pizza
Revanth about Raja Meeru Keka
సినిమాకు సంబంధించి అన్ని విభాగాలు గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది - రేవంత్‌
You are at idlebrain.com > news today >
Follow Us

3 June 2017
Hyderabad

ఆర్‌.కె.స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రేవంత్‌, నోయ‌ల్‌, హేమంత్‌, లాస్య‌, శోభిత ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందిన చిత్రం `రాజా మీరు కేక‌`. కృష్ణ కిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్‌కుమార్‌.ఎం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జూన్ 9న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా హీరో రేవంత్ పాత్రికేయుల‌తో మాట్లాడారు.

రేవంత్ మాట్లాడుతూ - ``''రాజా మీరు కేక' చిత్రంలో నేను సాఫ్ట్‌వేర్‌లో జాబ్‌ చేసే మధ్య తరగతి యువకుడి పాత్రలో కనపడతాను. నా స్నేహితులుగా నోయల్‌, హేమంత్‌, లాస్య నా స్నేహితలుగా కనపడతారు. మా అందరం కుటుంబాలంటే విలువనిస్తుంటాం. మా స్నేహితులంతా కలిసి మన సిస్టమ్‌లోని ఓ సమస్యను ఎలా పరిష్కరించామనదే కథ. శోభిత నాకు జోడిగా నటిస్తుంది. నేను సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ నుండే వచ్చాను. నేను జర్నలిస్ట్‌గా పనిచేసిన తర్వాత శ్రీరామరాజ్యం సినిమాను నాన్నగారు నిర్మించారు. తర్వాత ఇంటింటా అన్నమయ్య సినిమాలో హీరోగా నటించాను. ఆ సినిమా విడుదల జాప్యంలో కాస్తా నిరాశ పడ్డ మాట నిజమే. సినిమాల్లో గ్యాప్‌ వచ్చినమాట తెలిసిందే. తర్వాత డాక్యుమెంటరీస్‌లో నటించాం. సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. దర్శకుడిని కలిసినప్పుడు ఆయన చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నాను. ఆయనకు కథపై ఉన్న పట్టు, స్క్రీన్‌ప్లే నచ్చింది. చాలా ఫ్రెండ్లీ పర్సన్‌. నిర్మాతగారు అందరికీ స్వేచ్చనిచ్చారు. ఆయన ఇచ్చిన స్పేస్‌ వల్లనే సినిమా అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. నెక్స్‌ట్‌ మూవీస్‌ గురించి త్వరలోనే తెలియజేస్తాను'' అన్నారు.

interview gallery

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved