pizza
విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న 'రేయ్' థియేటర్లలో గుడ్ ఫ్రైడే నుండి 'పవనిజం' సాంగ్ జత చేస్తున్నాం - వై వి యస్ చౌదరి
You are at idlebrain.com > news today >
Follow Us

02 April 2015
Hyderabad

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సాయిధరమ్‌తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ, బొమ్మరిల్లు పతాకం పై వై.వి.యస్‌.చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన భారీ బడ్జెట్‌ చిత్రం 'రేయ్' కొత్తధనంతో కొత్త బ్యాక్‌డ్రాప్ తో, హాలీవుడ్ స్టైల్లో నిర్మించిన యూత్ ఫుల్ మ్యూజిక్ ల్ ఎంటర్టైనర్ 'రేయ్'. సమ్మర్ కర్టెన్ రైజర్ గా మార్చి 27 న రెండు రాష్ట్రాల్లోని, ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి అన్ని ఏరియాలో ఎక్స్‌ట్రార్డినరీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. అద్భుతమైన టాక్ తో రోజు రోజుకి మంచి కలెక్షన్స్‌తో రెండవ వారం లోకి ఎంటర్ అయ్యిన 'రేయ్' చిత్రం ప్రదర్శింపబడుతున్న థియేటర్లలో గుడ్ ఫ్రైడే నుండి 'పవనిజం' సాంగ్
జత చేయడమైనది.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత వై.వి.యస్‌.చౌదరి:
"మేము ఊహించిన విధంగానే 'రేయ్' మాస్ ని యూత్ ని బాగా ఆకట్టుకుంది. సాంగ్స్ కి, డైలాగ్స్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక డిఫరెంట్ మూవీ తీసాడు వై వి యస్ చౌదరి అని ప్రేక్షకులు అభినందనలు తెలుపుతుంటే మేము పడ్డ కష్టాన్ని మరిచిపోయం. మా బొమ్మరిల్లు బానర్ కి మరో హిట్ ఇచ్చిన ప్రేక్షకులు అందరికి నా ధన్యవాదాలు.ముఖ్యంగా మెగా అభిమానులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ' రేయ్' విడుదలకు ముందు మేము ప్రకటించిన విధంగానే పవన్ కళ్యాణ్ కి ట్రిబ్యూట్ గా మేము రెడీ చేసిన పవనిజాం సాంగ్ ను ఇప్పుడు విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న 'రేయ్' థియేటర్లలో గుడ్ ఫ్రైడే నుండి 'పవనిజం' సాంగ్ జత చేస్తున్నాం. క్యూబ్, పి యెక్ష్ డి, యు యఫ్ ఓ, శ్రంబుల్ లాంటి డిజిటల్ టెక్నాలజీ తో అన్ని థియేటర్ లలో చూడొచ్చు. అదనంగా జత చేస్తున్న ఈ 'పవనిజం' సాంగ్ మెగా అభిమానుల్ని ప్రేక్షకుల్ని మరింత అలరిస్తుందని, ఉస్చ్తహ పరుస్తుందని బావిస్తున్నాను." అని అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved