18 June 2015
Hyderabad
ది తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా మల్టీ డైమన్షన్ అధినేత పి. రామ్మోహనరావు ఏకగ్రీవ ఎన్నిక
ది తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా మల్టీ డైమన్షన్ అధినేత పి. రామ్మోహనరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జూన్ 13 నుండి నామినేషన్ల పర్వం మొదలై, జూన్ 17 జరిగిన విత్‌డ్రా పర్వంతో ముగిసిన ఈ ఎన్నికలో, అధ్యక్ష పదవికి వేసిన నామినేషన్లు సాంకేతిక కారణాల వల్ల తిరస్కరించడంతో పాటు, మరోక నామినేషన్ విత్‌డ్రా అవ్వడంతో మల్టీ డైమన్షన్ అధినేత పి. రామ్మోహనరావు ఎన్నిక ఏకగ్రీవంగా మారింది. పి. రామ్మోహనరావు ది తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా రెండు సంవత్సరాలు కొనసాగనున్నారు. పి. రామ్మోహనరావు ఏకగ్రీవ ఎన్నిక సందర్భంగా తెలంగాణ నిర్మాతలు, పంపిణీ దారులు, ఎగ్జిబిటర్లు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.