కిస్.. అదేనండి ముద్దు. కొత్త తరహా ముద్దు గురించి నేర్చుకోమని మెగా హీరో వైష్ణవ్ తేజ్‌ను అతని ప్రేయసి కేతికా శర్మ చెప్పడమే కాదండోయ్.. బర్త్ డే ట్రీట్ కింద కిస్ కూడా ఇచ్చేసింది. ఇంతకీ ఆమె వైష్ణవ్ తేజ్‌కి నేర్పిస్తూ ఇచ్చిన కిస్ ఏంటో తెలుసా? బటర్ ఫ్లై కిస్. ఈ విషయాన్ని తెలుసుకునే లోపు మనకు మనకు అదేంటి? వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ ఎప్పటి నుంచి లవర్స్ అయ్యారు.. అనే సందేహం రాక మానదు. అయితే వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ బటర్ ఫ్లై కిస్ చేసుకుంది రియల్ లైఫ్‌లో కాండి బాబూ.. రీల్ లైఫ్‌లో. అసలు విషయంలోకి వెళితే, వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రంగ రంగ వైభవంగా’. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై బాపినీడు.బి సమర్పణలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా టైటిల్ టీజర్ విడుదల చేశారు.
టైటిల్ టీజర్‌ను గమనిస్తే.. అందులో బర్త్ డే బాయ్ వైష్ణవ్ తేజ్ పార్కులో కూర్చుని ఉంటాడు. గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఆమె వస్తుంది. ఏంటే ఏదో ట్రీట్ ఇస్తావనుకుంటే చేతులు ఊపుకుంటూ వచ్చావు అని సెటైర్ వేస్తాడు. అయితే ఆమె కోపగించుకోకుండా అమ్మాయిలు ట్రీట్ ఇవ్వాలంటే ఏం తీసుకు రానక్కర్లేదు అంటుంది. అదే సందర్బంలో నీకు బటర్ ఫ్లై కిస్ గురించి తెలుసా? అంటూ కిస్ ఇస్తుంది. ఎలా ఉంది? అని అంటే నెక్ట్స్ లెవల్లో ఉందంటూ మన హీరో రిప్లయ్ వింటే అబ్బో అని అనుకోక తప్పదు మరి. ఇదండి బటర్ ఫ్లై కిస్ వెనుకున్న అసలు కథ.
తొలి చిత్రం ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ మరి రంగ రంగ వైభవంగా సినిమాతో ఎలా మెప్పిస్తాడో తెలియాలంటే మాత్రం కొన్నాళ్లు ఆగాల్సిందే.