pizza

Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty Second Single Sottala Buggallo Out
రవితేజ-శరత్ మండవ -సుధాకర్ చెరుకూరి 'రామారావు ఆన్ డ్యూటీ' నుండి సెకండ్ సింగిల్ 'సొట్టల బుగ్గల్లో' పాట విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

07 May 2022
Hyderabad

Mass Maharaja Ravi Teja’s unique action thriller Ramarao On Duty directed by debutant Sarath Mandava and produced grandly by Sudhakar Cherukuri under SLV Cinemas LLP and RT Teamworks is one of the most awaited movies of 2022. Promotions are in full swing for the movie.

As part of musical promotions, they have released lyrical video of second single Sottala Buggallo shot on Ravi Teja and Divyansha Kaushik. It’s a beautiful romantic melody scored by Sam CS. The lead pair- Ravi Teja and Divyansha shared sizzling chemistry in the song. There is also a lip-lock sequence. While Ravi Teja looked stylish, Divyansha oozed oomph in saree. The simple, yet appealing dance moves compliment the track.

Haripriya and Nakul Abhyankar crooned the number pleasantly, while lyrics are penned by Kalyan Chakravarthy.

Based on real incidents, Rajisha Vijayan is the other heroine, while Venu Thottempudi in his comeback will be seen in a vital role in the movie.

Cinematography of the movie is by Sathyan Sooryan ISC, while Praveen KL is the editor.

Ramarao On Duty is slated for grand release worldwide in theatres on June 17th.

Cast: Ravi Teja, Divyasha Kaushik, Rajisha Vijayan, Venu Thottempudi, Nasser, Sr Naresh, Pavitra Lokesh, ‘Sarpatta’ John Vijay, Chaitanya Krishna, Tanikella Bharani, Rahul Rama Krishna, Eerojullo Sree, Madhu Sudan Rao, Surekha Vani and more.

Technical Crew:
Story, Screenplay, Dialogues & Direction: Sarath Mandava
Producer: Sudhakar Cherukuri
Banner: SLV Cinemas LLP, RT Teamworks
Music Director: Sam CS
DOP: Sathyan Sooryan ISC
Editor: Praveen KL
Art Director: Sahi Suresh

 

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ' విడుదలకు సిద్ధమౌతుంది. ఇప్పటికే 'రామారావు ఆన్ డ్యూటీ' ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా రవితేజ, దివ్యాంశ కౌశిక్‌లపై చిత్రీకరించిన సెకండ్ సింగిల్ సొట్టల బుగ్గల్లో సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ ఈ రోజు విడుదల చేసింది. ఈ పాట కోసం సంగీత దర్శకుడు సామ్ సిఎస్ అందమైన రొమాంటిక్ మెలోడీ ట్యూన్ కంపోజ్ చేశారు. ఈ పాటలో రవితేజ, దివ్యాంశ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. రవితేజ స్టైలిష్‌గా కనిపించగా, దివ్యాన్ష చీరలో అందంగా కనిపించింది. పాటలో విజువల్స్ లావిష్ గా వున్నాయి. రవితేజ్ చేసిన క్లాసీ డ్యాన్స్ స్టప్స్ కూడా అభిమానులని అలరించాయి. కళ్యాణ్ చక్రవర్తి చక్కని సాహిత్యం అందించగా, హరిప్రియ, నకుల్ అభ్యంకర్ లవ్లీగా ఈ పాటని ఆలపించారు.

యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలుగా నటిస్తుండగా, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా సత్యన్ సూర్యన్ ఐ.ఎస్.సి, ఎడిటర్ గా ప్రవీణ్ కేఎల్ పని చేస్తున్నారు.

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ''రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

తారాగణం: రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ఫేమ్ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈరోజుల్లో ఫేమ్ శ్రీ, మధుసూదన్ రావు, సురేఖ వాణి తదితరులు.

సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: ఎస్ఎల్వి సినిమాస్ ఎల్ఎల్ పి, రవితేజ టీమ్‌వర్క్స్
సంగీతం: సామ్ సిఎస్
డివోపీ: సత్యన్ సూర్యన్ ఐఎస్సి
ఎడిటర్: ప్రవీణ్ కెఎల్
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved