pizza
'రేయ్ ' చిత్రం ఆ మహానుబావులకు అంకితం ఇస్తూ స్మరించుకుంటున్నాను - దర్శక నిర్మాత వై వి ఎస్ చౌదరి
You are at idlebrain.com > news today >
Follow Us

20 March 2015
Hyderabad

బొమ్మరిల్లు పతాకం పై నా దర్శకత్వం లో నిర్మించిన 'రేయ్' చిత్రం ఎన్నో వ్యయ ప్రయాసలకు లొనైనా చిత్రాన్ని అత్య అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాము. మేము పడిన కష్టాన్ని మరిచిపోయే విదంగా ఈ రోజు రేయ్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 27న మీ ఆశీర్వదం పొందడానికి హాట్ సమ్మర్ లో కార్టేన్ రైసర్ గా మీ ముందుకు వస్తున్నాము. బొమ్మరిల్లు బానర్ లో ప్రతి సినిమా టైటిల్స్ కి ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామరావు గారి స్మ్రుతాంజలి గటిస్తూ సినిమా మొదలవుతుంది అన్న విషయం తెలిసిందే. అది కాక ఇప్పుడు రేయ్ విడుదల సందర్భంగా, 2014 తో ముప్పై ఏళ్ళ నా సినీ జీవిత ప్రస్థానం లో నన్ను ప్రభావితున్ని చేసి నా అభివృద్ధికి తోడ్పడిన మహా వ్యక్తులను స్మరించు కోవడం నా భాద్యత, కర్తవ్యం. అందుకు గాను సినిమా టైటిల్స్ ముందుగా వాళ్ళను స్మరిస్తూ ఫోటో కార్డ్స్ వేయడం జరిగింది.

వారిలో ముందుగా స్వర్గీయ అక్కినేని నాగేశ్వర్ రావు గారు. అక్కినేని నాగార్జున గారి ప్రోస్చాహం తో అన్నపూర్ణ బానర్ లో నా మొదటి చిత్రమే నా జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం, అలాంటి బానర్ లో దర్శకత్వం వహిచే అవకాశం ఏయన్నార్ గారితో రావడం నిజంగా నా అదృష్టం. తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో 2వ కన్నుగా వెలుగొందిన ఆయన మరణం తీరని లోటు. రేయ్ చిత్రానికి ముహూర్త పు క్లాప్ కొట్టిన ఆయన ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉంటుందని బావిస్తూ ఈ చిత్రాన్ని ఆయనకు 'అంకితం' ఇస్తున్నాము.

నా చిత్రాలు ఏవైనా పంచ ప్రాణాలుగా చూసుకునే అంశం మ్యూజిక్, మ్యూజిక్ పరంగా ముక్యమైనవి రెండు సినిమాలు ఒక దేవదాసు అయితే రెండోది రేయ్, ఈ రెండు చిత్రాలకు చక్రి అహర్నిషలు ఎంతో కష్ట పడి మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రానికి తన డ్యూటీ పూర్తి చేసి వెళ్ళిపోయారు. చనిపోయాక చెడ్డవాళ్ళు కూడా మంచి వాళ్ళు అయిపోతారు... కాని బతికుండగానే చాల మంచివాడిగా పేరు తెచ్చుకున్నా రు చక్రి. ఆయనకు కూడా రేయ్ చిత్రాన్ని అంకితం ఇస్తూ స్మరించుకుంటున్నాము.

సహస రత్న నందమూరి హరి కృష్ణ కథానాయకుడిగా లాహిరి లాహిరి లాహిరిలో చిత్రంతో నా బొమ్మరిల్లు బానర్ ఆవిర్భవించింది. ఆయనతో సీతా రామరాజు, సీతయ్య వంటి సక్సెస్ చిత్రాలకు దర్శకత్వం వహించాను. మొదటినుండి ఆయన నాకు ఇచ్చిన ప్రోస్చాహం మరవలేనిది. ఆలాంటి ఆయన జీవితం లో జీర్న్నిన్చుకోలేని సంఘటన నందమూరి జానకి రామ్ మరణం. స్నేహ శీలి, సున్నిత మనస్కుడు నిర్మాత స్వర్గీయ నందమూరి జానకి రామ్ ను రేయ్ విడుదల సందర్భంగా స్మరించుకుంటూన్నాము.

అదే విధంగా ఈ జన్మనిచ్చిన పిత్రుదేవుడు నిత్య శ్రామికుడు, నిరంతర కృషీవలుడు, స్వర్గీయ యలమచిలి నారాయణ రావు గారిని, మా అన్న గారైన యలమంచిలి సాంబ శివ రావు గారిని, నా అభివృద్దిని కాంక్షించిన మిత్రుడు అట్లూరి మానవేంద్ర నాథ్ చౌదరి గారిని రేయ్ విడుదల సందర్భంగా స్మరించు కుంటున్నాను.

నాకు మెదటి నుండి వేస్త్రెన్ మ్యూజిక్ అంటే ప్రాణం అందులో మైకేల్ జాక్సన్ పాప్ మ్యూజిక్ అంటే మరి ఇష్టం. అందుకే నా చిత్రాలలో తప్పని సరిగా వేస్త్రెన్ మ్యూజిక్ బేస్ సాంగ్స్ వుంటాయి. ఆలాంటి మ్యూజిక్ కి రారాజు మైకేల్ జాక్సన్ ను కూడా ఈ సందర్భంగా స్మరించు కుంటున్నాను.

ఇక పవనిజం సాంగ్ విషయానికొస్తే మార్చి 19 నుండి అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జాని డాన్స్ మాస్టర్ నేతృత్వం లో హీరో సాయి ధరమ్ తేజ్, హీరోఇన్స్ సైయ్యామి ఖేర్, శ్రద్ధ దాస్, నోయల్ షాన్ మరియు డాన్సర్స్ పై రాత్రి పగలు చిత్రికరిస్తున్నాం. రేయ్ చిత్రం మార్చి 27 న విడదల అయిన ఒకటి రెండు రోజుల్లో ఈ పాటను యాడ్ చేయడం జరుగు తుంది.రేయ్ చిత్రం విడుదలకు మాకు అన్ని విదాల సహకరిస్తున్న రమేష్ ప్రసాద్ గారికి, విజయేంద్ర ప్రసాద్ గారికి, శోభన్ బాబు గారికి మరియు ప్రసన్న కుమార్ గారికి ధన్య వాదాలు. ఎంతో కష్ట పడి, ఎన్నో ఒడి దుడుకులను ఎదుర్కొని మార్చి 27 న మీ ముందు వస్తున్నాం మీ విలువైన సమయాన్ని వృదా చెయ్యం 100 శాతం వినోదాన్ని ఇస్తాం. సినిమా చూసి మమ్మలి ఆశిర్వదించండి.

ఇట్లు
మీ వై వి ఎస్ చౌదరి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved