌యం వ‌స్తుంది. నేను ఇండ‌స్ట్రీలో ఇలా ఉటుంది..అలా ఉంటుందని విన్నాను. కాబ‌ట్టి 19 ఏళ్ల‌కు ఇండ‌స్ట్రీకి వ‌చ్చేట‌ప్పుడు భ‌య‌ప‌డుతూ వ‌చ్చాను. కానీ నాకు ఎలాంటి స‌మ‌స్యా రాలేదు.

నేను ప్ర‌స్తుతం నీర‌జ్ పాండేగారి ద‌ర్శ‌క‌త్వంలో `అయ్యారి` సినిమాలో న‌టిస్తున్నాను. ఇది ఆర్మీ బేస్డ్ మూవీ. నా పాత్ర కొత్త‌గా ఉంటుంది. నేను అల్రెడి డబ్బింగ్ చెప్ప‌డం కూడా స్టార్ట్ చేసేశాను. సినిమాను జ‌న‌వ‌రి లేదా ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. అలాగే త‌మిళంలో రెండు సినిమాలు, తెలుగులో ఓ సినిమా చేయ‌బోతున్నాను. త‌మిళంలో చేయ‌బోయే రెండు సినిమాల్లో..ఒక‌దానిలో మ‌ళ్లీ కార్తితో కలిసి న‌టించ‌బోతున్నారు. అదొక న్యూ ఏజ్ ల‌వ్ స్టోరీ. మిగిలిన వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలుస్తాయి`` అన్నారు.

interview gallery

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved