pizza
Rashmika Mandanna Launched Second Single Cheppake Cheppake From Maha Samudram
మహాసముద్రంలోని సెకండ్ సింగిల్ `చెప్పకే చెప్పకే..`ను రిలీజ్ చేసిన హీరోయిన్ రష్మిక మందన్న
You are at idlebrain.com > news today >
Follow Us

06 September 2021
Hyderabad

Promotions are in full swing for Sharwanand and Siddharth starrer intense love and action drama Maha Samudram which is gearing up for theatrical release on October 14th for Dussehra. Director Ajay Bhupathi has opted to a unique story that will have unpredictable screenplay like his first film RX 100.

Chetan Bharadwaj has rendered soundtracks and first song Hey Rambha was mass-appealing and it got tremendous response. Today, actress Rashmika Mandanna has launched lyrical video of second song Cheppake Cheppake. Although the song was shot on Aditi Rao Hydari, it will also feature Sharwanand, Siddharth and Anu Emmanuel.

A neighbor of Sharwanand, Aditi Rao Hydari loves him intensely. She follows him secretly and lives in the imaginary world of spending time with him. Interestingly, Anu Emmanuel comes into the life of Sharwa, while Aditi is seen moving closely with Siddharth.

Chaitan Bharadwaj has rendered a soothing melody with catchy lyrics from Chaitanya Prasad. Deepthi Parthasaaradhi’s vocals are very pleasant to ears. This is going to be another chartbuster.

Sunkara Ramabrahmam bankrolls the film under AK Entertainments banner. Raj Thota cranks the camera, while Praveen KL is the editor. Kolla Avinash is the production designer.

Cast: Sharwanand, Siddharth, Aditi Rao Hydari, Anu Emmanuel
Technical Crew:
Writer, Director: Ajay Bhupathi
Producer: Sunkara Ramabrahmam
Co-Producer: Ajay Sunkara
Banner: AK Entertainments
Ex-Producer: Kishore Garikipati
Music Director: Chaitan Bharadwaj
Cinematography: Raj Thota
Production Designer: Kolla Avinash
Editor: Praveen KL
Action: Venkat
PRO: Vamsi Shekar

 

సిద్దార్థ్, శర్వానంద్ కాంబినేషన్‌లో రాబోతోన్న ‘మహా సముద్రం’ సినిమా ప్రమోషన్స్ ఫుల్ జోరు మీదున్నాయి. దసరా కానుక‌గా అక్టోబర్ 14న ఈ చిత్రం థియేటర్లో సందడి చేయబోతోంది. ఆర్ ఎక్స్ 100 తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

ఇటీవ‌ల ఈ చిత్రం నుండి విడుద‌లైన‌ మాస్ సాంగ్ `హే రంభ` పాట‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. . ఇక తాజాగా రెండో పాట చెప్పకే... చెప్పకే... ఒక బ్రీజీ మరియు స్వీట్-సౌండింగ్ నంబర్ ను స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా విడుదల చేశారు. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ స్వ‌ర‌ప‌ర‌చిన లిరికల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాట అదితి రావు హైదరి మీద చిత్రీక‌రించిన‌ప్ప‌టికీ ఈ లిరికల్ వీడియోలో సిద్దార్థ్, శర్వానంద్, అను ఇమాన్యుయెల్ కూడా కనిపిస్తున్నారు.

త‌మ పక్కింటి కుర్రాడైన శర్వానంద్‌ను అదితి రావ్ హైదరి ఎంత‌గానో ప్రేమిస్తుంది. సీక్రెట్‌గా ఆమె శర్వానంద్‌ను ఫాలో అవుతూ.. ఓ ఊహా ప్రపంచంలో బ్ర‌తికేస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే అను ఇమాన్యుయేల్ శర్వానంద్ జీవితంలోకి వస్తుంది. దాంతో అదితి సిద్దార్థ్‌కు సన్నిహితంగా మారుతుంది.

ఈ పాటకు చైతన్య ప్రసాద్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. దీప్తి పార్థసరథి గాత్రం వినసొంపుగా ఉంది. ఇది కచ్చితంగా శ్రోతల హృదయాల్లో నిలిచిపోయే పాట అవుతుంది.

ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

రాజ్ తోట సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి ప్ర‌వీణ్ కె.ఎల్ ఎడిట‌ర్‌, కొల్లా అవినాష్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌.

ప్ర‌పంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 14న ‘మ‌హా స‌ముద్రం’ విడుద‌ల‌వుతుంది

నటీన‌టులు:
శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌, జ‌గ‌ప‌తిబాబు, అదితిరావు హైద‌రీ, అను ఇమ్మాన్యుయేల్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: అజ‌య్ భూప‌తి
ప్రొడ్యూస‌ర్‌: సుంక‌ర్ రామ‌బ్ర‌హ్మం
కో ప్రొడ్యూస‌ర్‌: అజ‌య్ సుంక‌ర‌
బ్యాన‌ర్‌: ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కిషోర్ గరిక‌పాటి
మ్యూజిక్‌: చైత‌న్య భ‌ర‌ద్వాజ్‌
సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: కొల్లా అవినాశ్‌
ఎడిట‌ర్‌: ప్ర‌వీణ్ కె.ఎల్‌
యాక్ష‌న్‌: వెంక‌ట్‌
పి.ఆర్‌.ఓ: వంశీ శేఖర్‌

 

 

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved