pizza
మెగాపవర్ స్టార్ 'రాం చరణ్', సూపర్ డైరెక్టర్ 'శ్రీనువైట్ల' ప్రముఖ నిర్మాత 'దానయ్య డి.వి.వి' ల చిత్రం మార్చి 5 న ప్రారంభం
You are at idlebrain.com > news today >
Follow Us

15 February 2015
Hyderabad

Ram Charan - Sreenu Vaitla film launch on 5 March

Rakul Preet Singh is paired up with Ram Charan in Sreenu Vaitla’s next project with Ram Charan as hero. This film will be produced by DVV Danayya on his new banner DVV Entertainments. It’s going to be a family entertainer with ample action elements. Kona Venkat and Gopi Mohan who had a tiff with Sreenu Vaitla following Baadshah are back to work with Sreenu. Kona Venkat and Gopi Mohan are providing story. Kona Venkat pens dialogues. Anirudh of Kolaveri Di fame is going to score music. Manoj Paramahamsa (Ye Maya Chesave fame) will handle cinematography. Narayana Reddy is the art director. Muhurat of the film will be held on 5 March. Regular shooting will start on 16 March and movie is slated for the release on October 15 (October 22 is Vijayadasami).

మెగాపవర్ స్టార్ 'రాం చరణ్', సూపర్ డైరెక్టర్ 'శ్రీనువైట్ల' ల పవర్ ఫుల్ కాంబినేషన్...
ఎన్నో ఘన విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత దానయ్య డి.వి.వి. 'డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ '(DVV ENTERTAINMENTS) పతాకంపై నిర్మించనున్న ఈ భారీ ప్రతిష్ఠాత్మక చిత్రం ప్రారంభం అవుతోంది.

'మెగాపవర్ స్టార్' సరసన 'రకుల్ ప్రీత్ సింగ్'
ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ 'రాంచరణ్' సరసన నాయికగా 'రకుల్ ప్రీత్ సింగ్' నటిస్తున్నారని నిర్మాత 'దానయ్య డి.వి.వి. తెలిపారు.

'ఫ్యామిలీ ఎంటర్ టైనర్ విత్ యాక్షన్' కధా చిత్రం : దర్శకుడు 'శ్రీనువైట్ల'.
మెగాపవర్ స్టార్ 'రాంచరణ్' తో తాను రూపొందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు 'శ్రీనువైట్ల' మాట్లాడుతూ..' 'ఫ్యామిలీ ఎంటర్ టైనర్ విత్ యాక్షన్' కధా చిత్రం గా ఈ చిత్రానికి రూపకల్పన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భారీ తారాగణం తో పాటు,అత్యున్నత సాకేంతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబవుతుందని అన్నారు.

శ్రీనువైట్ల.కోనవెంకట్, గోపీమోహన్ ల విజయాల కాంబినేషన్ : నిర్మాత దానయ్య డి.వి.వి.
ఎన్నో భారీ విజయవంతమైన చిత్రాల కాంబినేషన్ ఈ ముగ్గురిదీ. దర్శకుడు శ్రీనువైట్ల, రచయితలు కోనవెంకట్, గోపీమోహన్ ల విజయాల కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ రూపొందుతోందీ చిత్రం. మెగాపవర్ స్టార్ 'రాంచరణ్' తో తాము నిర్మిస్తున్న ఈ చిత్రానికి మూలకధ -స్క్రీన్ ప్లే -దర్సకత్వం' శ్రీనువైట్ల, కధ ను 'కోనవెంకట్, గోపీమోహన్' లు అందిస్తున్నారు. సంభాషణలను 'కోనవెంకట్' సమకూరుస్తున్నారు ఆని నిర్మాత తెలిపారు.

'వై దిస్ కొలవరి' అనిరుధ్ సంగీతం:
కొంతకాలం క్రితం 'వై దిస్ కొలవరి' పాట, ఆపాట కు సమకూర్చిన సంగీతం తెలుగునాట మారు మ్రోగిపోయిన వైనం ఇంకా ఎవరూ మరచిపోలేదు. ఆ పాటకు సంగీతం సమకూర్చిన యువ సంగీత దర్శకుడు 'అనిరుధ్ ' నేడు తమిళనాట క్రేజీ సంగీతదర్శకుడు. ఈ యువ సంగీత దర్శకుడు ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

మార్చి 5 న పూజా కార్యక్రమాలు :
ఈ చిత్రం గురించి నిర్మాత 'దానయ్య డి.వి.వి' మాట్లాడుతూ..' మెగాపవర్ స్టార్ 'రాం చరణ్', దర్శకుడు 'శ్రీనువైట్ల' ల పవర్ ఫుల్ కాంబినేషన్లో 'డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ ' పతాకంపై నిర్మించనున్న ఈ తొలి భారీ ప్రతిష్ఠాత్మక చిత్రం మార్చి 5 న ప్రారంభం కానుంది అని తెలిపారు.

మార్చి 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ :
తమ సంస్థ నుంచి రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి 16 నుంచి మొదలవుతుందని నిర్మాత దానయ్య డి.వి.వి. తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ డి. పార్వతి.

అక్టోబర్ 15 న చిత్రం విడుదల:
మెగాపవర్ స్టార్ 'రాంచరణ్', నాయిక 'రకుల్ ప్రీత్ సింగ్' లతో పాటు భారీ తారాగణం, అత్యున్నత సాకేంతిక విలువలతో తమ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి 16 నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 15 న చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చక్కని ప్లానింగ్ తో జరుగుతాయని నిర్మాత దానయ్య డి.వి.వి. తెలిపారు.


ఈ చిత్రానికి కధ: కోనవెంకట్, గోపీమోహన్, మాటలు: కోన వెంకట్, సంగీతం: అనిరుధ్, కెమెరా: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: ఎ.ఆర్.వర్మ, ఆర్ట్: నారాయణ రెడ్డి, ఫైట్స్: అనల్ అర్స్.

బ్యానర్: డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ (DVV ENTERTAINMENTS)
సమర్పణ: డి. పార్వతి
నిర్మాత : దానయ్య డి.వి.వి
మూలకధ- స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనువైట్ల


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved