pizza
చ‌క్రి మృతి సంగీతలోకానికి తీవ్ర‌మైన లొటు -- హీరో ర‌వితేజ‌
You are at idlebrain.com > news today >
Follow Us

15 December 2014
Hyderabad

ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం ,ఇడియ‌ట్‌, అమ్మా నాన్నా ఓ త‌మిళ‌మ్మాయ్ లాంటి ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల‌కి అద్బుత‌మైన సంగీతాన్ని అందించిన సంగీత ద‌ర్శ‌కుడు చ‌క్రి.. దాదాపు ర‌వితేజ స‌క్స‌స్ కెరీర్ లో త‌న‌తో ట్రావెల్ అయ్యారు చ‌క్రి.. ఈరోజు ఉద‌యం చ‌క్రి మ‌ర‌ణ‌వార్త విన్న ర‌వితేజ దిగ్బ్రాంతి కి లోన‌య్యారు. త‌న కెరీర్ స్టార్టింగ్ నుండి త‌న‌తో మ‌రియ పూరిజ‌గన్నాధ్‌ల‌తో ట్రావెల్ అయ్యిన వెరీ టాలెంటెడ్ సంగీత ద‌ర్శ‌కుడు చ‌క్రి ఇలా హ‌ఠార్మ‌ణం చెంద‌టం చాలా భాదాక‌రం. చ‌క్రి మ‌ర‌ణం యావ‌త్ సంగీత లోకానికి తీవ్రమైన లోట‌ని, చ‌క్రి ఎక్క‌డ వున్నా అత‌ని ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని కోరుకుంటూ అలానే వారి కుటుంబ స‌భ్యుల‌కి నా తీవ్ర సంతాపాన్ని తెలుపుతున్నాను, వారి కుటుంబానికి మ‌నోధైర్యం ఇవ్వాల‌ని ఆ భ‌గ‌వంతుడ్ని కోరుకుంటున్నాను అని అన్నారు

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved