pizza
Kalyan Krishna to direct Ravi Teja
డిసెంబ‌ర్ చివ‌రివారంలో మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం
You are at idlebrain.com > news today >
Follow Us

13 December 2017
Hyderabad

రాజాదిగ్రేట్ లాంటి గ్రాండ్ స‌క్స‌స్ ల త‌రువాత మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ హీరోగా , సోగ్గాడే చిన్న‌నాయ‌న‌, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి భారి విజ‌యాల‌తో దూసుకుపోతున్న యంగ్ డైర‌క్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలొ ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో రామ్ తాళ్ళూరి నిర్మాత గా తొలి చిత్రం తెర‌కెక్కానుంది. ఈ చిత్రానికి సంభందించి రెగ్యుల‌ర్ షూటింగ్ ని డిసెంబ‌ర్ నెలాఖ‌రున ప్రారంభిస్తున్నారు.

ఈ సంధ‌ర్బంగా నిర్మాత రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ.. ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో మొద‌టి చిత్రంగా మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ గారు హీరోగా, క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌కుడిగా ఓ చిత్రాన్ని చేస్తున్నాము. మెద‌టి చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ని ప్రారంభిస్తున్నాము. క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌కుడుగా చేసిన రెండు చిత్రాలు కూడా ఫ్యామిలి ఎంట‌ర్‌టైన్‌మెంట్ గా తెర‌కెక్కించారు. ఫ్యామిలి ఆడియ‌న్స్ లో క‌ళ్యాణ్ గారి చిత్రాల‌కి ఓ ప్ర‌త్యేఖ‌త వుంది. అలాగే మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ గారి చిత్రం అంటే అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. ఇప్ప‌డు స‌క్స‌స్ లో వున్న వీరిద్దిరి కాంబినేష‌న్ లో చిత్రం కావ‌టం క్రేజి కాంబినేష‌న్ గా ట్రేడ్ వ‌ర్లాల్లో బ‌జ్ రావ‌టం చాలా ఆనందంగా వుంది. మ‌రిన్ని వివ‌రాలు అతిత్వ‌ర‌లో తెలియ‌జేస్తాం.. అని అన్నారు

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved