pizza

Triple treat for Ram Charan fans in a span of 365 days
ఏడాదిలోపే మూడు భారీ మూవీస్‌తో ‘మెగా వపర్ స్టార్’ ట్రీట్ ప‌క్కా!

You are at idlebrain.com > news today >
Follow Us

25 January 2022
Hyderabad

It’s a very difficult job for any hero to plan his career with other films while doing any of Rajamouli’s magnum opuses. Mega power star Ram Charan turned out to be smart in that way. He has three theatrical releases planned in the next 365 days.

Ram Charan’s character in Acharya was initially written as a guest character, but it became one of the principal characters as Koratala Siva made it a full-length one. Pooja Hegde is paired with him in this film. Chiranjeevi and Kajal Aggarwal are doing the other leads. Acharya is hitting the marquee on 1st April 2022.

Ram Charan has a Pan India film in the direction of Shankar and it's going to be produced by Dil Raju. Kiara Advani is playing the female lead in this huge budgeted film. It has made a huge splash with Zee reportedly acquiring non-theatrical rights for a humongous Rs. 200 crores. Next schedule will start soon and Dil Raju is planning it for Sankranthi 2023.

Producer of RRR has come up with a clever strategy of announcing double release dates. RRR Movie will release on March 18 if the entire India opens cinema halls with 100% occupancy. If not, RRR will release on 28 April 2022.

Mega power star Ram Charan has three releases in next 365 days in which two are multi-starrers (RRR & Acharya) and two are Pan India films (RRR & RC15)

ఏడాదిలోపే మూడు భారీ మూవీస్‌తో ‘మెగా వపర్ స్టార్’ ట్రీట్ ప‌క్కా!

2019లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన విన‌య విధేయ రామ సినిమా విడుద‌లైంది. ఆ సినిమా విడుద‌లైన మూడేళ్లు దాటేసింది. త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ న‌టించిన సినిమా RRR 2020లోనే విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా కార‌ణంగా సినిమా వాయిదాలు పడుతూ వ‌చ్చింది. దానికి ఎవ‌రూ ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి. రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌తో చేసిన ఈ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ కోసం ఎంటైర్ సినీ ఇండ‌స్ట్రీ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంది. జ‌క్క‌న్న త‌న సినిమా చేసే వ‌ర‌కు మ‌రో సినిమా చేయ‌డానికి ఒప్పుకోరు. ఆ క‌మిట్‌మెంట్‌తో రామ్ చ‌ర‌ణ్ మ‌రో సినిమా చేయ‌లేదు. దాదాపు త‌న పాత్ర పూర్తి కావ‌డంతో అప్పుడు ఆచార్య సినిమాలో తండ్రి చిరంజీవితో క‌లిసి న‌టించారు. ఏ సినిమా విడుద‌ల కాలేదు.

రామ్ చ‌ర‌ణ్ న‌టించిన సినిమాలు మెగాభిమానుల‌ను అల‌రించి మూడేళ్లు అయిపోయాయి. మెగా ఫ్యాన్స్ త‌మ అభిమాన హీరో చ‌ర‌ణ్‌ను ఎప్పుడెప్పుడు వెండి తెర‌పై చూద్దామా! అని ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. RRR షూటింగ్ ముగిసిందో లేదో.. రామ్ చ‌ర‌ణ్ వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌ను లైన్‌లో పెట్టేశారు. అందులో భాగంగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో RC 15ను ట్రాక్ ఎక్కించేశారు. ఈ సినిమా కొంత మేర‌కు చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసేసుకుంది. మిగిలిన చిత్రీక‌ర‌ణంతా చ‌కచ‌కా జ‌రుగుతోంది.

ప‌రిస్థితుల ప్ర‌భావ‌మో.. మ‌రేదైనా కార‌ణ‌మో ఏమో కానీ రామ్ చ‌ర‌ణ్ సినిమాలు రావ‌డం మాత్రం లేట‌య్యాయి. అయితే మెగా ఫ్యాన్స్ ఆక‌లిని తీర్చేసేంత భారీ ప్రాజెక్ట్స్‌తో రామ్ చ‌ర‌ణ్ సంద‌డి చేయ‌బోతున్నారు. ఏడాది లోపలే చర‌ణ్ మూడు భారీ బ‌డ్జెట్ చిత్రాల‌తో సిల్వ‌ర్ స్క్రీన్‌పై మెప్పించ‌డానికి రెడీ అయిపోయారు. అందులో ఒక‌టి RRR ..ఈ చిత్రం మార్చి 18 లేదా ఏప్రిల్ 28న రానుంది. ఈ సినిమాను మ‌ర‌చిపోక ముందే తండ్రి మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన ఆచార్య సినిమాలో సిద్ధ అనే ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌తో ఏప్రిల్ 1న‌ మెస్మ‌రైజ్ చేయ‌డానికి రెడీ అయిపోయారు. ఆ త‌ర్వాత RC 15ను 2023 సంక్రాంతికి విడుద‌ల చేస్తున్నారు. అంటే ఈ ఏడాది మార్చి నుంచి వ‌చ్చే ఏడాది మార్చి వ‌ర‌కు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే..అంటే ఏడాది లోప‌లే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మూడు క్రేజీ ప్రాజెక్టుల‌తో ఫ్యాన్స్ ట్రీక్ ఇవ్వ‌డానికి ఫిక్స్ అయిపోయారు. ఇందులో రెండు సినిమాలు RRR, RC 15 పాన్ ఇండియా సినిమాలు కావ‌డం విశేషం.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved