
                          16 March  2020
                            Hyderabad
                          Handsome Hunk Rana Daggubati’s multi-lingual film Haathi Mere Saathi releasing in Telugu as Aranya stands postponed due to the outbreak of coronavirus.
                          The official statement from the makers read: “EROS International has always kept our audience’s interest at forefront as a core value. Healthy and happy audiences have always kept us motivated to produce and distribute unique stories that have never been told before. In light of recent developments of COVID19 Coronavirus, our recent announcement regarding the scheduled release of Haathi Mere Saathi, Aranya & Kaandan stands changed.
                          In solidarity with our partners, exhibitors, distributors and audiences, we pray for health and happiness of all and as we are monitoring the situation, we do hope that we come back with a new release date soon. Stay healthy, safe and blessed.”
                          Directed by Prabhu Solomon, the lavishly made film was earlier announced to be released across three languages – Telugu, Hindi and Tamil on April 2nd in summer, this year. Now, it stands postponed.
                          Aranya is a story of a man living in the jungle for 25 years. The film focuses on ecological issues and deforestation crisis.
                          Vishnu Vishal, Zoya Hussain and Shriya Pilgaonkar are the other prominent cast.
                          Shantanu Moitra provides sound tracks and backgrounds score while A.R.Ashok Kumar cranks the camera.
                          Cast: Rana Daggubati, Vishnu Vishal, Zoya Hussain, Shriya Pilgaonkar and others.
                          Technical Crew:
                            Produced by: Eros International
                            Directed by: Prabhu Solomon
                            Story and screenplay: Prabhu Solomon
                            Dialogues & Lyrics: Vanamaali
                            DOP: A.R.Ashok Kumar
                            Music and Background score: Shantanu Moitra
                            Sound Design: Resul Pookutty
                            Editor: BuVan
                            Production Design: Mayur Sharma
                            Costumes: Kirti kolwankar and Maria Tharakan
                            Action: ‘Stunner’ Sam and Stun Siva
                            Associate Producer: Bhavana Mounica ( Eros )
                            VFX: Phantom FX & White Apple
                            Chief Operating Officer: Kumar Ahuja (Eros)
                            Group Chief Marketing Officer: Manav Sethi (Eros)
                            Head of Distribution: Nandu Ahuja (Eros)
                            President motion pictures - Ram Mirchandani (Eros)
                           
                          హ్యండ్‌సమ్ హీరో రానా దగ్గుబాటి బహు భాషా చిత్రం 'హాథీ మేరే సాథీ' తెలుగులో 'అరణ్య'గా రానున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు.
                          ఈ సందర్భంగా నిర్మాతలు ఒక ప్రకటన విడుదల చేశారు. "ప్రేక్షకుల అభిరుచులకు ఈరోస్ ఇంటర్నేషనల్ ఎల్లప్పుడూ అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఇదివరకెన్నడూ చెప్పని విలక్షణ కథలతో సినిమాలు నిర్మించడానికీ, పంపిణీ చేయడానికి ఆరోగ్యకరమైన, ఆనందకరమైన ప్రేక్షకులు మమ్మల్ని ఎప్పుడూ మోటివేట్ చేస్తూనే ఉన్నారు. కోవిడ్ 19 కరోనా వైరస్‌కు సంబంధించి ఇటీవలి కాలంలో వెల్లడవుతూ వస్తున్న వార్తలను దృష్టిలో ఉంచుకొని 'అరణ్య', 'హాథీ మేరే సాథీ', 'కాండన్' (తమిళ వెర్షన్) సినిమాల విడుదల తేదీని మార్చాలని నిర్ణయించాం.
                          మా భాగస్వాములు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రేక్షకుల అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ, మనందరి ఆరోగ్యాన్నీ, ఆనందాన్నీకోరుకుంటూ, ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌తో మీ ముందుకు వస్తామని ఆశిస్తున్నాం. ఆరోగ్యంగా, భద్రంగా ఉండండి" అని ఆ ప్రకటనలో నిర్మాతలు తెలిపారు.
                          ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వేసవి కానుకగా ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్లు ఇదివరకు ప్రకటించారు. ఇప్పుడు ఆ విడుదలను వాయిదా వేశారు.
                          25 సంవత్సరాలుగా అరణ్యంలో జీవిస్తూ వస్తున్న ఒక వ్యక్తి కథ 'అరణ్య'. ఆ వ్యక్తిగా రానా దగ్గుబాటి నటిస్తున్న ఈ చిత్రంలో పర్యావరణం, అడవుల నరికివేత వంటి అంశాలను చర్చిస్తున్నారు.
                          విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియా పిల్గావోంకర్ ప్రధాన పాత్రధారులైన ఈ చిత్రానికి శంతను మొయిత్రా సంగీతం సమకూరుస్తుండగా, ఎ.ఆర్. అశోక్‌కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
                          ప్రధాన తారాగణం:
                            రానా దగ్గుబాటి, విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియా పిల్గావోంకర్
                          సాంకేతిక బృందం:
                            నిర్మాణం: ఈరోస్ ఇంటర్నేషనల్
                            కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రభు సాల్మన్
                            మాటలు, పాటలు: వనమాలి
                            సినిమాటోగ్రఫీ: ఎ.ఆర్. అశోక్ కుమార్
                            సంగీతం: శంతను మొయిత్రా
                            సౌండ్ డిజైన్: రసూల్ పోకుట్టి
                            ఎడిటింగ్: భువన్
                            ప్రొడక్షన్ డిజైన్: మయూర్ శర్మ
                            కాస్ట్యూమ్స్: కీర్తి కొల్వాంకర్, మరియా తారకన్
                            యాక్షన్: 'స్టన్నర్' శ్యామ్, స్టన్ శివ
                            అసోసియేట్ ప్రొడ్యూసర్: భావనా మౌనిక